MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Janaki kalaganaledu: జెస్సిని అదుపులో పెట్టుకునేందుకు మల్లిక హైడ్రామా.. అఖిల్‌ని అడ్డం పెట్టుకొని?

Janaki kalaganaledu: జెస్సిని అదుపులో పెట్టుకునేందుకు మల్లిక హైడ్రామా.. అఖిల్‌ని అడ్డం పెట్టుకొని?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

4 Min read
Author : Navya G
| Updated : Oct 10 2022, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జెస్సీ జానకితో, ఈ నవరాత్రులు నువ్వేం చెప్తే అదే చేస్తాను అక్క అప్పుడే అత్తయ్య గారికి నా మీద కోపం తగ్గుతుంది కదా అని అంటుంది. అప్పుడు జానకి ఈ నవరాత్రుల్లో ఏవే ప్రసాదాలు చేస్తారో అవన్నీ జెస్సి కి చెప్తుంది. జెస్సి, థాంక్స్ అక్క రేపు ఉదయాన్నే నేను మొదలు పెడతాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు జానకి చదువుదాం అనేసరికి టైం దాటిపోతుంది. ఇంక పుస్తకాలు మూసి వెళ్లి పడుకుంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం జెస్సీ తలకు స్నానం చేసి, స్టవ్ కి పూజ చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ప్రసాదం చేస్తుంది. అప్పుడు వెనుక నుంచి జ్ఞానాంబ జెస్సిని చూస్తుంది.అప్పుడు జెస్సి వంట గదిలో మంత్రాలు చదివి పులిహార, పరమాన్నాలు చేస్తుంది.ఇంతలో మల్లిక అక్కడికి వచ్చి జెస్సి వంట చేయడం చూస్తుంది. ఇదేంటి ఇంటికి వచ్చి నెల కూడా అవ్వలేదు అప్పుడే వంటలు చేసేసి పోలేరమ్మ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఎలాగైనా దీని పని పట్టాలి అని జెస్సి దగ్గరికి వెళ్తుంది మల్లిక.వెనక జ్ఞనాంబ ఉండడం గమనించదు మల్లిక. జ్ఞానాంబ మాత్రం మల్లిక అక్కడికి వెళ్లడం చూస్తుంది. అప్పుడు జెస్సి మల్లికాకి గుడ్ మార్నింగ్ అక్క అని చెప్తుంది.అప్పుడు మల్లిక, ఏం చేస్తున్నావ్ జెస్సి అని అనగా, ఈ నవరాత్రులు పూజలు ఉంటాయి కదా అక్క, దానికి నైవేద్యాల కోసం ప్రసాదం చేస్తున్నాను అని అంటుంది. అప్పుడు మల్లిక,అయ్యయ్యో ఈరోజు నువ్వు ఈ ప్రసాదం చేయకూడదు. ఈరోజు నువ్వు చేయాల్సిన ప్రసాదం వేరు అని అంటుంది. దానికి జెస్సి మరోసారి తన చేసిన వంటకాలను చూస్తూ, లేదక్కా జానకి అక్క నాకు అన్ని చెప్పారు.ఈరోజు నేను ఈ ప్రసాదమే చేయాలి అని అనగా, నువ్వు ఇంకోసారి ఆలోచించుకొని చూడు నేను చెప్తున్నాను కదా ఈ రోజు ఈ ప్రసాదం చేయకూడదు అని మల్లిక అంటుంది.
 

38

దానికి జెస్సి, నవరాత్రుల్లో ఏ రోజు ఏ ప్రసాదం చేయాలో అన్ని మల్లికకు చెప్పగా,అప్పుడే జానకి వాళ్ళు జ్ఞనాంబ దగ్గరకి వస్తారు.అప్పుడు జెస్సీ మాటలు విని జానకి ఎంతో ఆనందపడుతుంది. జ్ఞానాంబ కూడా ఆనందపడుతుంది. అప్పడు మల్లిక జెస్సి మాటలు విని ఆశ్చర్యపోతుంది. దీనికి ఇన్ని ఎలా తెలుసు అని అనుకుంటుంది. అయినా మల్లికా పట్టు వీడకుండా ఈరోజు ఇది చేయకూడదు అని అనగా వెనకాతల జ్ఞానాంబ ఇంక ఆపు మల్లిక అని అంటుంది.వెనక్కి చూసిన మల్లిక అవాక్కయ్యి,ఈ రోజు నా పని అయిపోయింది అని భయపడుతుంది.అప్పుడు జ్ఞానాంబ మల్లిక తో, ఇంటికి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వంటగది వైపు కూడా ఎప్పుడు వెళ్లలేదు.పాపం తను ఏదో నేర్చుకోవాలి అనుకుంటే దాన్ని కూడా ఎందుకు చెడగొడుతున్నావు. నీ నాలికకు ఇంక హద్దు, అదుపు ఉండదు ఇకనుంచి తిడుతుంది. అప్పుడు జ్ఞానాంబ జానకి తో,నువ్వు బయట ఎందుకు వచ్చావు జానకి, లోపలికి వెళ్లి చదువుకో అని అంటుంది. 

48

జ్ఞానాంబ వెళ్లిపోయిన తర్వాత జెస్సి జానకి దగ్గరికి వచ్చి, థాంక్స్ అక్క ఈరోజు నువ్వు చెప్పడం వల్లే ఇదంతా జరిగింది అత్తయ్య గారు ముందు నా పేరు నిలబడింది.నిన్న రాత్రిని చదువును కూడా త్యాగం చేసి నాకోసం ఇవన్నీ చెప్పావు అని అనగా,ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది జెస్సి అని జానకి అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న రామా, నిన్న రాత్రి చదువునీ యెగ్గొట్టేసారు అన్నమాట అని అనుకుంటాడు. మరోవైపు మల్లికా బాధపడుతూ, జానకి లాగే జెస్సి కూడా పోలేరమ్మ దగ్గర దేవత అయిపోతుందా అని అనుకుంటుంది. అప్పుడు మల్లిక తనని తాను ఉత్సాహపరచుకుంటూ,నువ్వు ఏడవకూడదు మల్లికా ఏడిపించాలి ఇప్పుడు జెస్సిని ఎలాగైనా కంట్రోల్ చేయాలి. జెస్సిని కంట్రోల్ చేయడానికి ఒక తోలుబొమ్మని వెతకాలి ఇంట్లో తోలుబొమ్మ ఎవరున్నారు అని ఆలోచించుకుంటూ అఖిల్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దగ్గరికి వెళ్లి అఖిల్ నీకో విషయం చెప్పాలి,జెస్సీ ఉదయం నుంచి అత్తయ్య గారిని మెప్పించడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది.

58

అత్తయ్య గారి ముందు మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తుంది అని అనగా అఖిల్, మంచిదే కదా వదినా ఎంత మంచి పేరు తెచ్చుకుంటే అంత త్వరగా కలుస్తారు కదా అని అనగా వీడేంటి దారి తప్పుతున్నాడు అని మల్లికా మనసులో అనుకుని బయటకు,అలా కాదు అఖిల్ ఇప్పుడు తను అత్తయ్య గారి దగ్గర మంచిగా నటించి కేవలం తను మాత్రమే అమాయకురాలు,తప్పంతా నువ్వే చేశావు అన్నట్టు నమ్మిస్తుంది. అలాగైతే అత్తయ్య గారు నిన్ను దోషిగా చూస్తారు కదా. నిజంగా నిన్ను ప్రేమించే వ్యక్తి అయితే అత్తయ్య గారిని, నిన్ను కలపాలని చూస్తాది కానీ తను అత్తయ్య గారి దగ్గర మంచి అవ్వాలని చూడదు కదా.
 

68

 నీ మంచి కోరి చెప్పాను ఇంక నీ ఇష్టం అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మల్లిక మాటని విని ఆలోచనలో పడి, జెస్సిని కంట్రోల్ లో పెట్టాలి అని అనుకుంటాడు అఖిల్. ఆరోజు సాయంత్రం రామా, జెస్సి అన్న మాటలు విని జానకి గారు నిన్న కూడా మీరు చదువుని ఎగ్గొట్టేశారు అని అనుకుంటాడు.అప్పుడే జానకి అక్కడికి వస్తుంది.అప్పుడు రామ,జానకి గారూ చదువుకోవాలి అని తపన మీకు ఉందా లేదా అని అనగా,ఇంట్లో బాధ్యతలు కూడా ఉన్నాయి కదా రామా గారు చూశారా ఈరోజు అత్తయ్య గారి ముందు జెస్సి మంచి పేరు తెచ్చుకుంది అని అంటుంది.
 

78

అప్పుడు రామా, ఈరోజు కాకపోతే ఎప్పటికైనా జెస్సి ఇంట్లోనే ఉండాల్సింది కదా మీ పరీక్షలలా కాదు కదా. ఇప్పుడు కూర్చొని చదవండి అని జానకి దగ్గర ఉండి చదువుపిస్తాడు రామ. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వస్తుంది. అప్పుడు జానకి పుస్తకాలు పక్కన పెట్టి రండి అత్తయ్య గారు అని అంటుంది.అప్పుడు జ్ఞానాంబ, ఇంట్లో ఇద్దరు కడుపుతో ఉన్నారు కదా ప్రతిరోజు రాత్రి పాలలో ఈ కుంకుమపువ్వు ఇస్తే పండంటి బిడ్డను కంటారు. ప్రతిరోజు రాత్రి నువ్వు వాళ్లకి పాలు ఇవ్వు అని అనగా రామా, ఈ పని నువ్వే చేయొచ్చు కదా అమ్మ అని అంటాడు.ఇద్దరూ పిల్లల్ని కన్నా వాళ్లలో ఉన్న పిల్లతనం ఇంకా పోలేదు. 
 

88

నేను చెప్తే అశ్రద్ధ చేస్తారు జానకి అయితే బాధ్యత తీసుకుని దగ్గరుండి చేస్తుంది అని అంటుంది జ్ఞానాంబ. జ్ఞానాంబ వెళ్లిపోయిన తర్వాత జానకి మనసులో మల్లిక, జెస్సీ విషయంలో నేను ఇంకొంచెం బాధ్యత తీసుకోవాలి అని అనుకుంటుంది. జానకి చదువు పక్కన పెడుతుంది అని రామా బాధతో ఉంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved