- Home
- Entertainment
- Ennenno Janmala Badandm: వేదపై ఒట్టేసి నిజం చెప్పిన యష్.. ప్రశ్నార్థకంగా మారిన ఖుషి జీవితం?
Ennenno Janmala Badandm: వేదపై ఒట్టేసి నిజం చెప్పిన యష్.. ప్రశ్నార్థకంగా మారిన ఖుషి జీవితం?
Ennenno Janmala Badandm: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల (Ennenno Janmala Badandm) బంధం సీరియల్ తండ్రీ కూతుర్ల మధ్య ఉన్న ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

మాళవిక అభిమన్యు (Abhimanyu) కు కాల్ చేసి నువ్వు అనవసరంగా ఖుషి నీ కూతురు అని చెప్పావు. యష్ తప్పతాగి నన్ను కత్తి తో పొడవటానికి వచ్చాడు అని చెబుతుంది. ఆ క్రమంలో అభిమన్యు నీ మాజీ మొగుడితోనూ పగ తీర్చుకునే అవకాశం నీ కాళ్ళ దగ్గరకు వచ్చింది బంగారం మాళవిక (Malavika) తో అంటాడు.
ఇక ఆ తర్వాత మాళవిక (Malavika) వేద కు ఫోన్ చేసి యష్ నా బెడ్ రూం లోకి దూరి నా పైన అఘాయిత్యం చేయబోయాడు అని చెబుతుంది. అంతే కాకుండా వద్దు అన్న ముద్దు అంటాడు. కట్టుకున్న నిన్ను ముట్టుకోను అని అంటాడు అని మాళవిక వేద (Vedha) బాధ పడే విధంగా అనేక విధాలుగా లేనిపోని మాటలు చెబుతుంది.
మాళవిక (Malavika) మాటలు విన్న వేద ఒక్కసారిగా కుంగిపోతుంది. అంతేకాకుండా అక్కడి నుంచి వెంటనే మాళవిక ఇంటికి బయలు దేరుతుంది. ఇక వేద తో మాళవిక యష్ (Yash) నన్ను వందసార్లు లవ్ యు లవ్ యు అని అంటున్నాడు అని చెబుతుంది. అదే క్రమంలో ఏం మనిషి ఇతను మానం మర్యాద లేని మృగం అని అంటుంది.
ఇక యష్ (Yash) ను లేవడానికి ప్రయత్నం చేస్తున్న వేదను యష్ తాగిన మత్తులో దూరం గా నెట్టేస్తాడు. దాంతో మాళవిక నువ్వు యష్ ను పెళ్లి చేసుకొని జీవితంలో పెద్ద తప్పు చేశావని అనేక మాటలు నూరి పోస్తుంది. ఆ తరువాత వేద (Vedha) యష్ ను కారు లో ఒక చోటికి తీసుకు వెళ్లి ముఖం పై నీళ్లు కొడుతుంది.
ఇక అక్కడ వేద (Vedha) యష్ ను నిజమేంటో చెప్పాలి అంటూ యష్ చేత ఒట్టు వేయించుకుంటుంది. ఇక యష్ (Yash) తన మనసులోని బాధను మొత్తం కక్కేస్తాడు. దాంతో వేద ఎంతో బాధపడుతుంది.
ఇక రేపటి భాగంలో వేద (Vedha) తన నడుం కనిపించేలా అందంగా తడి జుట్టును డ్రై చేసుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన యష్ (Yash) అలానే చూసుకుంటూ ఉండిపోతాడు. ఇక రేపటి భాగం లో వీరిద్దరు ఇంకెంత రొమాంటిక్ గా చూసుకుంటారో చూడాలి.