- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: అసూయతో రగిలిపోతున్న మాళవిక.. భర్తల ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న మాలిని, సులోచన?
Ennenno Janmala Bandham: అసూయతో రగిలిపోతున్న మాళవిక.. భర్తల ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న మాలిని, సులోచన?
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. తను నిర్ధాక్షిణ్యంగా వదిలేసిన భర్త జీవితంలోకి మళ్లీ రావాలని కుట్రలు పన్నుతున్న ఒక ఆడదాని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో వేద కంట్లో నలక పడితే తీయడానికి ప్రయత్నిస్తాడు యష్. వాళ్ళిద్దరూ అలా క్లోజ్ గా ఉండడాన్ని చూసి అసూయతో రగిలిపోతుంది మాళవిక. అది చూసిన అభి కైలాష్ నవ్వుకుంటారు. ఈ లవ్ బర్డ్స్ క్లోజ్ గా ఉంటే ఆ ఈగలు బర్డ్ భరించలేక పోతుంది అంటాడు అభి. ఎవరి ముందు ఏది చేయకూడదో అదే షో చేసి చూపిస్తున్నారు అంటాడు కైలాష్.
మొత్తానికి వేద కంట్లో నలత తీసి గొప్పగా ఫీల్ అవుతాడు యష్. ప్రపంచాన్ని జయించిన వీరుడు లాగా ఫీలవుతున్నారు అని భర్తని ఆటపట్టిస్తుంది వేద. మాళవిక మీకు రొమాన్స్ కావాలి నాకు రివెంజ్ కావాలి. ఆ టైం ఎప్పుడు వస్తుందో అని మనసులో అనుకుంటుంది మాళవిక. మరోవైపు నీరసంగా ఉన్న రత్నం దాహం వేసేస్తుంది నాలుక పిడిచిపెట్టుకుపోయింది టైం కి దాహం తీరకపోతే నాకు బుర్ర పనిచేయదు అని అనుకుంటాడు.
నేను కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాను బావగారు అంటూ నీరసంగా చెప్తాడు శర్మ. మీరు కూడా ఇక్కడే ఉన్నారా.. మన బాధలు బాగా సింక్ అయ్యాయి అంటాడు రత్నం. బంధాలు కలిసినప్పుడు బాధలు కూడా కలవాలి కదా అయినా ఇక్కడ మన బాధలు పట్టించుకునే వారు ఎవరూ లేరు అని దిగులుగా మొహం పెడతాడు శర్మ. అంతలోనే అక్కడికి ఏదో వాసన తగలడంతో ఇదేదో మనకు సంబంధించిన వాసన లాగా ఉంది అనుకుంటారు ఇద్దరు.
అంతలోనే వసంత్ కొబ్బరి బొండాలు తీసుకొని వచ్చి మీ దాహం తీర్చుకోండి అంటాడు. మా దాహం ఈ దాహం కాదు. మీకు అర్థం కాదు అని నిష్టూరంగా మాట్లాడుతారు ఇద్దరూ. ఈ బోండాలు మీ దాహం తీర్చే బొండాలే ఇవి మామూలు బొండాలు కాదు గోవా బోండాలు అని బలవంతంగా వాళ్ళ చేత తాగిస్తాడు వసంత్. అప్పుడు అవి ఏ బొండాలో వాళ్లకి అర్థమవుతాయి.
మా బాధని అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అంటూ కొబ్బరి బొండాలు తాగేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతారు. తాగి ఒక పక్కన కూర్చుండి పిచ్చిపిచ్చిగా మాట్లాడి అమ్మకి అత్తయ్యకి దొరికిపోకండి మీతో పాటు నన్ను కూడా వాయించేస్తారు అంటాడు వసంత్. పెళ్ళాలని కంట్రోల్లో పెట్టుకోవడం మాకు బాగా తెలుసు అంటూ పిచ్చిగా మాట్లాడుతారు ఇద్దరూ.
మరోవైపు ఒంటరిగా ఉన్న మాళవిక దగ్గరికి వచ్చి అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు పదా అంటుంది వేద. నేను రాను అంటుంది మాళవిక. ఎందుకు రావు.. నిన్ను ఎవరేమన్నారు అంటుంది వేద. నన్ను ఎవరు ఏమీ అనడం లేదు అదే నా బాధ నాకరికి నా కొడుకుని పుట్టిన కూతురు కూడా నాకు విలువ ఇవ్వడం లేదు కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పనివ్వలేదు అంటుంది మాళవిక.
తను చిన్నపిల్ల తను నిన్ను దూరం పెడితే నువ్వే ప్రేమగా దగ్గర చేసుకోవాలి తనకి దగ్గర అవటానికి ఏమాత్రం ప్రయత్నించావ్ ఏంటి.. మెల్లగా ప్రయత్నించు తను నీకు దగ్గరవుతుంది అని ధైర్యం చెప్పి తనతో పాటు మాళవికను కూడా తీసుకువెళ్తుంది వేద. వెళ్తున్న మాళవిక ఈరోజు నువ్వు నాకు పోదార్చి తీసుకు వెళ్తున్నావు కానీ ఏదో ఒక రోజు ఇంట్లో వాళ్ళందరూ నిన్ను చూసి జాలిపడేలాగా చేస్తాను అని మనసులో అనుకుంటుంది. మరోవైపు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న శర్మ, రత్నంల దగ్గరికి వస్తూ ఉంటారు మాలిని, సులోచన.
అది చూసిన వసంత్ వీళ్ళకి గాని దొరికిపోతే ముందు నన్ను కుమ్మేస్తారు అనుకుంటూ కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న భర్తలు ఇద్దరిని చూసి ఆశ్చర్యపోతారు మాలిని, సులోచన. ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు అని అడుగుతుంది మాలిని. గోవా బోండాలు తాగుతున్నాము అందుకే అంటూ సమాధానం ఇస్తారు వియ్యాంకులిద్దరు. మేము అడుగుతున్నది ఏంటి.. మీరు చెప్పినది ఏంటి అంటూ చిరాకుపడుతూ అక్కడినుంచి వెళ్ళిపోతారు మాలిని, సులోచన.
మరోవైపు కేక్ కటింగ్ కోసం ఖుషిని స్టేజి మీదకి తీసుకొస్తుంది వేద. అంతలోనే మాళవిక రావటంతో తీసుకువచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుంటుంది వేద. ఈరోజు నేను మీ అందరితో మాట్లాడాలి అంటూ స్పీచ్ స్టార్ట్ చేస్తుంది ఖుషి. ఒక అమ్మ నన్ను చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతే కన్నతల్లి కన్నా ఎక్కువగా పెంచింది వేద అమ్మ అంటుంది ఖుషి. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.