MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • 1000 కార్లతో మంచు మనోజ్ ర్యాలీ..జనసేనలో చేరిక?

1000 కార్లతో మంచు మనోజ్ ర్యాలీ..జనసేనలో చేరిక?

మంచు మనోజ్ ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డలో జరిగే కార్యక్రమంలో ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

2 Min read
Author : Surya Prakash
| Updated : Dec 16 2024, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


గత కొద్ది రోజులుగా మంచు కుటుంబ వ్యవరాలు, వివాదాలు అంతటా రచ్చ రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ చివరకి  పోలీస్ స్టేషన్ మెట్లెక్కి.. కోర్టు వరకు వెళ్లింది. అక్కడి నుంచి ఆసుపత్రికి చేరింది. ఇప్పుడు ఈ వివాదం రాజకీయాల వరకు వచ్చింది.  మంచు మనోజ్  కొందరు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైనట్టు ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఈ రాజకీయ అరంగేట్రానికి ఆళ్లగడ్డ వేదిక కానున్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనోజ్, మౌనిక దంపతులకు ఆహ్వానం వెళ్లింది. 

35


ఈ క్రమంలో ఈ దంపతులు ఇద్దరూ  ఏకంగా వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం, భూమా ఘాట్‌ నుంచి రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేస్తారని చర్చ నడుస్తోంది. అందులో భాగంగా తమ బలం నిరూపించుకునేందుకు ఇలా ర్యాలీగా వస్తున్నారనే వినిపిస్తోంది.  ఇక ఇప్పటికే భూమా కుటుంబంలో ప్రస్తుతం తెలుగుదేశం నుంచి నాగిరెడ్డి పెద్ద కూతురు అఖియప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

45
Manchu Manoj

Manchu Manoj


 అయితే, అఖిలప్రియతో ఉన్న కొన్ని ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక.. జనసేన వైపు చూస్తున్నారనే టాక్‌ నడుస్తోంది. ఈ కారణంగానే జనసేనలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  గతంలోనూ మౌనిక​ పొలిటికల్‌ ఎంట్రీపై మనోజ్‌ గతంలోనే కీలక కామెంట్స్‌ చేశారు. అంతకుముందు తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో మనోజ్‌ మాట్లాడుతూ.. మౌనిక రాజకీయాల్లోకి వెళ్లితే కచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే సమయంలో తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం తనకు ఉందన్నారు.
 

55
manchu manoj

manchu manoj

కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా వర్గం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. భూమా నాగిరెడ్డి, శోభ మృతిచెందిన తర్వాత.. భూమా అఖిలప్రియ రాజకీయ ఆరంగ్రేటం చేశారు. తొలుత మంత్రి అయ్యారు. 2019లో ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో అక్క బాటలో నడవాలని చెల్లి మౌనిక నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
మంచు మనోజ్
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hitler Movie Review: మోహన్ బాబు వల్ల డిజాస్టర్స్ నుంచి బయటపడ్డ చిరంజీవి, డైరెక్టర్ ను భయపెట్టిన మెగా ఫ్యాన్స్.. హిట్లర్ మూవీ రివ్యూ
Recommended image2
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image3
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved