MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Don't Trouble The Trouble 5 Days Collections: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి దారుణమైన కలెక్షన్లు.. 5 రోజుల్లో ఇంతేనా

Don't Trouble The Trouble 5 Days Collections: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి దారుణమైన కలెక్షన్లు.. 5 రోజుల్లో ఇంతేనా

ఫహద్‌ ఫాజిల్‌ హీరోగా, రాజమౌళి సమర్పణలో, కార్తీకేయ, శోభు యార్లగడ్డ నిర్మించిన `డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్` మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్‌ అవుతుంది.మరి ఈ చిత్రానికి ఐదు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 07 2026, 06:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ఫస్ట్ స్ట్రెయిట్‌ తెలుగు సినిమా
Image Credit : Asianet News

ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ఫస్ట్ స్ట్రెయిట్‌ తెలుగు సినిమా

`పుష్ప` సినిమాలతో తెలుగుకి పరిచయమైన మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ తెలుగులో హీరోగా చేసిన తొలి చిత్రం `డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌`. దీనికి రాజమౌళి సమర్పకులు కాగా, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మించారు. ఈచిత్రంతో కార్తికేయ నిర్మాతగా మారాడు. దీనికి శశాంక్‌ ఏలేటి దర్శకత్వం వహించారు. ఇందులో సారా పలేకర్‌, మహేష్‌ మంజ్రేకర్‌, సుబ్బరాజు వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. గాంధీ జయంతి సందర్బంగా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ ప్రారంభం నుంచే నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి రాజమౌళి, ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు ప్రమోషన్స్
Image Credit : X/@SBbySSK

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి రాజమౌళి, ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు ప్రమోషన్స్

`డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌` మూవీ బాక్సాఫీసు రిజల్ట్ ని చూస్తే ఇది దారుణమైన పరిస్థితిల్లో ఉంది. ఎన్టీఆర్‌ ప్రమోట్‌ చేశారు. ఆయన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చాడు. ట్వీట్‌ చేశాడు. మహేష్‌ బాబు ట్వీట్‌ చేశాడు. చాలా మంది ప్రమోట్‌ చేశారు. వీరందరిని మించి రాజమౌళి ఈ మూవీ అదిరిపోయిందని సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేసిందీ మూవీ. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది.

34
డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ మూవీ 5 రోజుల కలెక్షన్లు
Image Credit : X/@SBbySSK

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్ మూవీ 5 రోజుల కలెక్షన్లు

మరి ఈ చిత్రానికి కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే, మొదటి రోజు రూ.1.90కోట్ల గ్రాస్‌ని, రెండో రోజు రూ.89లక్షలు, మూడో రూ.73లక్షలు, నాల్గో రోజు రూ.37 లక్షలు, ఐదో రోజు రూ.38లక్షలు రాబట్టింది. టోటల్‌గా ఐదు రోజుల్లో ఈ మూవీకి రూ.3.71కోట్ల నెట్‌ వచ్చాయి. రూ.4.27కోట్ల ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్‌ని సాధించింది. రెండు కోట్ల వరకు షేర్‌ వచ్చింది. ఓవర్సీస్‌లో ఈ మూవీని ఎవరూ పట్టించుకోలేదు. అయితే వీకెండ్‌లో ఫర్వాలేదనిపించిన ఈ చిత్రం వీక్‌ డేస్‌లో దారుణంగా పడిపోయింది. సోమవారం, మంగళవారం ఈ చిత్రానికి కనీసం షేర్‌ రాలేదు. అంటే మెయింటనెన్స్ ఖర్చులకే పోయింది. నిర్మాతకు టీ ఖర్చులు కూడా రాలేదని చెప్పొచ్చు.

44
స్టార్స్ పై విమర్శలు
Image Credit : X/@SBbySSK

స్టార్స్ పై విమర్శలు

రాజమౌళి జడ్జ్ చేసిన మూవీ, కార్తికేయ నిర్మించిన చిత్రం, బాహుబలి నిర్మాతలు తీసిన సినిమా, కొత్త దర్శకుడు, ఎన్టీఆర్‌ ప్రమోషన్‌, మహేష్‌ బాబు ట్వీట్లు, ఫహద్‌ ఫాజిల్‌ హీరో.. ఇంత మంది కలిసి చేసిన ఈ చిత్రానికి ఇంతటి దారుణమైన కలెక్షన్లు రావడం ఆశ్చర్యపరుస్తోంది. చిన్న సినిమాలు డీసెంట్‌గా వసూళ్లని రాబటిదే, వాటితో పోటీలో ఈ చిత్రం వెనకబడింది. డీలా పడింది. ఓవరాల్‌గా డిజాస్టర్‌ దిశగా వెళ్తుందని ట్రేడ్‌ సైట్లు చెబుతున్నాయి. దీంతో ఎన్టీఆర్‌, రాజమౌళి, మహేష్‌ బాబులపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. మీ జడ్జ్ మెంట్‌ ఇదేనా అంటున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Related Stories
Recommended image1
Chiranjeevi Remuneration: ఫస్ట్ సినిమాకి చిరంజీవి పారితోషికం ఎంతో తెలుసా? మెగాస్టార్‌ అవ్వడమంటే ఈజీనా?
Recommended image2
Highest Multistarrer Hero: తెలుగులో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఏకంగా 80 సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved