- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జానకి కలను చెత్తకాగితల వ్యక్తికి అమ్మేసిన మల్లిక.. గోవిందా రాజుకు అనారోగ్యం!
Janaki Kalaganaledu: జానకి కలను చెత్తకాగితల వ్యక్తికి అమ్మేసిన మల్లిక.. గోవిందా రాజుకు అనారోగ్యం!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 4వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 4వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
మరొకవైపు జానకి స్నానం చేసి వచ్చి తన అసైన్మెంట్ పేపర్లు కనిపించకపోవడంతో తన రూమ్ మొత్తం వెతుకుతుంది. ఆ తర్వాత టెన్షన్ తో బయటకు వెళ్లి చికితను అడగగా చికిత లేదు నాకు తనకు తెలియదు అని చెబుతుంది. దాంతో జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు చికిత ఇందాక మల్లికమ్మ గారు పేపర్లు అమ్మేశారు వాటితో పాటు వీటిని కూడా అమ్మేసారు అనడంతో జానకి షాక్ అయ్యి బాధపడుతూ ఉంటుంది.
ఇంతలొనే మల్లికా ఏమీ తెలియనట్టుగా అక్కడికి వచ్చి ఏమైంది జానకి అని అనటంతో వెంటనే జానకి మల్లిక పై నీకు అసలు బుద్ది ఉందా మల్లిక నా రూమ్ లో ఉన్న పేపర్స్ ని నువ్వు ఎందుకు తీసావు అని అనడంతో మల్లిక కహానీలు చెబుతుంది. ఇంతలో అటుగా జ్ఞానాంబ, గోవిందరాజులు రావడం గమనించిన జానకి మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు మల్లిక మరింత రెచ్చిపోతూ జానకిపై లేనిపోని చాడీలు అని చెబుతుంది.
చెప్పు జానకి నువ్వు నన్ను చెప్పుతో కొట్టే అంత సీరియస్ అయ్యావు అంటే ఆ కాగితాల్లో ఏదో సీరియస్ మాస్టారు ఉండే ఉంటుంది. చెప్పు ఏమి ఉంది ఆ పేపర్ లలో అని పదే పదే గుచ్చి గుచ్చి అడుగుతుంది. అప్పుడు జ్ఞానాంబతో మాట్లాడుతూ ఏంటయ్యా అత్తయ్య గారు అలా మౌనంగా ఉన్నారు మీకు ఇద్దరు కోడలు రెండు కళ్ళు లాంటివారు అన్నారు కదా మరి మీ పెద్ద కోడల్ని నిలదీయండి అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది.
అప్పుడు జ్ఞానాంబ మాట్లాడుతూ జానకి నువ్వు కారణం లేకుండా ఎవరిని ఒక్క మాట కూడా మాట్లాడవు అలాంటిది నువ్వు ఏదో ఒక విషయం ఉండబట్టే మల్లిక పై సీరియస్ అయ్యావు అంటే ఏదో కారణం ఉంటుంది అది ఏంటో చెప్పు జానకి అని అనగా ఇంతలో మల్లికా అత్తయ్య గారు అడుగుతుంటే చెప్పు జానకి అత్తయ్య గారు అంటే నీకు గౌరవం లేదా అని మాట్లాడుతూ ఉండడంతో ఇంతలో గోవిందరాజులు అమ్మ తాలింపు మల్లిగా కాసేపు ఆగమ్మా మీ అత్తయ్య గారి అడుగుతున్నారు కదా అంటూ సెటైర్లు వస్తాడు.
అప్పుడు జానకి మాట్లాడుతూ ఆయన స్వీట్ షాప్ కోసం కవర్ చేయమని చెప్పాడు అని అనడంతో మల్లిక వెటకారంగా మాట్లాడుతుంది. దాంతో జ్ఞానాంబ మల్లికా పై సీరియస్ అవుతుంది. ఆ తర్వాత వెన్నెల,అఖిల్ కు క్యారేజ్ కట్టియాలి వెళ్లి భోజనం సిద్ధం చేయపో మల్లిక అని అనగా అప్పుడు వరకు బాగానే ఉన్నా మల్లికా నొప్పులు అమ్మ అబ్బా అంటే ఓవరాక్షన్ చేస్తూ ఉండడంతో గోవిందరాజులు సెటైర్లు వేస్తాడు.
ఆ తర్వాత జ్ఞానాంబ జానకికి వంట చేయమని చెప్పడంతో జానకి సరే అని చెప్పి ఒకవైపు వంటలు చేస్తూ మరొకవైపు రాసుకుంటూ ఉంటుంది. ఆ తరువాత జానకి అందరికి భోజనం పట్టిస్తూ ఉండగా దూరం నుంచి అది చూసిన మల్లికా సంతోషంతో నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత జానకి తన రూమ్ కి వెళ్లి రాసుకుంటూ ఉంటుంది.