MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Malli: మల్లీ నుదుటిన సింధూరం పెట్టిన అరవింద్.. మల్లీని చూసి కుళ్ళుకుంటున్న మాలిని?

Malli: మల్లీ నుదుటిన సింధూరం పెట్టిన అరవింద్.. మల్లీని చూసి కుళ్ళుకుంటున్న మాలిని?

Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు ఫిబ్రవరి 9వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

4 Min read
Author : Navya G
Published : Feb 09 2023, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ లో మాలిని, అరవింద్ సీరియస్ అవుతూ మల్లీ మా కాలేజీ లో జాయిన్ అవ్వడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు తనకి కూడా లేదు. కావాలని నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటుంది. మాలిని ప్లీజ్ తప్పుగా అపార్థం చేసుకోకు రేపు సమస్య వచ్చినప్పుడు అందరూ బాధపడాలి అని అంటాడు అరవింద్. ఓకే అరవింద్ నేను చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం అని భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అరవింద్ కూడా భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మల్లీ మనసులో నేను ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరుగుతుంది అనుకుంటూ ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

 అప్పుడు అనుపమ మల్లీ ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చెప్పాలి ఇద్దరికీ అర్థం అయ్యేలా నువ్వే చెప్పు అని అంటుంది. మరోవైపు గదిలోకి వెళ్లిన అరవింద్,మాలిని ఎవరికి ఎవరితో సంబంధం లేదు అన్నట్టుగా ఇద్దరు బాధపడుతూ నిలబడి ఉంటారు. ఇంతలోనే మల్లీ అక్కడికి వచ్చి బాబు గారు నేను లోపలికి రావచ్చా మీతో ఒక విషయం చెప్పాలి తప్పుగా అనుకోకండి అని అంటుంది. ఏం చెప్పాలి అనుకుంటున్నావో అది చెప్పు అంటాడు అరవింద్. అదే బాబు గారు నా కాలేజ్ విషయం గురించి మీరు గొడవపడడం ఏంటి నేను మాలిని అక్క వాళ్ళ కాలేజీలోనే చేరుతాను అని అంటుంది మల్లీ. ఏమంటావు అరవింద్ తను మా కాలేజీలో జాయిన్ అవుతాను అంటుంది సరే అని అంటాడు అరవింద్.
 

38

ఆ తర్వాత మాలిని ఆలోచించుకుంటూ ఉండగా ఇంతలో వసుంధర ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావ్ మాలిని అనడంతో ఏం లేదు మామ్ అని అంటుంది. ఆ మల్లీ విషయం ఏం చేశారు అనగా అప్పుడు వాళ్ళ కాలేజ్ సార్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మాలిని. అరవింద్ అన్న మాటల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. మా కాలేజీలోనే మామ్ అనడంతో, మీకు ముందే చెప్పాను కదా మాలిని వాళ్ళందరూ కలిసి మల్లీని మీ కాలేజీలోనే జాయిన్ చేస్తారని అనడంతో వాళ్లు ఎవరు చెప్పలేదు మామ్ నేనే అడిగాను అని అంటుంది మాలిని. ఏం చేస్తున్నావ్ అసలు ఏం జరిగిందో నీకు తెలుస్తుందా అనడంతో అప్పుడు ఏం జరిగిందంటే అని మాలిన జరిగింది మొత్తం వివరిస్తుంది.
 

48

 అప్పుడు మాలిని మాటలకు వసుంధర ఆశ్చర్య పోతుంది. అప్పుడు వసుంధర ఆ మల్లీ నీ ఎలా అయినా ఇంటికి దూరం చేద్దామనుకుంటే ఇంకా ఇంకా మనుషులకు దగ్గర అవుతుంది అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఇంట్లో అందరూ సంతోషంగా మల్లీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి మాలిని వస్తుంది. అప్పుడు మల్లీ నీ వారందరూ పొగుడుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మాలిని అక్కడికి రావడంతో కాలేజీకి వెళ్లలేదమ్మా అని అనగా లేదు మామయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోని అరవింద్ అక్కడికి వచ్చి ఏంటి టైం అవుతుంది కదా మల్లీ మాలిని ఇంకా రెడీ అవ్వలేదా అనగా  తలనొప్పిగా ఉందంట అని చెబుతాడు అరవింద్ వాళ్ళ నాన్న.

58

అప్పుడు సరే మాలిని వెళ్లకపోతే నేను వెళ్లి డ్రాప్ చేసి వస్తాను అని అక్కడికి వెళ్తాడు అరవింద్. మరోవైపు మాలిని గదిలోకి వెళ్లి అందరూ మల్లీని ఆ విధంగా  పొగడడంలో కారణం ఉంది కానీ అలా పొగిడితే నాకు ఎలాగో ఉంది అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మల్లీ అద్దంలో తనవైపు తాను చూసుకుంటూ గమ్యం చేయడానికి కొద్ది దూరం మాత్రమే ఉంది ధైర్యంగా అడుగులు వెయ్యి మల్లీ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మల్లీ కుంకుమ పెట్టుకుని నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటుండగా ఇంతలో గతంలో జరిగిన విషయాలు గుర్తుకు రావడంతో పెట్టుకోకుండా ఆగిపోతుంది. అప్పుడు జరిగిన విషయాలు తలచుకొని తలచుకొని నేను ఈ సింధూరం పెట్టుకొని నేను బయట ప్రపంచానికి కనిపించకూడదు.

68

మొన్న అరవింద్ బాబు పై ప్రేమతో బొట్టు పెట్టుకున్న అందుకే మాలిని అక్క అంత సీరియస్ అయ్యింది అనుకుంటూ ఉంటుంది. చివరికి బాబు గారి కళ్ళముందే మాలిని అక్క నా నుదుటిన సింధూరం అని తుడిపేసింది. ఇంట్లో ఉన్నన్ని రోజులు ఈ సింధూరాన్ని నేను ఎప్పుడూ పెట్టుకోను అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అరవింద్ అక్కడికి వచ్చి నాకోసం నువ్వు నీ జీవితాన్నే పోగొట్టుకున్నావు. ఇప్పుడు సింధూరాన్ని పెట్టుకోవడం కోసం నువ్వు భయపడుతుంటే ఒక భర్తగా నాకు అది ఇష్టం లేదు అని ఆ సింధూరం మల్లీ నుదుటిన పెట్టాలి అని చూస్తుండగా వద్దు బాబు గారు అని అంటుంది మల్లీ. చాలు మల్లీ ఇప్పటివరకు నువ్వు నాకోసం పడిన బాధలు చాలు ఎవరికీ తెలియకుండా నాకోసం నువ్వు నీ మంగళసూత్రాన్ని దాచుకుంటున్నావు.
 

78

 నువ్వు నాకు ఇంకేమీ చెప్పకు అని అరవిందు మల్లీ నుదుటిన సింధూరాన్ని పెడతాడు. అప్పుడు మల్లీని ఎప్పుడు తీసుకొని కాలేజీకి బయలుదేరుతాడు అరవింద్. మరోవైపు శరత్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి చాలా రోజుల తర్వాత నాకు సంతోషంగా ఉంది ఈ రోజు నా కూతురు మల్లీ, మాలిని వాళ్ళ కాలేజీలో జాయిన్ అవ్వబోతోంది అని సంతోషంగా చెబుతాడు. పోనీ లేరా మీరా కష్టపడిన దానికి ఇన్ని రోజులకు ఫలితం దక్కింది అనడంతో అవునమ్మా మీరా తల్లి తండ్రి అన్ని తానై నా బిడ్డను ఇంత పెద్ద దాన్ని చేసింది. నా కూతురు తన తల్లి కోరిక నెరవేర్చడానికి కష్టపడుతోంది అని అంటాడు శరత్. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసుంధర వస్తుంది. అప్పుడు వసుంధర అక్కడికి వచ్చి నేను చాలాసార్లు గమనించాను నేను రాకముందు మీరు ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు.
 

88

నేను రాగానే మీరు మాట్లాడుకునేది ఆపేస్తారు అసలు మీ మధ్య ఏముంది అని అంటుంది. అదేం లేదు వసుంధరn మేము మల్లీ గురించి మాట్లాడుకుంటున్నాము. అది నీకు నచ్చదు అని చెప్పి మేము మాట్లాడడం ఆపేసాము అంటాడు శరత్. అప్పుడు అంతలా విజయం ఏం సాధించిందని అంతగా గొప్పగా చెప్పుకోవడానికి అనడంతో నాకు తెలుసు వసుంధర నువ్వు కుళ్ళు కుంటావని అందుకే మేము మాట్లాడలేదు అంటాడు. ఆ తర్వాత అరవింద్ మల్లీ ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తారు. అప్పుడు మల్లీ కి సీట్లు బెల్ట్ పెట్టుకునేకి రాకపోవడంతో అరవింద్ హెల్ప్ చేస్తూ ఉండగా అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved