మంచు మనోజ్ తో యాంకర్ శ్రీముఖి పులిహోర.. ఆళ్లగడ్డ నుంచి బాంబులు పడిపోతాయంటూ స్వీట్ వార్నింగ్..
మంచు మనోజ్.. టీవీ షోలో సందడి చేశాడు. శ్రీముఖి యాంకర్‌గా చేసిన షోకి వచ్చి ఆమెకే వార్నింగ్ ఇచ్చాడు. పులిహోర కలుపుతూ ఆయన వద్దకు రావడంతో స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
photo credit - etv
మంచు మనోజ్ ఈ మధ్య బయటకొస్తున్నారు. బాగా యాక్టివ్ అవుతున్నారు. మొన్న ముంబయిలో సందడి చేసిన ఆయన తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఇందులో మంచు మనోజ్ చేసిన కామెంట్ ఆశ్చర్యపరుస్తుంది. శ్రీముఖికి వార్నింగ్ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది.
photo credit - etv
మంచు మనోజ్.. ఈటీవీ `దీపావళి` స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. సుమ, శ్రీముఖి యాంకర్లుగా వ్యవహరించారు. దీనికి గెస్ట్ గా మంచు మనోజ్ వచ్చారు. వచ్చీ రావడంతో తనదైన స్టయిల్ కామెంట్లు, పంచ్‌లతో రెచ్చిపోయాడు. శ్రీముఖి ఆవేశంలో తన వద్దకు వచ్చిన ఇంగ్లీష్‌లో మాట్లాడగా, మీ ప్రొనౌన్సేషన్ కరెక్ట్ గా లేదని, అందులో ఉన్న తప్పేంటో చెప్పడంతో నవ్వులు పూసాయి.
photo credit - etv
దీంతో ఎలా అడిగితే చెబుతారని శ్రీముఖి అడగ్గా, దగ్గరకు వచ్చి అడిగితే చెబుతా అన్నాడు మనోజ్. దీంతో ఇదే అదనుగా భావించిన శ్రీముఖి దగ్గరకొచ్చి మనోజ్ చేయి పట్టుకుని పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. దీంతో షో నిర్వహకులు వీరిద్దరికి లవ్ సింబల్ వేస్తూ, రొమాంటిక్ సాంగ్ కూడా వేసే ప్రయత్నం చేశాడు.
photo credit - etv
పరిస్థితి అదుపు తప్పుతుంది, సీన్ ఎక్కడికో దారి తీస్తుంది. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న సుమ వద్దు వద్దు అంటూ స్పందించింది. మనోజ్ కి కూడా సీన్ అర్థమైంది. వద్దు వద్దు అంటూ, ఇది చూస్తే .. ఆళ్లగడ్డ నుంచి బాంబులు పడిపోతాయంటూ శ్రీముఖిని హెచ్చరించడం విశేషం. దీంతో అంతా షాక్ అవ్వగా, షోలో నవ్వులు విరిసాయి.
photo credit - etv
అనంతరం ఇంటిని బాగానే చూసుకుంటారుగా అని శ్రీముఖి అడగ్గా, చూసుకుంటాడను, ఫ్రిజ్ ఎక్కడ అని అనడం కామెడీ పంచింది. ఫ్రిజ్‌లో అవెక్కడ మామ అనగా, పండుగ రోజులు పూజలుంటాయి కదా అందుకే పక్కన పెట్టామని శ్రీముఖి చెప్పింది.
photo credit - etv
మా పూజే అదండి అని మనోజ్ పంచ్‌కి శ్రీముఖికి దిమ్మ తిరిగిపోయింది. ఇదే యాటిట్యూడ్‌తో వెళ్లిపోతే సరిపోతుందని సుమ అనగా, అయితే సరే, అరేయ్ కారుస్టార్ట్ చేయరా? అనడం మరింత నవ్వులు పంచింది.
photo credit - etv
చివరగా యాంకర్ విష్ణు ప్రియా కొట్టిన షాట్‌కి మీటర్ 124 దాటింది, దీంతో మనోజ్ రెచ్చిపోయాడు. `నిన్ను చేసుకునే వాడు ఆహా.. ఆహా.. `, `తిను చేసుకునే వాడు ఓహో ఓహో.. `అంటూ విష్ణుప్రియని ఓ ఆట ఆడుకున్నారు. ప్రస్తుతం `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు` పేరుతో విడుదలైన ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.