MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: రోడ్డు పాలైన మాళవిక జీవితం.. ఎంజాయ్ చేస్తున్న వేద దంపతులు!

Ennenno Janmala Bandham: రోడ్డు పాలైన మాళవిక జీవితం.. ఎంజాయ్ చేస్తున్న వేద దంపతులు!

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. భర్త పేదవాడని అతనిని వదిలేసి డబ్బున్న వాడితో వెళ్లిపోయి జీవితాన్ని నడిరోడ్డుపాలు చేసుకున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Navya G | Published : May 26 2023, 12:10 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

 ఎపిసోడ్ ప్రారంభంలో మా అమ్మ ఎప్పుడు మీ అందరితోనే వస్తూనే ఉంటుంది కానీ డాడీ తో వెళ్ళడం ఎప్పుడైనా చూసారా అందుకే ఈసారి మమ్మీ డాడీ తో వెళ్తుంది అంటుంది ఖుషి. అంతలోనే వేద రావడంతో విషయం చెప్పి నీకు నాలుగు ఛాయిస్ లు ఉన్నాయి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఎవరూ హర్ట్ అవ్వకూడదు అంటుంది ఖుషి.
 

29
Asianet Image

 తల్లిదండ్రులు అత్తమామలు ఎంత ముఖ్యమైనప్పటికీ ఆడది భర్త అడుగుజాడల్లోనే నడవాలి. అందుకే నేను నా భర్తతోనే వెళ్తాను. నేను నా భర్తతో వెళ్లడం వల్ల ఎవ్వరూ హర్ట్ అవ్వరు ఎందుకంటే భార్య భర్తలు కలిసి ఉంటే ముందుగా సంతోషించేది తల్లిదండ్రులు అత్తమామలే అంటుంది వేద. భలే చెప్పావు మమ్మీ ఒక్క డైలాగుతో అందర్నీ ఫ్లాట్ చేసేసావు సూపర్ మామ్ అంటూ మెచ్చుకుంటుంది ఖుషి.
 

39
Asianet Image

 వేద రాను అనటంతో ఎవరి పనులు చేసుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోతారు. వేద రెడీ అయి వస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది. కూతుర్ని ఎత్తుకొని ముద్దు చేస్తాడు. మీ మమ్మీ మీరు పార్టీని ఎంజాయ్ చేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఖుషి. సీన్ కట్ చేస్తే అభి రిలీజ్ అయ్యాడని తెలుసుకుంటుంది మాళవిక.
 

49
Asianet Image

ఆనందంతో అతనికి హారతి ఇచ్చి స్వాగతం పలుకుదామని హారతి పళ్ళెంతో గుమ్మం దగ్గరికి వస్తుంది. ముందుగా వచ్చిన బ్రమరాంబికని అభి ఏడి అని అడుగుతుంది. అభిని పిలుస్తుంది భ్రమరాంబిక. పెళ్లి బట్టల్లో కారు దిగిన అభ్యుని చూసి షాక్ అయిపోతుంది మాళవిక. నీలాంబరి చేయి పట్టుకొని గుమ్మం దగ్గరకు వస్తాడు అభి. కొత్త దంపతులకు హారతి ఇవ్వు అంటుంది భ్రమరాంబిక.

59
Asianet Image

 షాక్ లో పళ్లాన్ని ఎత్తేస్తుంది  మాళవిక. అలాగే అలాగే వదిలేసి లోపలికి వెళ్ళిపోతారు అభి వాళ్లు. తరువాత మాళవిక లోపలికి వచ్చి ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశావు నన్ను చేసుకుంటానని చెప్పి దాని అర్థం చేసుకొని వచ్చావు అంటూ నిలదీస్తుంది. ఇందులో మోసం ఏముంది నువ్వు నీ భర్తని వదిలేసి ఎక్కడికి వచ్చేసావు నేను నిన్ను వదిలేసాను ఇప్పుడు ఇంకొకటి దగ్గరికి వెళ్ళు
 

69
Asianet Image

 నీలాంటి వాళ్ళకి ఛాయిస్ లు చాలా ఉంటాయి అంటూ అసహ్యంగా మాట్లాడుతాడు అభి. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో మర్చిపోయావా.. నువ్వు కూడా ఎన్ని కబుర్లు చెప్పావు అంటూ ఏడుస్తుంది మాళవిక. ఏంటి ఈ న్యూసెన్స్ త్వరగా తనని బయటికి పంపించేయ్ అంటుంది భ్రమరాంబిక. నీలాంబరి కూడా చికాకు పడటంతో అసలు నువ్వు ఎవరు నా అభిని పెళ్లి చేసుకోవటానికి అంటూ ఆమె మీదకి గొడవకి వెళుతుంది మాళవిక.

79
Asianet Image

నా బంగారం మీద నోరు చేసుకుంటావా.. నేను జైల్లో కూర్చున్నప్పుడు తన పవర్ ఉపయోగించి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది ప్రతిఫలంగా నన్ను పెళ్లి చేసుకోమంది. తనకి ఒక స్టేటస్ ఉంది నీకు లాగా పరాన్నజీవి లాగా పక్క వాళ్ళ మీద పడి బ్రతికేయడం లేదు అంటూ మాళవికని  బయటికి గెంటేసే తలుపు వేసేస్తాడు అభి. ఇప్పుడు నువ్వు కాదంటే నేను ఎక్కడికి వెళ్ళటం.. నాకు అన్యాయం చెయ్యొద్దు అంటూ తలుపులు బాదుతూ ఏడుస్తుంది మాళవిక.

89
Asianet Image

సీన్ కట్ చేస్తే వేద రెడీ అవుతూ ఉంటుంది. అంతా బానే ఉంది కానీ ఏదో మిస్సయింది మమ్మీ అదే ఏంటో తెలియట్లేదు ఉండు డాడీని పిలుస్తాను అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది ఖుషి. ఇవి తక్కువయ్యాయి అనుకొని పూలు తీసుకొస్తాడు యష్. ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది వేద. ఎందుకు బాగోదు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది భార్యాభర్తల బంధాన్నే అంటాడు యష్. పూలు పెట్టమన్నట్లుగా తల చూపిస్తుంది వేద. పూలు పెడుతూ ఏదో తెలియని రొమాంటిక్ ఫీలింగ్ అంటాడు యష్. ఈమధ్య ఒక్కొక్క ఫీలింగ్ బయటపడటం తెలుస్తూనే ఉంది అంటుంది వేద. 

99
Asianet Image

కొంటెగా నవ్వుతాడు యష్. మరోవైపు అభి తనని మోసం చేయటాన్ని తలుచుకొని  బాధపడుతూ రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది మాళవిక. మరోవైపు పాయసం చేసి తీసుకువస్తుంది సులోచన. నేను చేసిన అంత టేస్టీగా లేదు అంటుంది మాలిని. మళ్లీ ఇద్దరూ గొడవ పడతారు. అలా మాట్లాడుకుంటూ టాపిక్ యష్ వాళ్ళ మీదకి వెళుతుంది. యష్ వేదని హోటల్ రూమ్ కి తీసుకు వెళ్తున్నాడు అని చెప్తాడు రత్నం. అలా ఎందుకు.. మన ఇల్లు ఉంది కదా అంటుంది సులోచన. నాకు అర్థమైంది వాళ్ళు కూడా హనీమూన్ కే కదా వెళ్లారు అంటుంది మాలిని. అవును అంటాడు రత్నం. అందరూ ఆనందపడతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories