MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Crime Thriller: 3 కోట్ల బడ్జెట్... 60 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్

Crime Thriller: 3 కోట్ల బడ్జెట్... 60 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్

Crime Thriller: ఓటీటీలో మలయాళ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఊహించని మలుపులు, ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో వచ్చే క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌ను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 05 2026, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మలయాళ క్రైమ్ థ్రిల్లర్
Image Credit : OTT

మలయాళ క్రైమ్ థ్రిల్లర్

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మలయాళ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ దక్కుతుంది. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌ను జనాలు బాగా చూస్తారు. తాజాగా థియేటర్లలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్' సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుంది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఐఎమ్‌డీబీ (IMDb)లో కూడా ఈ సినిమాకు 7.8 రేటింగ్ దక్కింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అలీనా అబ్రహాం పాత్ర చుట్టూ కథ
Image Credit : OTT

అలీనా అబ్రహాం పాత్ర చుట్టూ కథ

అలీనా అబ్రహాం అనే పాత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. కారుణ్య నియామకం కింద పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరిన ఆమె.. అనుకోకుండా ఒక క్రైమ్‌లో ఇరుక్కుంటుంది. నైట్ డ్యూటీలో ఉన్న కొందరు పోలీసులు అనుకోకుండా ఒక నేరం చేస్తారు. అది బయటకు రాకుండా ఉండేందుకు, తమకున్న పోలీస్ నాలెడ్జ్‌తో సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఒక క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ ఈ కేసును టేకప్ చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. నేరాన్ని దాచాలనుకునే పోలీసులకు, నిజాన్ని బయటపెట్టాలనుకునే ఆఫీసర్‌కు మధ్య జరిగే మైండ్ గేమ్‌ ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంది.

35
సినిమా కథ ఏంటంటే?
Image Credit : OTT

సినిమా కథ ఏంటంటే?

క్రైమ్ జరిగిన చోట సాక్ష్యాలను వాళ్లు ఎలా మాయం చేశారు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ల కదలికలను ఎలా పసిగట్టాడు? అనుమానాస్పద విషయాలను ఒకదానితో ఒకటి ఎలా లింక్ చేశాడు? అనేదే ఈ సినిమా కథ. నేరం చేసిన వాళ్లే పోలీసులు కావడం ఈ కథకు ఒక కొత్త కోణాన్ని ఇస్తుంది. నిజాన్ని కనిపెట్టే ప్రతి ప్రయత్నం కొత్త ప్రశ్నలను పుట్టిస్తూ స్క్రీన్ ప్లే ఉత్కంఠగా సాగుతుంది. చివరికి అసలు నిజం ఎలా బయటపడిందనేది ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది.

45
ఎవరెవరు నటించారు?
Image Credit : OTT

ఎవరెవరు నటించారు?

షహద్ నిలంబూర్ ఈ 'ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్' సినిమాకు దర్శకత్వం వహించాడు. పార్వతి తిరువోతు, మాథ్యూ థామస్, విజయరాఘవన్, వినయ్ ఫోర్ట్, సిద్ధార్థ్ భరతన్, ఉన్నిమాయ ప్రసాద్, అజీస్ నెడుమంగాడ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. అర్జున్ సెల్వ నిర్మించిన ఈ చిత్రానికి పీఎస్ సుబ్రమణియన్, విజేష్ తొట్టింగల్ కలిసి స్క్రీన్ ప్లే అందించారు. ముజీబ్ మజీద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూర్చాడు. క్రైమ్, ఇన్వెస్టిగేషన్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ కాంబినేషన్ కచ్చితంగా నచ్చుతుంది.

55
ఓటీటీలో మలయాళ ఇన్వెస్టిగేషన్ మూవీ
Image Credit : OTT

ఓటీటీలో మలయాళ ఇన్వెస్టిగేషన్ మూవీ

థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయింది. అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తారు కాబట్టి, ఇక్కడ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాలో.. నేరాన్ని దాచే పోలీసులకు, నిజాన్ని వెతికే ఆఫీసర్‌కు మధ్య జరిగే పోరు ఎలా ముగుస్తుందనేది తెరపైనే చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఓటీటీ
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AK 47: ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా, అసలు కారణం ఏంటంటే?.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే, నిరాశలో వెంకీ అభిమానులు
Recommended image2
Vijay Deverakonda: రష్మికను పెళ్లి చేసుకోవడానికి ఒక్కటే కారణం.. అసలు గుట్టు విప్పిన విజయ్!
Recommended image3
Mohan Babu: రోడ్డున పడతాడని తెలిసినా.. మోహన్ బాబు చేసిన సాహసం, 7 ప్లాప్ ల తర్వాత బయటపడ్డ డైలాగ్ కింగ్..
Related Stories
Recommended image1
USA: అమెరికాలో అపార్ట్‌మెంట్లు ఉండవా.? అసలు అక్క‌డ రెంట్స్ ఎలా ఉంటాయో తెలుసా.?
Recommended image2
Vijay Deverakonda: రష్మికను పెళ్లి చేసుకోవడానికి ఒక్కటే కారణం.. అసలు గుట్టు విప్పిన విజయ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved