MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Malavika Mohanan: ప్రియుడిని పరిచయం చేస్తానని ఇంత మోసం చేస్తుందా.. మాళవికపై నెటిజన్ల ఫైర్‌.. ఏం జరిగిందంటే?

Malavika Mohanan: ప్రియుడిని పరిచయం చేస్తానని ఇంత మోసం చేస్తుందా.. మాళవికపై నెటిజన్ల ఫైర్‌.. ఏం జరిగిందంటే?

సెక్సీ అందాల భామ మాళవిక మోహనన్‌.. ఓ అందాల సంచలనం. ఆమె ఘాటెక్కించే అందాలు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతేకాదు ఆమెని ఫాలోవర్‌ లిస్ట్ లో చేరిపోతారు. కానీఈ బ్యూటీ అభిమానులకు వాలెంటైన్స్ డే రోజు షాకిచ్చింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 15 2022, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మాళవిక మోహనన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె నిత్యం తన ఫోటో షూట్లతో రెచ్చిపోతుంటుంది. ఎప్పుడు ఆమె నుంచి కొత్త ఫోటోలు వస్తాయని అంతా ఎదురుచూస్తుంటారు. మాళవిక కూడా వారు ఆశించిన దాన్ని మించి సర్‌ప్రైజ్‌లిస్తూ ఆకట్టుకుంటుంది. హాట్‌ డోస్‌ పెంచుతూ వారికి ఫుల్‌ మీల్స్ పెడుతుంటుంది. అందుకే ఈ బ్యూటీకి బయట కంటే సోషల్‌ మీడియాలోనే ఫాలోయింగ్‌ ఎక్కువ. 
 

27

తాజాగా ఈ అందాల సోయగం తనని నమ్ముకున్న, తనని ఆరాధిస్తున్న అభిమానులకు షాకిచ్చింది. నెటిజన్లకి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేసింది. ఆ మధ్య త్వరలోనే తన ప్రియుడిని పరిచయం చేయబోతున్నా అంటూ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తాను ప్రేమలో ఉన్నానని, త్వరలోనే బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేస్తానని చెప్పింది. దీంతో వాలెంటైన్స్ డే సందర్భంగా మాళవిక తన ప్రియుడిని పరిచయం చేస్తారని అంతా ఎదురుచూశారు. 

37

కానీ ప్రేమతో కూడిన మాటలు చెబుతూ ఓ వీడియోని షేర్‌ చేసింది మాళవిక.ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఆ వీడియోకి మిలియన్ వ్యూస్‌ రావాలని తెలిపింది. దీంతో ఆ వీడియోని లక్షలాది మంది ఎగబడి చూశారు. తీరా చూస్తే అదొక కార్‌ యాడ్‌. ఆ కార్‌ని ప్రమోట్‌ చేస్తూ మాళవికపై చేసిన వీడియో. తన బాయ్‌ ఫ్రెండ్‌ కారే అని కూల్‌గా చెప్పి షాకిచ్చింది. ఆమె ప్రియుడి కోసం వేచి చూసిన నెటిజన్లని ఫూల్స్ చేసింది. 

47

దీంతో నెటిజన్లు మాళవికపై మండిపడుతున్నారు. ఇంతటి షాకిస్తుందా అంటూ నోరెళ్లబెడుతున్నారు. మాళవికపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంతో ఇన్నోసెంట్‌గా భావించామని, కానీ ఇలా షాకిస్తావని ఊహించలేదని వాపోతున్నారు. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో కామెడీ చేయోద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి అభిమానులు అసంతృప్తికి మాళవిక ఎలాంటి ట్రీట్‌ ఇచ్చి కూల్‌ చేస్తుందో చూడాలి. 

57

ఇదిలా ఉంటే ప్రస్తుతం మాళవిక తమిళంలో ధనుష్‌ సరసన నటిస్తుంది. `మారన్‌` పేరుతో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. వాలెంటైన్స్ డే సందర్బంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌ వచ్చింది. లవ్‌ మూడ్‌లో ఉన్న ధనుష్‌, మాళవిక పోస్టర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

67

మరోవైపు తెలుగులోకి ఈ భామ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో కలిసి నటించబోతుందట. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. `రాజా డీలక్స్` అనే పేరు వినిపిస్తుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లకు ఆస్కారం ఉందని, మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌గా మాళవికని సంప్రదించినట్టు టాక్. అలాగే శ్రీలీలని కూడా అనుకుంటున్నారని సమాచారం. 
 

77

మాళవికకి తెలుగులో నటించాలనేది డ్రీమ్‌. ముఖ్యంగా ఆమె సూపర్‌ స్టార్‌ మహేష్‌తో నటించాలని ఉందనే తెలిపింది. ఇటీవల ఆమె అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్బంగా మహేష్‌తో కాంబినేషన్‌ కోసం వెయిటింగ్‌ అని అడగ్గా నేను కూడా వెయిటింగ్‌ అని చెప్పింది. ఆయనతో నటించాలని ఉందని చెప్పింది. అంతేకాదు మహేష్‌కి స్పెషల్‌గా బర్త్ డే విషెస్‌ కూడా చెబుతూ ఆయన్ని కాక పట్టే పనిలో ఉంది మాళవిక. మరి ఆమె కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved