- Home
- Entertainment
- Bigg Boss 10: నా ఫ్యామిలీ కోసం వచ్చా, స్నేహం కోసం కాదు.. వర్షిణికి త్రిగుణ్ ఝలక్.. నామినేషన్స్ లిస్ట్
Bigg Boss 10: నా ఫ్యామిలీ కోసం వచ్చా, స్నేహం కోసం కాదు.. వర్షిణికి త్రిగుణ్ ఝలక్.. నామినేషన్స్ లిస్ట్
బిగ్ బాస్ తెలుగు 10.. 8వ వారం నామినేషన్స్ ఫైనల్ అయ్యింది. ఈ వారంలో ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. అయితే వర్షిణి, త్రిగుణ్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

బిగ్ బాస్ తెలుగు 10 నామినేషన్స్
బిగ్ బాస్ తెలుగు 10.. ఎనిమిదవ వారానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ఎపిసోడ్‌లోనూ కొనసాగింది. అయితే సోమవారం ఎపిసోడ్‌లో వర్షిణిని త్రిగుణ్ నామినేట్ చేశాడు. ఈ విషయంపై వర్షిణి హర్ట్ అయ్యింది. ఆరేళ్ల స్నేహం తమ మధ్య ఉందని, ఇలా చేస్తావని అనుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఆట కోసం, గేమ్ కోసమే తాను ఇలా చేశానని త్రిగుణ్ తెలిపారు. ఇంత వరకు నాకు ఓ హోప్, ధైర్యం ఉండేది, నీలో ఇలాంటి పర్సనాలిటీ ఉందని నాకు తెలీదు.. బయట చూసిన త్రిగుణ్ వేరు.. ఇక్కడ ఉన్నది వేరు.. నువ్వు నీ ఫ్రెండ్స్ కోసం ఎలా ఉంటావో నాకు తెలుసు అని వర్షిణి ఏడుస్తూ అంటుంది. అవును నేను ఆ రోజు ఓ ఫ్రెండ్ కోసం నిలబడలేదు ఫ్రెండ్‌గా ఫెయిల్ అయ్యానేమో గేమ్ మాత్రం గెలిచా. ఈ ఆటే ఇది అని చెప్పాడు త్రిగుణ్.
వర్షిణికి త్రిగుణ్ షాక్
అనంతరం తాను స్నేహం కోసం రాలేదని, ఫ్యామిలీ కోసం వచ్చానని, ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ల కోసమే వచ్చాను, వాళ్లే నా ఫస్ట్ ప్రయారిటీ అని ఇతర సభ్యులతో తెలిపారు త్రిగుణ్. వర్షిణికి పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలోనే వర్షిణి హర్ట్ అయ్యింది. అనంతరం ఇతర నామినేషన్ల ప్రక్రియ జరిగింది. నరేష్.. వర్షిణి, ఝాన్సీలను నామినేట్ చేశాడు. ఝాన్సీకి చెప్పిన కారణం వీక్‌గా ఉండటంతో జడ్జ్ లు దాన్ని అంగీకరించలేదు. కానీ వర్షిణి విషయంలో స్ట్రాంగ్‌గానే చెప్పాడు. గేమ్ వంద శాతం ఆడటం లేదని, గివప్ ఇస్తున్నావని, నిన్ను నమ్మిన వాళ్లకి ఇది దెబ్బ అని చెప్పాడు. ఇలా అయితే నిన్ను ఒకరూ దగ్గర తీసుకోలేరని చెప్పాడు. ఝాన్సీది చెబుతూ ఊరికే ఏడుస్తున్నావని, స్ట్రాంగ్‌గా ఉండాలని తెలిపారు. వర్షిణి నామినేషన్ ఓకే అయ్యింది.
సుధీర్ బ్లాక్ ఫూట్.. శివకుమార్
శివ.. సుధీర్, వంశీలను నామినేట్ చేశాడు. నామినేషన్‌లో అసలైన పాయింట్ పెట్టడం లేదన్నాడు. వాదించే విషయంలో గట్టిగా వాదించడం లేదని తెలిపారు. సుధీర్ ని నామినేట్ చేస్తూ, తనకు మరో పేరు పెట్టాలనుకుంటున్నానని, బ్లాక్‌ఫూట్ అని వెల్లడించాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు సమస్య వస్తే, దాన్ని కవర్ చేస్తున్నావ్‌గానీ, సొల్యూషన్ ఇవ్వడం లేదని తెలిపారు. వేస్ట్ కేప్టెన్ అని చెప్పాడు. సేఫ్ గేమ్ ఆడుతున్నావని తెలిపారు. సుధీర్ నామినేషన్ ఓకే అయ్యింది. రామ్ ప్రసాద్.. శివని నామినేట్ చేశాడు. మొదట్లో సొంతంగా ఆడతానని చెప్పావని, ఒక్క టాస్క్ తర్వాత అందరం కలిసి ఆడదామని మాట మార్చావని తెలిపారు.
8వ వారం నామినేషన్‌లో ఉన్నది వీళ్లే
స్వేత.. దేబ్జానీని నామినేట్ చేసింది. తాను ఊరికే ఏడుస్తుందని తెలిపింది. అనంతరం.. రోహిత్.. నరేష్‌ని నామినేట్ చేశాడు. నేను వందశాతం ఇవ్వలేనని నరేష్ చెప్పడం తప్పు అని తెలిపారు. రామకృష్ణ.. వర్షిని నామినేట్ చేశాడు. గేమ్ ముఖ్యం కాదు, పర్సనాలిటీ ముఖ్యమని అంటున్నావు, కానీ గేమే చాలా ముఖ్యమని తెలిపారు. సింగర్ ఝాన్సీ.. శివని నామినేట్ చేసింది. మొదటి టాస్క్ లో ఓడిపోతే గెలిచి చూపిస్తానని తెలిపారు. ఆ తర్వాత చూపించలేదని తెలిపారు. గోట్ అయ్యే ఛాన్స్ ని కూడా వదిలేశావని చెప్పింది. అనంతరం స్వేత.. ఝాన్సీని నామినేట్ చేసింది. వీళ్లు కాకుండా రెడ్ జోన్‌లో వంశీ, నరేష్,స్వేత ఉన్నారు. ఇందులో నుంచి ఒకరిని నామినేట్ చేయాల్సి రాగా, వంశీని నామినేట్ చేశారు. దీంతో 8వ వారం నామినేషన్ లో ఉన్నారనేద చూస్తే, సింగర్ ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్‌రెడ్డి, రామ్ ప్రసాద్, వర్షిణి, శివ, వంశీ ఈ వారం నామినేట్ అయ్యారు.

