- Home
- Entertainment
- చెట్టు పేరు చెప్పుకుని అమ్ముడు పోవడానికి నేను కాయో, పండో కాదు..మనోజ్ కామెంట్స్, ఫుల్ జోష్ లో కనిపించాడుగా
చెట్టు పేరు చెప్పుకుని అమ్ముడు పోవడానికి నేను కాయో, పండో కాదు..మనోజ్ కామెంట్స్, ఫుల్ జోష్ లో కనిపించాడుగా
మనోజ్ చాలా రోజుల తర్వాత వరుస చిత్రాలతో బిజీ అయ్యారు. ఒకవైపు మిరాయి చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. తాజాగా భైరవం చిత్రంలో కూడా నటించారు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఇది.

మంచు ఫ్యామిలీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం. మనోజ్ ఒకవైపు, మంచు ఫ్యామిలీ ఒకవైపు అన్నట్లుగా వివాదాలు జరుగుతున్నాయి. ఆస్తుల విషయంలో ఇంటి మ్యాటర్ రచ్చకెక్కింది. ఇప్పట్లో మంచు ఫ్యామిలిలో గొడవలు ఆగేలా లేవు. తండ్రి మోహన్ బాబుతో, సోదరుడు విష్ణుతో మనోజ్ కి అసలు పడడం లేదు. ఇదంతా పక్కన పెడితే మనోజ్ చాలా రోజుల తర్వాత వరుస చిత్రాలతో బిజీ అయ్యారు.
ఒకవైపు మిరాయి చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. తాజాగా భైరవం చిత్రంలో కూడా నటించారు. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఇది. నేడు టీజర్ ని లాంచ్ చేశారు. పవర్ ఫుల్ యాక్షన్ తో టీజర్ అదిరిపోయింది. మనోజ్ తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే పాత్రలో నటించినట్లు ఉన్నాడు. యాక్షన్ అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. టైటిల్ కి తగ్గట్లుగానే దైవభక్తి అంశాలు ఎక్కువగా ఉండేలా ఉన్నాయి.
టీజర్ లాంచ్ లో మంచు మనోజ్ ఫుల్ జోష్ లో కనిపించారు. ఫ్యామిలిలో జరుగుతున్న గొడవల ప్రభావం మనోజ్ లో కనిపించలేదు. చాలా సరదాగా మాట్లాడుతూ మధ్యమధ్యలో జోకులు వేస్తూ మాట్లాడారు. ఈ చిత్ర షూటింగ్ లో నాలుగు నెలలు తెలియకుండా గడిచిపోయాయి అని మనోజ్ అన్నారు. తమ్ముడు బెల్లంకొండ శ్రీనివాస్ తో కలసి నటించడం సంతోషంగా ఉంది. హి ఈజ్ కాంప్లాన్ బాయ్ అంటూ మనోజ్ నవ్వించారు. శ్రీనివాస్ వాళ్ళ అమ్మ ప్రతి రోజు నాకు ఇష్టమైన పప్పు కూర పంపేవారు. మొహమాటం లేకుండా బకెట్లు బకెట్లు తిన్నా అని మనోజ్ ఫన్నీ కామెంట్స్ చేశారు.
నారా రోహిత్ గురించి మాట్లాడుతూ.. రోహిత్ తో నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఈ సినిమాతో ఇంకా బాగా క్లోజ్ అయ్యాం అని తెలిపారు. నారా ఫ్యామిలీతో స్టెప్పులు వేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని మరోసారి మనోజ్ నవ్వించారు. చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరిని మనోజ్ పేరు పేరునా ప్రస్తావించారు. చివర్లో తన స్పీచ్ ముగిస్తూ చెట్టు పేరు చెప్పుకుని అమ్ముడుపోవడానికి నేను కాయో పండో కాదు.. మనోజ్ ని అంటూ పవర్ ఫుల్ గా ముగించాడు.