- Home
- Entertainment
- Ennenno Janmala Bandam: యష్ గుట్టును బయట పెట్టిన సులోచన.. కోపాన్ని తట్టుకోలేకపోతున్న అభిమన్యు!
Ennenno Janmala Bandam: యష్ గుట్టును బయట పెట్టిన సులోచన.. కోపాన్ని తట్టుకోలేకపోతున్న అభిమన్యు!
Ennenno Janmala Bandam: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల (Ennenno Janmala Bandam) బంధం సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Ennenno Janmala Bandam
యశోదర్ తన భార్య గురించి గర్వంగా పొగుడుతూ మాళవిక (Malavika) కు చెబుతుండగా వేద గమనిస్తుంది. ఇక అదే క్రమంలో యశోదర్ (Yashodhar) మాళవిక దంపతులను ఘోరంగా అవమానిస్తాడు. ఆ తర్వాత ఖుషి ఇంటికి వచ్చినందుకు ఫ్యామిలీ అంతా పెద్దగా సెలబ్రేషన్స్ చేస్తారు. అంతేకాకుండా అందరూ ఖుషి (Khushi) కు సర్ప్రైజ్ రూపంలో గిఫ్ట్ లు కూడా ఇస్తారు.
Ennenno Janmala Bandam
ఆ తర్వాత ఖుషి (Khushi) తనకు అందరు గిఫ్ట్ లు ఇచ్చినందుకు గాను అందరికీ రిటర్న్ గిఫ్ట్ గా రోజా పువ్వులు ఇస్తుంది. అదే క్రమంలో వాళ్ళ నాన్న యశోదర్ కి ఒక పువ్వు ఇచ్చి వాళ్ళ అమ్మ కు ప్రపోజ్ చేయమని చెబుతుంది. దీనికి యశోదర్ (Yashodhar) ఇష్టపడడు. కానీ ఖుషి ప్లీజ్ డాడీ నా కోసం అంటూ బ్రతిమిలాడుతుంది.
Ennenno Janmala Bandam
ఇక యశోదర్ (Yashodhar) కింద కూర్చుని ప్రపోస్ చేసిన విధంగా రోజ్ ను వేద కు ఇస్తాడు. దానికి ఫ్యామిలీ అంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు. మరోవైపు అభిమన్యు (Abhimanyu).. యశోధర్ అంటూ గట్టిగా అరుచుకుంటూ కుమిలి పోతాడు.
Ennenno Janmala Bandam
ఆ తర్వాత మాళవిక (Malavika) నా మాజీ భర్త కు బుద్ధి చెప్పాలంటే మనిద్దరం పెళ్లి చేసుకోవాలి అని అభిమన్యు తో అంటుంది. దానికి అభిమన్యు అంగీకరించడు. అంతేకాకుండా నాకు పెళ్లి కంటే వాడి మీద పగ తీర్చుకోవడం ముఖ్యం అని యశోదర్ గురించి అంటాడు. దాంతో మాళవిక, అభిమన్యు (Abhimanyu) ల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి.
Ennenno Janmala Bandam
మరోవైపు మాలిని (Maalini) సులోచన ఫ్యామిలీ లు కలిసి వేద వండిన వంటలు ఆస్వాదిస్తూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక యశోదర్ ఆ వంటలు బాగున్నాయేమో అనుకొని దొంగచాటుగా తింటూ ఉంటాడు. ఆ విషయాన్ని సులోచన (Sulochana) ఫన్నీగా బయట పెడుతుంది.
Ennenno Janmala Bandam
ఇక తరువాయి భాగంలో ఖుషి (Khushi) మంచం పై తన తల్లిదండ్రుల మధ్య పడుకుంటుంది. ఆ క్రమంలో వేద యశోధర్ (Yashodhar) ల చేతులను ఖుషి కలుపుతుంది దాంతో వాళ్లిద్దరూ ఒకరినొకరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు.