MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Malaika Arora: తెలివి తక్కువ, సౌండ్ చాలా ఎక్కువ.. ట్రోలర్స్‌కి ఇచ్చిపడేసిన మలైకా..

Malaika Arora: తెలివి తక్కువ, సౌండ్ చాలా ఎక్కువ.. ట్రోలర్స్‌కి ఇచ్చిపడేసిన మలైకా..

ఇంటర్నెట్ చాలా గట్టిగా అరుస్తుంది, కానీ అందులో ఎప్పుడూ తెలివి ఉండదు. శబ్దానికి, జ్ఞానానికి చాలా తేడా ఉంది. ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై మలైకా అరోరా గట్టిగా ఇచ్చిపడేసింది. ఆమె  ఇంకా ఏమన్నారో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 29 2026, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ట్రోలర్స్‌కి మలైక స్ట్రాంగ్ వార్నింగ్..
Image Credit : Inastagram

ట్రోలర్స్‌కి మలైక స్ట్రాంగ్ వార్నింగ్..

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ట్రోలర్స్‌కి తనదైన శైలిలో గట్టిగా బదులిచ్చారు. 'ఇంటర్నెట్‌కి అరిచే శక్తి ఉంది కానీ, ఆలోచించే తెలివి లేదు' అంటూ చురకలంటించారు. బాలీవుడ్ ఫిట్‌నెస్ ఫ్రీక్, స్టైల్ ఐకాన్‌గా పేరున్న మలైకా తన వ్యక్తిగత జీవితం వల్ల ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటారు. ఈ క్రమంలో ఆమె కొన్ని సార్లు.. ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ట్రోలింగ్ పై కామెంట్స్..
Image Credit : Inastagram

ట్రోలింగ్ పై కామెంట్స్..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మలైకా ట్రోలింగ్ గురించి మాట్లాడారు. విమర్శలను ఎలా ఎదుర్కొంటారో ఆమె వివరించారు. 'ఇంటర్నెట్ చాలా గట్టిగా అరుస్తుందని నాకు తెలుసు, కానీ అందులో ఎప్పుడూ తెలివి ఉండదనే విషయాన్ని నేను గుర్తుంచుకుంటాను' అని ఆమె స్పష్టం చేశారు.
37
శబ్దానికి, తెలివికి చాలా తేడా
Image Credit : Inastagram

శబ్దానికి, తెలివికి చాలా తేడా

'శబ్దానికి, తెలివికి చాలా తేడా ఉంది. సంవత్సరాలు గడిచేకొద్దీ నేను ఒక విషయం గ్రహించాను. మన మనశ్శాంతిని పబ్లిక్ ఒపీనియన్‌కు వదిలేస్తే, మనం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేం' అని మలైకా ఖరాఖండిగా చెప్పారు.
47
నెగటివ్ కామెంట్స్ ను ఏం చేస్తుదంటే?
Image Credit : Inastagram

నెగటివ్ కామెంట్స్ ను ఏం చేస్తుదంటే?

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి నెగటివ్ కామెంట్‌ను మలైకా ఇప్పుడు పట్టించుకోవడం లేదు. దీనికోసం ఆమె తనకంటూ కొన్ని హద్దులు పెట్టుకున్నారు. 'నా గురించి చెప్పే ప్రతి విషయాన్ని నేను చదవను, వినను. నా పని, నాకిష్టమైన వాళ్లు, నా దినచర్యపైనే ఎక్కువ దృష్టి పెడతాను. ఇవే నన్ను మానసికంగా బలంగా ఉంచుతాయి' అని తన సీక్రెట్ చెప్పారు.
57
నా సంతోషం నాలోనే ఉంది
Image Credit : Inastagram

నా సంతోషం నాలోనే ఉంది

ట్రోలర్స్ మొదట్లో తనను బాధించేవారని మలైకా ఒప్పుకున్నారు. కానీ వయసు పెరిగేకొద్దీ జీవితంపై తన దృక్పథం మారిందన్నారు. 'వయసు పెరిగే కొద్దీ మనకు ప్రపంచాన్ని చూసే దృష్టి వస్తుంది. ప్రతి చిన్న శబ్దానికి స్పందించడం మానేస్తాం. ఎవరైనా విమర్శిస్తున్నారంటే, అది వారి వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది కానీ మనది కాదు. నా సంతోషం నాలోనే ఉంది, దాన్ని బహిరంగ చర్చకు పెట్టాల్సిన అవసరం లేదు' అని మలైకా వాదించారు.
67
అర్జున్ కపూర్‌తో మలైకా  బంధం..
Image Credit : Inastagram

అర్జున్ కపూర్‌తో మలైకా బంధం..

అర్జున్ కపూర్‌తో మలైకా అరోరా సుదీర్ఘ బంధానికి ఇటీవల ముగింపు పడింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా గాసిప్స్ వచ్చాయి. ఇలాంటి సమయంలో మలైకా చేసిన ఈ వ్యాఖ్యలు, తన వ్యక్తిగత జీవితంపై వచ్చే వదంతుల నుండి దూరంగా ఉండాలనుకుంటున్నారని స్పష్టం చేస్తున్నాయి.

77
మలైకా డ్యాన్స్ స్టెప్స్‌కు అభిమానులు ఫిదా
Image Credit : Instagram

మలైకా డ్యాన్స్ స్టెప్స్‌కు అభిమానులు ఫిదా

ఇక మలైకా అరోరా కెరీర్ విషయానికొస్తే, ఆమె ఇటీవల ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న నటించిన 'తమ్మ' (Thamma) చిత్రంలోని 'పాయిజన్ బేబీ' (Poison Baby) అనే ప్రత్యేక పాటలో కనిపించారు. ఈ పాటలో ఆమె డ్యాన్స్ స్టెప్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. మొత్తానికి, ట్రోలర్స్‌ను పట్టించుకోకుండా మలైకా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Peddi piracy: పెద్ది రిలీజ్ కు ముందే ఐబొమ్మా కు షాక్, పైరసీపై మద్రాస్ హైకోర్డ్ సంచలన తీర్పు..
Recommended image2
IMDb Top Indian Stars: సీఎం విజయ్, ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన కుర్రాడు, IMDb రేటింగ్ లో నెం.1 ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved