Janaki Kalaganaledu: జానకి రామచంద్రలకు షాకిచ్చిన సునంద.. ఇక వీరికి పోటీ తప్పదా!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే అటుకుల చిట్టిబాబు (Chittibabu) ఫోన్ చేసి జ్ఞానాంబ (Jnanamba) కు అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయింది. స్వీట్లు క్యాన్సిల్ చేద్దామని ఫోన్ చేశాను అని అంటాడు. ఇక జ్ఞానాంబ విచారం వ్యక్తం చేస్తుంది. కానీ గోవిందరాజు ఎంతో సంతోషపడతాడు. ఇక మల్లిక లక్ష రూపాయలు ఇస్తే చిట్టిబాబు కు ఇచ్చేసి వస్తా అంటుంది.
ఇక జ్ఞానాంబ (Jnanamba) అతను నీకు తెలుసా అని అడగగా.. నేనే కదా అతడిని పంపించింది అని నోరు జారుతుంది. ఇక నేనే మీరు ఇంట్లో ఉన్నారని చెప్పి పంపాను అని కవర్ చేసుకుంటుంది. గోవిందరాజు (Govindaraju) ఏదో తేడా కొడుతుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత మల్లిక విష్ణు పడుకున్న దగ్గర పరుపుకింద ఫోన్ కోసం చేయి పెడుతుంది.
అది నిద్రలో గమనించిన విష్ణు (Vishnu) ఆ చేతిని గట్టిగా నొక్కుతాడు. దాంతో మల్లిక (Mallika) ఏడుస్తూ మొర పెడుతుంది. ఇక గోవిందరాజు జానకి దంపతులు దగ్గరికి వచ్చి మీరు పోటీలకు వెళ్ళడానికి బస్ టికెట్లు ఏర్పాటు చేస్తాను అని అంటాడు. ఈలోపు సునంద, కన్నబాబు లు జ్ఞానాంబ ఇంటికి వస్తారు.
ఇక గోవిందరాజు (Govindaraju) ఏంటి ఇలా వచ్చావ్? కొంపదీసి నీ కార్పొరేట్ పదవి పోయిందా అని అంటాడు. నేను స్వీట్ బాక్స్ తో ఎందుకు వచ్చానో చెప్తే మీరే షాక్ అవుతారు అని అంటుంది. ఇక మేము సీట్స్ షాప్ పెడుతున్నాము అని సునంద (Sunanda) అంటుంది. ఇక మీరు స్వీట్ షాప్ పెడితే మాకేంటి దురద అని మల్లిక అంటుంది.
మీ షాప్ కి దగ్గర్లో స్వీట్ షాప్ పెడుతున్నాను అని చెప్తున్నా.. అంటూ గట్టిగా రామచంద్ర (Ramachandra) దంపతులకు వినపడేలా చెబుతుంది. ఇక ఫోన్ చేసి ప్లేస్ ఎక్కడో చెబుతాను.. మీరే వచ్చి చూడండి ఎంత ఆశ్చర్యపోతారు అని సునంద (Sunanda) అంటుంది. ఆ క్రమంలో రామచంద్ర దంపతులు టెన్షన్ పడుతూ ఉంటారు.
ఇక తరువాయి భాగంలో లో జానకి (Janaki) మీరు పోటీల్లో తప్పకుండా గెలుస్తారు. అప్పు గురించి ఆలోచించకండి అని ధైర్యం చెబుతుంది. ఈలోగా అక్కడకు గోవిందరాజు (Govindaraju) రాగా మేటర్ హైదరాబాదుకు మారుస్తారు. అది విన్న మల్లిక హైదరాబాద్ ఏంటి? అని ఆలోచిస్తుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.