రవితేజకి విలన్ గా మంచు మనోజ్ ?.. బేబీ నిర్మాత పెద్ద స్కెచ్చే వేసాడుగా..
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటిస్తున్నాడు. 1970, 80 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ కాకముందే రవితేజ తదుపరి చిత్రానికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారుతోంది.
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటిస్తున్నాడు. 1970, 80 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. వంశీ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం రిలీజ్ కాకముందే రవితేజ తదుపరి చిత్రానికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన లేనప్పటికీ వస్తున్న వార్తలు మాత్రం యమా క్రేజీగా ఉన్నాయి. ఎందుకంటే రవితేజ తదుపరి చిత్రం మల్టి స్టారర్ అని అంటున్నారు.
మాస్ కా దాస్ గా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్, మాస్ మహారాజ్ రవితేజ లతో సెన్సేషనల్ బేబీ చిత్ర నిర్మాత ఎస్కెయన్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కలర్ ఫోటో చిత్రంతో ప్రతిభగల దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్న సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంలో విలన్ పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతోందట.
దీని కోసం సర్ప్రైజింగ్ గా మంచు మనోజ్ ని సంప్రదిస్తున్నారట. రవితేజ, విశ్వక్ సేన్, మంచు మనోజ్ కాంబినేషన్ ఎలాగైనా వర్కౌట్ అయ్యేలా ఎస్ కె ఎన్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఎస్ కె ఎన్ రీసెంట్ గా బేబీ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎమోషనల్ అండ్ బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన బేబీ మూవీ నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల జాబితాలో నిలిచింది.
దీనితో ఎస్ కె ఎన్ తదుపరి చిత్రాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. మంచు మనోజ్ కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చింది. స్ట్రాంగ్ కంబ్యాక్ కూడా మంచు మనోజ్ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తే అది ఒక డిఫెరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. వర్కౌట్ అయితే మంచు మనోజ్ హీరోగా కూడా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అని నెటిజన్లు అంటున్నారు.