- Home
- Entertainment
- Killer Movie: క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సీ రేంజ్‌లో `కిల్లర్`.. డైరెక్టర్ ఓపెన్ స్టేట్‌మెంట్
Killer Movie: క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సీ రేంజ్‌లో `కిల్లర్`.. డైరెక్టర్ ఓపెన్ స్టేట్‌మెంట్
Killer Movie: `కిల్లర్` సినిమా చూశాక ఇంత వైవిధ్యంగా స్క్రిప్ట్ రాసి, సినిమా తెరకెక్కించవచ్చా ? అని థ్రిల్ అవుతారని చెప్పారు డైరెక్టర్ పూర్వాజ్. ఈ మూవీని ఒడిస్సీతో పోల్చడం విశేషం.

ఈ నెల 30న కిల్లర్ రిలీజ్
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్". ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. `కిల్లర్` సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది. ఓవర్సీస్ లో `కిల్లర్` మూవీని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు దర్శకుడు పూర్వాజ్.
కిల్లర్ సెన్సార్ పూర్తి
దర్శకుడు మాట్లాడుతూ, ``కిల్లర్` రిచ్ కంటెంట్ ఉన్న సినిమా. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు సర్టిఫికెట్ పొందింది. సినిమా చూశాక సెన్సార్ వాళ్ల మొహాలు ఆహ్లాదకరంగా కనిపించాయి. అంటే మా మూవీ వారికి నచ్చిందని అనుకున్నాం. మా సినిమాలో బ్లడ్ షెడ్ లేదు. రక్తం చూస్తే నాకే కళ్లు తిరుగుతాయి. కథలో హింస ఉన్నా, అది పాత్రలు ఎదుర్కొనే దాంట్లో కనిపించాలి గానీ పాత్రలను చిత్రహింసలు పెట్టినట్లు చూపించడం నాకు నచ్చదు. వాంపైర్ పాత్రను కూడా అలాగే అందరు చూసేలా ట్రీట్ చేశాం. మూవీలో టెర్రరిస్ట్ పాత్ర పది నిమిషాలు కనిపిస్తుంది మళ్లీ కనిపించదు. స్పై, వాంపైర్ పాత్రలు కూడా అలాగే ఉంటాయి. మళ్లీ ఆ పాత్రలు ఎక్కడా కనిపించవు.
క్రిస్టోఫర్ నోలన్ ఒడిస్సీతో కిల్లర్ పోలిక
మా సినిమా టీమ్ లోని వారు మా కిల్లర్ మూవీని క్రిస్టోఫర్ నొలన్ ఒడిస్సీ సినిమాతో పోల్చారు. అది కొంచెం అతి అనిపించవచ్చు కానీ మా మూవీ చూసి బయటకు వచ్చాక ఒడిస్సీతో మీరే పోల్చుకుంటారు. మా సినిమాను ఒడిస్సీతో పోల్చడం ఒక స్పాయిలర్ కూడా. కొన్నేళ్ల కిందట నేను స్క్రూడ్ అనే కాన్సెప్ట్ తో కథ రాసుకున్నాను. అది అప్పటికి నాకున్న రిసోర్సెస్ కు రూపొందించడం కుదరలేదు. అదే స్క్రిప్ట్ ను ఇప్పుడున్న ఆడియెన్స్ టేస్ట్ కు తగినట్లు మార్పులు చేసి కిల్లర్ సినిమా రూపొందించాను. విజువల్ గా ప్రేక్షకులు తెరపై చూసే ఏదైనా మంచి క్వాలిటీతో ఉండాలనేది మేకర్ గా నా అభిప్రాయం. సినిమాకు కంప్లీట్ స్క్రిప్ట్ అయ్యాకే మిగతా వాటి గురించి ఆలోచిస్తా. ఇది ఫీమేల్ సెంట్రిక్ మూవీ.
కిల్లర్ కథ ఇదేనా
కిల్లర్ సినిమాలో ప్రతి పాత్ర ఆర్ లెటర్ తోనే స్టార్ట్ అవుతాయి. ప్రాజెక్ట్ రూట్ అనే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంగా ఈ సినిమా ఉంటుంది. హీరోయన్ జ్యోతి చేసిన రక్తిక, రనైన, రియా..ఇలా పేర్లు ఆర్ తో ఉంటాయి. ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాత, నటుడిగా మూడు బాధ్యతలు తీసుకున్నాను. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అనే పాయింట్ ను మాస్ ఎలిమెంట్స్ తో కలిపిన కథతో మీకు కన్విన్సింగ్ గా చూపించే చిత్రమిది. మా సినిమా చూస్తున్నప్పుడు థ్రిల్ తో పాటు చిన్న స్మైల్ కూడా మీకు వస్తుంది. కథలోని అసలైన పాయింట్ కు షాక్ అవుతారు. ఇలా కూడా సినిమాను తీయొచ్చా అనుకుంటారు. జ్యోతి పూర్వజ్ కిల్లర్ సినిమాలో పూర్తిగా కొత్తగా చూస్తారు. ఆమె డిఫరెంట్ రోల్స్ లో ఆకట్టుకుంటారు. సింగిల్ టేక్ లో యాక్షన్ సీక్వెన్సులు చేశారు జ్యోతి. ఆమె ప్రతి పాత్రకు తగినట్లు మేకోవర్ అయ్యారు. ఆడియెన్స్ ఆమెను తెరపై చూస్తూ థ్రిల్ అవుతారు.
కోటి రూపాయల ఆఫర్
మా సినిమా సెకండాఫ్ లో ట్విస్ట్ చెప్పినవారికి కోటి రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించాం. ఇది ప్రమోషనల్ స్టంట్ అనుకుంటారు. ఒక మనిషిని నమ్మడానికి కొన్నేళ్లు పడుతుంది. దీని మీద ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం. హైకోర్టు లాయర్స్ కూడా అందులో పాల్గొంటారు. ఈ నెల 29న రాత్రి 10 గంటలకు మా మూవీ ప్రీమియర్స్ పడతాయి. 11 గంటలకు ఆ ట్విస్ట్ ఏంటనేది వాట్సాప్ చేయాలి. ఎవరు త్వరగా ఆన్సర్ పంపిస్తే వారి పేరు మా మూవీ సక్సెస్ మీట్ లో ఎల్ ఈడీ స్క్రీన్ మీద డిస్ ప్లే చేస్తాం. మా సినిమాకు ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని చెప్పాను. కానీ పదీ పదిహేను కోట్లు అని కూడా చెప్పొచ్చు. విజువల్స్, వీఎఫ్ఎక్స్ అంత రిచ్ గా ఉన్నాయి. మేము చెప్పినదానికంటే ఇంకా కొన్ని లక్షలు ఎక్కువే బడ్జెట్ అయ్యింది. మేము కోటి రూపాయల గిఫ్ట్ అనౌన్స్ చేయడం జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోయింది. మా సినిమా స్టోరీ చెబుతూ నాకు ఇన్ స్టాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే అంత ఈజీగా క్లూ అందదు` అని చెప్పారు పూర్వాజ్.

