MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జ్ఞానాంబని ఒప్పించాలని జానకి ప్రయత్నం.. అఖిల్ తప్పుడు పని తెలుసుకునే ప్రయత్నంలో మల్లిక?

Janaki Kalaganaledu: జ్ఞానాంబని ఒప్పించాలని జానకి ప్రయత్నం.. అఖిల్ తప్పుడు పని తెలుసుకునే ప్రయత్నంలో మల్లిక?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెబర్ 7వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

3 Min read
Author : Navya G
Published : Sep 08 2022, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జానకి అఖిల్ తో, పద వెళ్లి అత్తయ్య గారితో మాట్లాడదాము ఏదో ఒకటి తేల్చుకుందామని అంటుంది. దానికి అఖిల్, వద్దు వదిన ముందు నువ్వు వెళ్లి మాట్లాడు నాకు భయంగా ఉంది మధ్యలో వచ్చి కలుస్తాను అని అంటాడు. అప్పుడు జానకి,సరే నేను వెళ్లి మాట్లాడుతాను మధ్యలో నువ్వు రాకపోతే మాత్రం బాగోదు అని అంటుంది. ఇంతలో మల్లికా వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఏదో జరుగుతుంది.అఖిల్ అంత ఏడవలసిన పనేంటి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎలాగైనా కనుక్కోవాలి అని జానకి వెలిపోయిన తర్వాత అఖిల్ దగ్గరికి వెళ్లి, నీ కష్టం పగోడికి కూడా రాకూడదు అని అంటుంది. అంతా వినిసిందా అని అనుకుంటాడు అఖిల్.ఇంతలో నేను మిమ్మల్ని చూశాను కాని మీ మాటలు వినిపించలేదు ఏమైంది అని అడుగుతుంది. చదువు గురించి వదిన తిడుతుంది ఇంకేం లేదు అని వెళ్ళిపోతాడు.కానీ మల్లిక కి మాత్రం ఇక్కడ ఏదో జరుగుతుంది అని అనుమానం వస్తుంది. ఆ తర్వాత సీన్ లో  జ్ఞానంభ, గోవిందరాజు  కూర్చొని ఉండగా జానకి కాలేజీ నుంచి జ్ఞానంకి ఫోన్ వస్తుంది.
 

36

జానకి చాలా తెలివైనది, ఐపీఎస్ కు కావలసిన లక్షణాలు అన్ని తనలో ఉన్నాయి,తనని మా కాలేజీలో చేర్పించినందుకు మాకు గర్వంగా ఉన్నది అని జానకిని పొగుడుతూ ఉంటారు. జ్ఞానాంబ చాలా సంతోషపడుతుంది. ఇంతలో జానకి అఖిల్ విషయం మాట్లాడడానికి అని అక్కడికి రాగా జ్ఞానాంబా, ఇప్పుడే మీ కాలేజీ వాళ్ళు ఫోన్ చేశారమ్మా నిన్ను చాలా పొగుడుతున్నారు ఈరోజు నాకు విషయం అర్థమైంది.ఈ రోజు నుంచి ఇంట్లో అధికారం నాతోపాటు నీకు కూడా ఇస్తున్నాను.అఖిల్ చదువు బాధ్యత కూడా నీకిస్తున్నాను అని అంటాది. అఖిల్ గురించి చెబుదామంటే అత్తయ్య ఎందుకు ఇలా అంటున్నారు అని అనుకుంటుంది జానకి.
 

46

అప్పుడు మల్లికా ఇందాక వాళ్లు వచ్చినప్పుడు జానకి తిరిగి ఇంటికి పంపించేసింది. ఇప్పుడు అఖిల్ తో ఇలాగంటుంది. వాళ్ళకి అఖిల్ కి ఏమైనా సంబంధం ఉన్నదా? అఖిల్ వయసులో ఉన్నాడు కాబట్టి ఎవరినైనా ప్రేమించి ఉంటాడా జానకి కోప్పడి ఉంటుందా? ఇప్పుడు నాకు ఒకే మార్గం ఉంది అని చెప్పి మల్లికా  లీలావతి పెద్దమ్మకి ఫోన్ చేస్తుంది. ఏమైంది అని వాళ్ళ పెద్దమ్మ అనగా ఇలా జరిగిన విషయం అంత చెప్పి అఖిల్ ఎవరినో ప్రేమిస్తున్నట్టు ఉన్నాడు పెద్దమ్మ. నువ్వు మా అత్త దగ్గరి దగ్గర కి  వచ్చి అఖిల్ కి ఏదో సంబంధం వచ్చింది అని చెప్పు .అప్పుడు వాళ్ళు నిజం బయతపెడతారు అని అంటుంది. దానికి లీలావతి నీకు  కడుపని అబద్ధం చెప్పినందుకే ఎప్పుడు దొరికిపోతామని నాకు భయంగా ఉన్నది.
 

56

నువ్వు ఇప్పుడు ఇలాంటి పెంట పెట్టొద్దు అమ్మా అని అంటుంది  నాకు నువ్వే దిక్కు పెద్దమ్మ అని మల్లిక అనగా, నా మిషన్ పాడైపోయింది దానికి డబ్బులు కోసం నేను అప్పు అడగడానికి ప్రయత్నిస్తుంటే మధ్యలో నీగోలేంటి అని అంటుంది. ఆ డబ్బులు నేనే ఇస్తాను,ఈ ఒక్క పని చేయు పెద్దమ్మ అని అనగా అలాగే చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది లీలావతి.ఆ తర్వాత, జెస్సి అక్కడ ఏం జరిగి ఉంటది అని కంగారు పడుతూ ఉండగా జస్సీ తల్లిదండ్రులు అక్కడికి వచ్చి ఆ ఇంటి పెద్ద కోడలు మమ్మల్ని ఆపి రేపు మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం కి సమస్య తేలకపోతే అప్పుడు చెప్తాను తన పని అని వెళ్ళిపోతారు.అప్పుడు జెస్సి జానకి ఫోన్ చేసి ఎలాగైనా మాకు న్యాయం చేయని అంటుంది.
 

66

ఆ తర్వాత సీన్లో ఇంట్లో వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా అఖిల్ విషయమా చెప్పమని జానకి కి సైగ చేస్తాడు. దానికి జానకి నేను ఉన్నాను అని సైగ చేస్తుంది. రామా ఇదంతా చూసి, ఏంటో ఇందాకటి నుంచి ఇద్దరు తెగ  సైగలు చేసుకుంటున్నారు అని అంటాడు. ఇంతలో మల్లికా, ఇదేముంది బావగారు ఇందాక వాళ్ళిద్దరూ ఎంతసేపు మాట్లాడుకున్నారో! అఖిల్ అయితే ఏడ్చేసాడు కూడా అని అందరి ముందు చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved