- Home
- Entertainment
- Janaki kalaganaledu: తల్లి కోసం భార్యని తప్పుపట్టిన రామచంద్ర.. తట్టుకోలేకపోతున్న జానకి!
Janaki kalaganaledu: తల్లి కోసం భార్యని తప్పుపట్టిన రామచంద్ర.. తట్టుకోలేకపోతున్న జానకి!
Janaki kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ (Janaki kalaganaledu) ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఒక పరువుగల కుటుంబం అనే కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

యోగి (Yoghi) జ్ఞానంబపై కేసు పెట్టడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక జ్ఞానాంబ పోలీస్ స్టేషన్ కు వెళ్లే వరకు అక్కడ యోగి తనకు ఎదురు పడి.. తన చెల్లెలు బాధ పెట్టినందుకు ఆమెపై ఫైర్ అవుతుంటాడు. కానీ ఆ మాటలకు జ్ఞానంబ (Jnanamba) అస్సలు స్పందించదు.
ఇక పోలీసులు జానకిని (Janaki) తీసుకొని రమ్మనడంతో యోగి అక్కడ్నుంచి బయలుదేరుతాడు. అంతలోనే పోలీస్ స్టేషన్ కు గోవిందరాజులు, విష్ణు, అఖిల్ వాళ్ళు రాగా.. గోవిందరాజులు యోగిని కొన్ని మాటలు అంటాడు. అయినా కూడా యోగి (Yoghi) పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.
వెంటనే గోవిందరాజులు (Govindha Rajulu) లోపలకు వచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకుంటారు. జ్ఞానంబకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయడంతో.. జ్ఞానంబ కోపంతో.. నా కోడల్ని నెత్తిన పెట్టుకున్ననందుకు శిక్ష అనుభవించాల్సిందే అని అంటుంది. వెంటనే గోవిందరాజులు ఈ విషయం జానకి, రామలకు తెలియదని యోగి పొరపాటు పడ్డాడు అని అంటాడు.
కానీ జ్ఞానంబ (Jnanamba) .. జానకి, రామ కు తెలియకుండా వాళ్ళ అన్నయ్య ఇంత ధైర్యంగా కేసు పెడతా అని ప్రశ్నిస్తుంది. ఇక అదే సమయంలో రామ కంగారుగా వచ్చి జ్ఞానంబ కాళ్లపై పడతాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా అంటూ బాగా ఎమోషనల్ అవుతాడు. కానీ జ్ఞానాంబ రామ (Rama)ను వెళ్ళిపొండి అంటూ ఫైర్ అవుతుంది.
ఇక గోవిందరాజులు (Govindharajulu) ఇదంతా యోగి చేశాడు అని రామ కు చెప్పడంతో వెంటనే రామ అక్కడ్నుంచి కోపంగా బయలుదేరుతాడు. మరోవైపు మల్లిక (Mallika) జానకికి ఈ విషయం తెలిసేలా చేస్తుంది. నీవల్ల అత్తయ్య గారు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు అనడం తో జానకి షాక్ అవుతుంది.
ఏం నటిస్తున్నావు జానకి (Janaki) అంటూ.. చేసిందంతా చేసి.. మీ అన్నయ్యతో కేసు పెట్టించావు అని అంటుంది. దాంతో జానకి అన్నయ్య ఎప్పుడు వచ్చాడో కూడా తనకు తెలియదు అని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే యోగి (Yoghi) అక్కడికి రావడంతో జానకి ఎదురు పడుతుంది.
ఎందుకు ఇలా చేయించావు అని అంటుంది. చిన్న అపార్థం వల్ల మమ్మల్ని బయటకు పంపారు.. మళ్లీ రేపోమాపో కలిసే వాళ్ళం. ఇంతలోనే నువ్వు ఇలా చేశావు అంటూ తన అన్నయ్య పై ఫైర్ అవుతుంది. అంతలోనే రామచంద్ర (Ramachandra) వచ్చి యోగి (Yoghi) ను కొడతాడు.
జానకి (Janaki) ఎంత అడ్డు ఆపినా కూడా రామ వినకుండా యోగిని (Yoghi) బాగా కొడుతూ ఉంటాడు. ఇక తరువాయి భాగంలో రామ జానకి తో.. మీ అన్నయ్య కేసు పెడుతున్నాడని నీకు ముందే తెలుసు కదా.. మీకు తెలియకుండా మీ అన్నయ్య కంప్లైంట్ చేసాడు అంటే ఎవరు నమ్మరు అని జానకి పై తప్పు పడతాడు. దాంతో జానకి కుమిలిపోతూ ఉంటుంది.