రెండేళ్ల తర్వాత ఓటీటీలో మాలాశ్రీ సినిమా!
యాక్షన్ సినిమాలతో దుమ్ములేపే లేడీ స్టార్ మాలాశ్రీ నటించిన మూవీ రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అనేక అవాంతరాల అనంతరం `మారకాస్త్ర` మూవీ ఓటీటీలో విడుదలయ్యింది.

చాలా రోజుల తర్వాత మాలాశ్రీ నటించిన ‘మారకాస్త్ర’ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లేయర్ అనే ఓటీటీలో ప్రసారం అవుతోంది. ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలై ప్రశంసలు అందుకుంది.
సినిమా బృందాలు తమ సినిమాను ప్రేక్షకులకు చేరవేయడానికి విభిన్న మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. అందులో భాగంగా ‘మారకాస్త్ర’ చిత్ర బృందం ఓటీటీ ప్లేయర్ వెబ్‌సైట్ www.ottplayer.in లో విడుదల చేసింది. దీన్ని రూ..99 చెల్లించి సినిమా చూడవచ్చు.
గురుమూర్తి సునామి దర్శకత్వంలో, కోమల నటరాజ్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో హర్షిక పూణచ్చ నటించారు. ఆనంద్ ఆర్య, మాధురి, అయ్యప్ప శర్మ, ఉగ్రం మంజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
కోమల నటరాజ్ శ్రావ్య కాంబైన్స్ పతాకంపై ‘మారకాస్త్ర’ సినిమాను నిర్మించారు. గురుమూర్తి సునామి కథ రాసి దర్శకత్వం వహించారు.
హీరోగా ఆనంద్ ఆర్య నటించారు. ఆయనకు జంటగా మాధురి నటించారు. మరో ముఖ్య పాత్రలో మాలాశ్రీ నటించారు. హర్షిక పూర్ణచ, అయ్యప్ప శర్మ, మైకో నాగరాజ్, భరత్ సింగ్, ఉగ్రం మంజు తదితరులు నటించారు.
దుష్ట శక్తులను అణచివేసే శక్తి పాత్రికేయుల కలంకు ఉంటుంది. ఈ విషయాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. మిరాకిల్ మంజు సంగీతం అందించారు. ఆర్.కె. శివకుమార్ ఛాయాగ్రహణం అందించారు.
read more:విజయకాంత్ సినిమాలో నటించే ఛాన్స్ కోల్పోయిన సీనియర్ హీరోయిన్, తెరవెనుక ఏం జరిగిందంటే?