- Home
- Entertainment
- తమ పెళ్లిలో మంచు మనోజ్, మౌనిక కన్నీళ్లు.. గెస్ట్ లా వచ్చిపోయిన అన్న విష్ణు.. మంచు వారింట్లో ఏం జరుగుతుంది?
తమ పెళ్లిలో మంచు మనోజ్, మౌనిక కన్నీళ్లు.. గెస్ట్ లా వచ్చిపోయిన అన్న విష్ణు.. మంచు వారింట్లో ఏం జరుగుతుంది?
మంచు మనోజ్, మౌనికల పెళ్లి జరిగి మూడు రోజులవుతుంది. అయితే పెళ్లిల్లో మనోజ్, మౌనిక ఎమోషనల్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మరోవైపు అన్న విష్ణు ఎందుకు అంటి ముట్టనట్టుగా వ్యవహరించారనేది చర్చనీయాంశం అవుతుంది.

మంచు మనోజ్ రెండో పెళ్లి మూడు రోజుల క్రితం గ్రాండ్‌గా జరిగింది. మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనిక రెడ్డిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి అక్క మంచు లక్ష్మి పెద్దగా వ్యవహరించారు. అయితే ఈ పెళ్లిలో అటు మంచు మనోజ్, ఇటు మౌనిక కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అవుతుంది. మౌనిక ఏడవడంలో ఓ లెక్కుంది, కానీ మనోజ్ ఎందుకు ఎమోషనల్ అయ్యాడనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు మంచు విష్ణు గెస్ట్ గా వచ్చిపోవడం కూడా కొత్త చర్చకి తెరలేపుతుంది.
మంచు మనోజ్, మౌనిక చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారు. తమ మొదటి భాగస్వాములకు విడాకులిచ్చిన తర్వాత ఈ ఇద్దరు దగ్గరయ్యారు. గతేడాది వినాయక చవితి సమయంలో తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామనే విషయాన్ని బయటికి తెలిసేలా చేశారు మనోజ్. ఈ ఇద్దరు కలిసి ఓ వినాయక మండపాన్ని సందర్శించి పూజలు చేశారు. అప్పట్నుంచో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు చాలా కాలంగా ఈ ఇద్దరు కలిసే ఉంటున్నారనే చర్చ జరిగింది.
ఇదిలా ఉంటే ఈ పెళ్లి తండ్రి మోహన్‌బాబుకి ఇష్టం లేదనే పుకార్ తెరపైకి వచ్చింది. కానీ మోహన్‌బాబు దగ్గరుండి వీరి పెళ్ళి జరిపించారు. అయితే ఈ క్రమంలో మోహన్‌బాబు తన వద్దకు వచ్చినప్పుడు ఎమోషనల్ అయ్యింది మౌనిక. ఆయన్ని పట్టుకుని ఏడ్చేసింది. సడెన్‌గా ఆమె అంతగా ఎమోషనల్ అవ్వడంతో, ఈ రూమర్లకి బలం చేకూరినట్టయ్యింది. ఇష్టం లేని మోహన్‌బాబు ఎట్టకేలకు పెళ్లికి రావడంతో ఆమె ఎమోషనల్ అయినట్టు అర్థమవుతుంది.
మరోవైపు కాబోయే భార్య మౌనిక తనకు జిలకర్ర బెల్లం పెట్టే సమయంలోనూ మంచు మనోజ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మనోజ్ ఆనందంతో ఎమోషనల్ అయ్యాడా? లేక తమ ప్రేమ పెళ్లితో నిజం కాబోతుందనే హ్యాపీనెస్‌తో కన్నీళ్లు పెట్టుకున్నాడా? లేక పెళ్లి ఒప్పించేందుకు తాను పడిన సంఘర్షణలోనుంచి ఈ కన్నీళ్లు వచ్చాయా? అనేది సర్వత్రా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.
ఇదిలా ఉంటే ఈ పెళ్లిలో అన్న మంచు విష్ణు మాత్రం జస్ట్ ఓ గెస్ట్ లా వచ్చిపోయారు. మనోజ్, మంచు లక్ష్మి పంచుకున్న ఫోటోల్లో విష్ణు లేరు. ఆయన తన భార్యా పిల్లలతో కేవలం అతిథిలా వచ్చి వెళ్లారని తెలుస్తుంది. అయితే ఈ పెళ్లి ఆయనకు కూడా ఇష్టం లేదా? అనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది. అంతేకాదు ఈ పెళ్లి కూడా మంచు మోహన్‌బాబు ఇంట్లో కాకుండా అక్క లక్ష్మి ఇంట్లో(ఫిల్మ్ నగర్‌లో) జరిగింది. దీంతో ఏదో జరిగింది, ఏదో జరుగుతుందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
మొత్తంగా ఇంట్లో వారికి ఇష్టం లేక మనోజ్ ఈ పెళ్లి చేసుకున్నాడా? అందుకే ఈ ఇద్దరు పెళ్లిలోనే ఎమోషనల్ అయ్యారా? అనేది ఆసక్తి కరంగా మారింది. మరోవైపు కొత్తజంటకి సంబంధించిన పెళ్లి ఫోటోలను మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. నూతన జంటకి ఆమె అభినందనలు తెలిపింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి అనంతరం భూమా నాగిరెడ్డి, శోభాల ఘాట్‌ని సందర్శించి పూలమాల వేసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు మనోజ్ జంట. నేడు తిరుపతిని సందర్శించబోతున్నారు.