- Home
- Entertainment
- చీరలో అందాలు బంధించిన మల్లు బ్యూటీ.. ట్రెడిషనల్ లుక్‌లో కట్టిపడేస్తున్న మాళవిక..ఆ స్మైల్‌కి పడిపోవాల్సిందే!
చీరలో అందాలు బంధించిన మల్లు బ్యూటీ.. ట్రెడిషనల్ లుక్‌లో కట్టిపడేస్తున్న మాళవిక..ఆ స్మైల్‌కి పడిపోవాల్సిందే!
మల్లు భామ మాళవిక మోహనన్ ఆటంబాంబ్ లాంటి అందాలకు కేరాఫ్. ఆమె సాధ్యమైనంత వరకు బోల్డ్ గా ఫోటో షూట్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇంటర్నెట్‌లో బ్లాస్ అవుతుంటుంది.

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ తాజాగా శారీలో మెరిసింది. బ్లూ శారీలో హోయలు పోయింది. సిగ్గులొలికిస్తూ ఆమె ఇచ్చిన పోజులు మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లో మల్లు భామని చూసి ఫ్యాన్స్ సైతం ఫిదా అయిపోతున్నారు.
మాళవిక మోహనన్ తాజాగా చీర కట్టి పిచ్చెక్కించే పోజులిచ్చింది. ఓ వైపు సిగ్గులు పోతూ, మరోవైపు నవ్వులు చిందిస్తూ, చెక్కదిమ్మెని పట్టుకుని ఆమె ఇచ్చిన పోజులు ఆద్యంతం ఆకర్షిస్తున్నాయి. కుర్రాళ్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.
సహజంగా ట్రెండీ వేర్‌లో, పొట్టి దుస్తుల్లో అందాలు దాచుకోకుండా ఆరబోస్తూ విజువల్ ట్రీట్ ఇస్తుంటుంది మాళవిక. కానీ చాలా రేర్ కేసులోనే చీరలో మెరుస్తుంది. అయితే బోల్డ్ లుక్‌లో కంటే చీరలోనే, అంటే ట్రెడిషనల్ లుక్‌లోనే ఆమె మరింత అందంగా ఉంటుందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మాళవిక మోహనన్ ప్రారంభం నుంచి హాట్ షో చేస్తూ వచ్చింది. ఆమె అందాల ఆరబోయడమే లక్ష్యంగా కనిపించింది. తరచూ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మేకర్స్ కి తన అందాలను ఎరగా వేస్తూ అవకాశాలను రాబట్టే ప్రయత్నం చేసింది. అయితే ఆమెకి నెమ్మదిగా ఛాన్స్ లు వస్తున్నాయి. ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాకపోవడంతో కెరీర్ స్ట్రగులింగ్‌లోనే సాగుతుంది.
అయితే ఇప్పుడు మాత్రం నెమ్మదిగా ఛాన్స్ లను దక్కించుకుంటుంది. ఇప్పటికే హిందీలో ఓ సినిమా చేస్తుంది. తమిళంలో విక్రమ్‌లో సినిమా చేస్తుంది. దీంతోపాటు మలయాళంలో `క్రిస్టీ`మూవీలో నటిస్తుంది. మరోవైపు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.
టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్‌తో సినిమా చేస్తుందని సమాచారం. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుందట. ఇందులో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లకి ఛాన్స్ ఉందని, మెయిన్ లీడ్‌గా మాళవిక కనిపిస్తుందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.