- Home
- Entertainment
- Janaki kalaganaledu: గర్భవతి కాదని జ్ఞానాంబ ముందు అసలు నిజం బయటపెట్టిన జానకి.. ఆమె ఏం అన్నదంటే?
Janaki kalaganaledu: గర్భవతి కాదని జ్ఞానాంబ ముందు అసలు నిజం బయటపెట్టిన జానకి.. ఆమె ఏం అన్నదంటే?
Janaki kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఒక పరువు గల కుటుంబం నేపథ్యంలో ప్రసారమవుతుంది. ఇక ఈ రోజు ఈ సీరియల్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Janaki kalaganaledu
జ్ఞానాంబ (Jnanaamba) తన పెద్దకోడలు జానకి గర్భవతి అయిందని తెగ సంతోషంలో ఊరంతా హడావుడి చేస్తూ ఉంటుంది. కానీ తాను ప్రెగ్నెంట్ కాదని కేవలం అజీర్ణం వల్ల తనకు వాంతులు అయ్యాయని జానకి అనుకుంటుంది. ఈ క్రమంలో జానకి, రామచంద్ర (Rama Chandra) ఈ విషయం గురించి జ్ఞానాంబకు చెప్పాలని తెగ ప్రయత్నాలు చేస్తారు.
Janaki kalaganaledu
ఇక ఈ విషయం గురించి జానకి (Janaki), రామచంద్ర టెన్షన్ పడుతూ ఉండగా ఇంటి దగ్గర నుండి చికిత ఫోన్ చేసి జానకిని తీసుకొని జ్ఞానాంబ రమ్మంటుంది అని చెబుతోంది. ఇక అత్తయ్య గారు ఇంటికి ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నారో అని భయపడి పోతుంది జానకి. మరోవైపు మల్లిక (Mallika) జానకి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తట్టుకోలేక పోతుంది.
Janaki kalaganaledu
తాను కూడా ఎలాగైనా ఒక మగ పిల్లాడిని కనాలని అనుకుంటుంది. దాంతో డాక్టర్ ని కలవడం కోసం నీలావతి (Neelavathi) సలహా తీసుకోవడానికి నీలావతి కోసం ఎదురు చూస్తుంది. ఇక నీలావతి వచ్చి జానకి ప్రెగ్నెంట్ అని జ్ఞానాంబ స్వీట్లు పంచిదని.. సీట్లు మాత్రం భలే ఉన్నాయి అని అనడంతో వెంటనే మల్లిక (Mallika) తనను కసురుకుంటుంది.
Janaki kalaganaledu
జ్ఞానాంబ జానకి (Janaki) కోసం పులుపు పదార్థాలను సిద్ధం చేసి ఉంచుతుంది. అప్పుడే జానకి రావటంతో తనను కూర్చోబెట్టి జాగ్రత్తలు చెబుతోంది. కానీ జానకి, రామచంద్ర మాత్రం నిజం ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మల్లిక (Mallika) వచ్చి జానకికి కుళ్ళు తో శుభాకాంక్షలు చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది.
Janaki kalaganaledu
అప్పుడే గోవిందరాజు (Govindha Raju) వచ్చి గుడిలో అన్నదానం గురించి చర్చిస్తూ ఉంటాడు. రామచంద్ర (Rama Chandra) ఎంత పిలిచినా పట్టించుకోకుండా ఉంటాడు. ఇక రామచంద్ర గోవింద రాజు ని పక్కకు తీసుకెళ్లి అసలు నిజం మొత్తం చెబుతాడు. ఇక ఆయన బాధపడుతూ.. ఈ విషయాన్ని జ్ఞానాంబ కు ఎలా చెప్పాలి అని బాధపడుతూ ఉంటాడు.
Janaki kalaganaledu
ఇక జానకి (Janaki) కోసం జ్ఞానాంబ దగ్గరుండి మామిడికాయ ముక్కలు కట్ చేసి ఇస్తుంది. అదే సమయంలో మల్లిక అక్కడికి వచ్చి ఆ సన్నివేశాన్ని చూసి కుళ్లుకుంటుంది. ఇక గోవిందరాజు, రామచంద్ర (Rama Chandra) కూడా రావడంతో జానకి భయపడుతూ కనిపిస్తుంది. ధైర్యం తెచ్చుకొని జ్ఞానంబకు అసలు నిజం చెబుతుంది. ఇక జ్ఞానాంబ తట్టుకోలేకపోతుంది.