MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `ప్రేమలు` హీరో ఫ్రెండ్‌తో మమితా బైజు పబ్లిక్‌గా రొమాన్స్.. `ప్రేమలు2` హీరో అతనే అంటూ రచ్చ..

`ప్రేమలు` హీరో ఫ్రెండ్‌తో మమితా బైజు పబ్లిక్‌గా రొమాన్స్.. `ప్రేమలు2` హీరో అతనే అంటూ రచ్చ..

`ప్రేమలు` చిత్రం మలయాళంతోపాటు తెలుగులోనూ పెద్ద హిట్‌ అయ్యింది. దీనికి సీక్వెల్‌ రాబోతుంది. కానీ తాజాగా మమితా బైజు, సంగీత్‌ మధ్య రొమాన్స్ వైరల్‌గా మారింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 23 2024, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Malayalam film Premalu

Malayalam film Premalu

 మలయాళ చిత్రాలు మరోసారి సౌత్‌లో చర్చనీయాంశం అవుతున్నాయి. వరుసగా అక్కడి సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి వాటిపై పడింది. అంతేకాదు వరుసగా ఇతర భాషల్లోనూ డబ్ అయి ఆదరణ పొందుతున్నాయి. `2018`, `ప్రేమలు`, `మంజుమ్మల్‌ బాయ్స్` చిత్రాలు అలానే విజయాలు సాధించాయి. 

26

అయితే తెలుగులో `మంజుమ్మల్‌ బాయ్స్` సత్తా చాటలేకపోయింది. కానీ `ప్రేమలు` తెలుగు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. హైదరాబాద్‌లో సాగే లవ్‌ స్టోరీ కావడం, తెలుగు డైలాగ్‌లు చాలా క్యాచీగా ఉండటంతో మన ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఇటీవల దీనికి సీక్వెల్‌ని కూడా ప్రకటించారు. `ప్రేమలు 2` రాబోతున్నట్టు ప్రకటించారు. `ప్రేమలు` మూవీని తెలుగులో రిలీజ్‌ చేసిన రాజమౌళి కొడుకు కార్తికేయనే సీక్వెల్‌కి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 

36

ఈ సినిమా ద్వారా హీరోయిన్‌ మమితా బైజు పాపులర్‌ అయ్యింది. ఆమె అందానికి అంతా ఫిదా అయ్యారు. దీంతో ఆమెకి వరుసగా ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే తమిళంలో ఓ సినిమా చేసింది. ఇందులో సచిన్‌ (నెస్లెన్‌ కె గఫూర్‌)తో ఆమె లవ్‌ స్టోరీ ఆద్యంతం ఆకట్టుకుంది. దీంతోపాటు సచిన్‌తోపాటు అతని ఫ్రెండ్‌ అముల్‌(సంగీత్‌ ప్రతాప్‌) ల మధ్య ఫ్రెండ్‌ షిఫ్ట్ కూడా ఆకట్టుకుంటుంది. ఇద్దరి కెమిస్ట్రీ నవ్వులు పూయించేలా ఉంటుంది. 

46

ఇదిలా ఉంటే తాజాగా మమితా బైజు.. సంగీత్‌ ప్రతాప్‌తో కలిసి క్లోజ్‌గా మూవ్‌ అయిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. గత రెండు మూడు రోజులుగా ట్విట్టర్‌(ఎక్స్)లో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఒక ఈవెంట్‌లో మమితా బైజు, సంగీత్‌ పాల్గొన్నారు. ఒకేసోఫాలో పక్కపక్కనే కూర్చున్నారు.

56

ఇందులో సంగీత్‌తో మమితా బైజు ఏదో ముచ్చట చెబుతుంది. వినిపించకపోవడంతో అతని చెబిలో చెప్పింది. అంతేకాదు చిలిపి అతని బుగ్గపై కూడా కొడుతుంది. ఇది వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోని షేర్‌ చేస్తూ సచిన్‌ విదేశాలకు వెళ్లిపోవడంతో అతని ఫ్రెండ్‌తో మమితా బైజు రొమాన్స్ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

66

`ప్రేమలు` చిత్రంలో క్లైమాక్స్ లో మమితా బైజు ప్రియుడు సచిన్‌ విదేశాలకు వెళ్లిపోతాడు. అతని ఫ్రెండ్‌ అముల్‌ ఇక్కడే ఉండిపోతాడు. దీంతో `ప్రేమలు 2` హీరో అములే అంటూ చిలిపిగా కామెంట్లు చేస్తున్నారు. ప్రియుడు విదేశాలకు పోవడంతో అతని ఫ్రెండ్‌తో మమిత రొమాన్స్ అంటూ చిలిపి కామెంట్ల రచ్చ చేస్తున్నారు. ఈ వీడియో మరింతగా వైరల్‌ అవుతుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sapthami Gowda: బాడీ పార్ట్స్ జూమ్‌ చేయడంపై `కాంతార` నటి ఫైర్‌.. ఎన్టీఆర్‌, నాగార్జున హీరోయిన్ల రియాక్షన్‌ ఇదే
Recommended image2
Rajamouli: ఏంటి.! జక్కన్న కూడా కాపీ బ్యాచ్‌నా.? ఆ సీనియర్ డైరెక్టర్‌తో పోల్చుతూ నెట్టింట చర్చ
Recommended image3
విజయ్ దేవరకొండ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. వంద కోట్ల మూవీ ఒక్కటే, 3 డిజాస్టర్లు ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved