- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: తండ్రి ప్రేమను మిస్ అవుతున్న ఖుషి.. వేదకు అసలు నిజం చెప్పేసిన యష్!
Ennenno Janmala Bandham: తండ్రి ప్రేమను మిస్ అవుతున్న ఖుషి.. వేదకు అసలు నిజం చెప్పేసిన యష్!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమౌతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఖుషి (Khushi) తన తండ్రితో ఇష్టంగా జడలు వేయించుకుంటుంది. అది చూసిన వేద ఆశ్చర్యపోతుంది. ఇక ఖుషి తన డాడీ తనకు జడ వేసినందుకు సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ సంతోషాన్ని చూసిన యష్ (Yash).. తన కూతురికి తనపై ఇంత ప్రేమ ఉందా అనుకోని లోలోపల కుంగిపోతూ ఉంటాడు.
ఎప్పటికైనా ఖుషి (Khushi) నా సొంతం అని.. తనను వదులుకునేది లేదు అని అనుకుంటాడు యష్ (Yash). ఇక తన చేతిలో ఉన్న దువ్వెనకు వెంట్రుకలను తీసుకొని డాక్టర్ దగ్గరికి బయలుదేరుతాడు. ఇక అక్కడ ఖుషి వెంట్రుకలు ఇచ్చి డీఎన్ఏ కి పంపిస్తాడు.
ఇక డాక్టర్ యష్ (Yash) ది బ్లడ్ శాంపిల్ కూడా ఇవ్వమంటాడు. దాంతో యష్ ఆలోచనలో పడతాడు. పైగా తనకు ఖుషి గుర్తుకు రావటంతో.. ఖుషి తో గడిపిన క్షణాలు తలచుకుంటాడు. అంతేకాకుండా అభిమన్యు (Abhimanyu) మాట్లాడిన మాటలను తలుచుకుంటూ కోపంతో రగిలిపోతాడు.
యష్ (Yash) తన దగ్గరికి తన కూతురుకి వచ్చి మాట్లాడినట్లు ఊహించుకుంటాడు. ఎప్పటికీ నన్ను వదలరు కదా నాన్నా అంటూ ఖుషి (Khushi) మాట్లాడినట్లు ఊహించుకుంటాడు. దాంతో యష్ ఈ టెస్ట్ చేయించి ఇంట్లో వాళ్లకు అన్యాయం చేస్తున్నానా అని అనుకుంటాడు.
ఖుషి (Khushi) అంటే అందరికీ ఇష్టం అని ఆ సంతోషాన్ని ఎప్పుడూ అలాగే ఉంచాలి అని.. తను నా కూతురు అని.. తన తొలి నవ్వులు నేను చూశాను అని.. తన కన్నీటిని నేనే తుడిచాను అని యష్ (Yash) లోలోపల అనుకుంటూ డీఎన్ఏ టెస్ట్ చేయించడం కరెక్ట్ కాదని అనుకుంటాడు.
ఇక ఇంట్లో ఖుషి తన తండ్రి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. వేద (Vedha) వచ్చి ఖుషి పక్కన కూర్చుండగా.. ఖుషి (Khushi) తన తండ్రికి రాసిన ఉత్తరాన్ని వేద కు వినిపిస్తుంది. అందులో తన డాడీ గురించి గొప్పగా రాస్తూ.. తన డాడీ తో గడపలేని క్షణాలను తల్చుకుంటూ బాధపడుతుంది.
అది చూసిన వేద (Vedha) తట్టుకోలేక పోతుంది. మరోవైపు యష్ బాగా తాగి మాళవిక ఇంటికి వెళ్లి మాళవిక తో ఖుషి తన కూతురా కాదా అంటూ తనను చంపడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే మాళవిక (Malavika) తప్పించుకొని వేదకు ఫోన్ చేసి యష్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెబుతుంది.
తరువాయి భాగం లో యష్ (Yash) ను ఏం జరిగింది అని వేద గట్టిగా అడగటంతో.. వెంటనే యష్.. ఖుషి (Khushi) తన కూతురు కాదని అంటున్నారని అసలు నిజం చెప్పడంతో వేద షాక్ అవుతుంది.