- Home
- Entertainment
- Janaki Kalaganaledu: అందరిముందు జానకిని అవమానించిన జ్ఞానంబ.. నానమ్మ ఇచ్చిన స్థలం అంటూ?
Janaki Kalaganaledu: అందరిముందు జానకిని అవమానించిన జ్ఞానంబ.. నానమ్మ ఇచ్చిన స్థలం అంటూ?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ఒకటి. ఈ సీరియల్ పరువుగల కుటుంబం నేపథ్యంలో ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

జ్ఞానంబ (Jnanamba) ఇంట్లో నుంచి రామచంద్ర, జానకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కానీ రామచంద్ర తన తల్లిని చూడకుండా ఉండలేడు కాబట్టి తమ ఇంటి ముందే తాము కూడా ఒక గూడు కట్టుకుంటారు. అది చూసిన జ్ఞానంబ కోపంతో రగిలిపోతుంది. గోవింద రాజు (GovindhaRaju) మాత్రం శభాష్ అనుకుంటూ తన కొడుకు ఆలోచనను చూసి మురిసిపోతాడు.
ఇక జ్ఞానాంబ (Jnanamba) ముందు గోవిందరాజులు రామచంద్ర ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అనడంతో రామచంద్ర (Rama Chandra) అమ్మను చూడకుండా ఉండలేను కాబట్టి ఇక్కడ ఉన్నాను అని అంటాడు. దాంతో జ్ఞానాంబ మనసు కరిగినట్లే అనిపిస్తుంది కానీ లోపల ప్రేమని దాచుకొని పైకి కోపంగా మాట్లాడుతుంది.
ఇది తన స్థలం అని ఇక్కడ ఉండే హక్కు లేదు అని జ్ఞానంబ అనడంతో వెంటనే రామచంద్ర (Rama Chandra) ఇది నాయనమ్మ నా పేరుమీద రాయించిన స్థలము అని గట్టిగా అంటాడు. దాంతో గోవిందరాజులు, వెన్నెల, అఖిల్ వాళ్లు సంతోషంగా ఫీల్ అవుతారు. జ్ఞానాంబ మాత్రం ఆశ్చర్యపోతుంది. ఇక మల్లికకు (Mallika) ఎదురు దెబ్బ తగిలినట్లు అనిపిస్తుంది.
వెంటనే జ్ఞానాంబ రామచంద్ర (Rama Chandra) వాళ్లతో మాట్లాడవద్దని.. నా కొడుకు అమాయకుడు. జానకి వల్లే ఇలా మాట్లాడడం నేర్చుకుంటున్నాడు అని జానకిని ఉద్దేశించి అక్కడి నుంచి వెళ్తుంది. గోవింద రాజులు మాత్రం సంతోషంగా ఫీల్ అవుతూ రామచంద్ర తో కబుర్లు పెడుతుండగా.. వెంటనే మల్లిక (Mallika) మళ్లీ తన రూపాన్ని చూపిస్తుంది.
ఇక మల్లిక (Mallika) అక్కడినుంచి అలుగుతూ వెళ్తుండగా గోవిందరాజులు తనను వెటకారంగా వెక్కిరిస్తాడు. ఇక జ్ఞానంబతో జానకి గురించి సాకులు చెబుతూ ఉంటుంది మల్లిక. మరోవైపు జానకి, రామచంద్ర నవారీ మంచాన్ని అల్లుతూ ఉంటారు. జ్ఞానంబ తన ఇంట్లో కిటికీలో నుంచి రామ చంద్రని (Rama Chandra) చూసి బాధపడుతుంది.
వెంటనే కిటికీ డోర్లు మూసేస్తుంది. ఆ తర్వాత జానకి (Janaki) రామచంద్ర కోసం ఉప్మా రెడీ చేస్తూ ఉంటుంది. రామచంద్ర జ్ఞానంబ (Jnanamba) ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అలాగే వంట చేస్తున్న జానకిని చూసి.. తనకు ఇటువంటి పరిస్థితి నావల్లే వచ్చింది అని తనలో తాను అనుకుంటూ బాధపడతాడు. జానకి కూడా.. రామ చంద్ర బాధపడుతున్నాడని అనుకుంటూ బాధపడుతుంది.
ఇక ఉప్మా గిన్నె చెయ్యి కాల్చుకుంటుంది జానకి (Janaki). ఉప్మాను జానకి రామచంద్రకు తినిపించలేకపోయేసరికి.. జానకి చేయిని పట్టుకొని బాధపడతాడు రామ చంద్ర. తరువాయి భాగం లో స్వీట్ కొట్టు బాధ్యతలు అఖిల్ కు ఇస్తుంది జ్ఞానంబ. వెంటనే జానకి అఖిల్ (Akhil) భవిష్యత్తు గురించి మాట్లాడటం తో..నీకు నా కుటుంబంతో సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడి అవమాన పరుస్తుంది.