MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మంచు కుటుంబంలో మరో వివాదం: విష్ణుపై మనోజ్ ఆరోపణలు

మంచు కుటుంబంలో మరో వివాదం: విష్ణుపై మనోజ్ ఆరోపణలు

మంచు మనోజ్ తన సోదరుడు విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేశారు. విష్ణు తన ఇంటి జనరేటర్‌లో పంచదార పోసి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారని, తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారని మనోజ్ ఆరోపించారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

2 Min read
Surya Prakash
Published : Dec 16 2024, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


మంచు కుటుంబంలో వివాదం  ముగిసేటట్లు కనపడటంలేదు. ఒకరిపై మరొకరు కంటిన్యూగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో వివాదం తెరపైకి తెచ్చారు. మనోజ్‌ (Manchu Manoj)తన ఫ్యామిలీలో చోటుచేసుకున్న ఘటన గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విష్ణు (Manchu Vishnu).. తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్తు సరఫరా నిలిపివేశారని ఆరోపించారు. దాంతో సోషల్ మీడియాలో ఇదో పెద్ద విషయంగా డిస్కషన్ మొదలైంది.
 

25


మంచు మనోజ్ మాట్లాడుతూ... ‘‘నిన్న నేను సినిమా షూటింగ్ లో ఉన్నాను.మా అబ్బాయి స్కూల్‌లో ఈవెంట్‌కు నా సతీమణి హాజరైంది. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో.. నా సోదరుడు విష్ణు తన అనుచరులు రాజ్‌ కొండూరు, కిరణ్‌, విజయ్‌ రెడ్డిలతోపాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడు.

జనరేటర్లలో షుగర్‌ పోయించాడు. దాంతో, రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మేమంతా ఆందోళనకు గురయ్యాం. ఇంట్లో అమ్మ, తొమ్మిది నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. జనరేటర్లకు సమీపంలో వాహనాలు పార్క్‌ చేసి ఉన్నాయి. 
 

35


అలాగే అక్కడే గ్యాస్‌ కనెక్షన్‌ ఉంది. విష్ణు టీమ్‌ ఇంటి నుంచి వెళ్లిపోతూ నా వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేసింది. నా దంగల్‌ కోచ్‌ను బెదిరించింది. అమ్మ పుట్టినరోజున ఇలా జరగడం హృదయాన్ని కలచివేసింది.

నేను, నా కుటుంబం భయంతో బతుకుతున్నాం. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని మనోజ్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మనోజ్‌ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

45


ఇక గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలే వార్తలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ మంచు ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్య కాస్తా రచ్చ కెక్కి ఏకంగా పోలీసు కేసుల దాకా వెళ్లాయి.  అలాగే  మోహన్ బాబు టీవీ 9 ప్రతినిధిపై దాడి చేయడం, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఈ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. 

55
Manchu Manoj

Manchu Manoj


మరో ప్రక్క మోహన్ బాబు భార్య  నిర్మలమ్మ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా తన తల్లికి బర్త్ డే విషెస్ చెప్పాడు మనోజ్. తల్లితో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అతను.. .. హ్యాపీ బర్త్‌డే అమ్మ. మన కుటుంబానికి నువ్వు హృదయంలాంటిదానివి. నీ ఆత్మధైర్యం నన్ను ప్రతిరోజు ఇన్‌స్పైర్‌ చేస్తుంది.

నీ ప్రేమాభిమానాల వల్లే అందరం కలిసి ఉండగలుగుతున్నాం. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే నువ్వెప్పుడూ మాకు అండగా నిలబడ్డావు. అదే విధంగా నేనూ నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లీ’అని అమ్మపై ప్రేమకు అక్షర రూపమిచ్చాడు మనోజ్.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
మంచు మనోజ్
మంచు మోహన్ బాబు

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
Recommended image2
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు
Recommended image3
Annagaru Vostaru:అన్నగారు వస్తారా ? రారా ? బాలకృష్ణ తర్వాత కార్తీ సినిమాకు చుక్కలు చూపిస్తున్న హైకోర్టు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved