- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుధార మెడలో పూలమాల వేసిన రిషి.. జగతి, రిషిని ఒకే టీంలో పెట్టేందుకు మహేంద్ర ప్రయత్నాలు!
Guppedantha Manasu: వసుధార మెడలో పూలమాల వేసిన రిషి.. జగతి, రిషిని ఒకే టీంలో పెట్టేందుకు మహేంద్ర ప్రయత్నాలు!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రిషి,మహేంద్ర కిందికి వస్తారు. మేము ఏమైనా సహాయం చేయాలా అని మహేంద్ర జగతిని అడగగా జగతి వద్దు అని అంటుంది.అప్పుడు మహేంద్ర,మేము ఈ పని చేయలేము అని మీరు అనుకుంటున్నారా మగవాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని చెప్పి రిషి ని కూడా కూర్చోబెట్టి మాల కట్టిస్తాడు.అప్పుడు మహీంద్రా, రండి అయితే కాంపిటీషన్ పెట్టుకుందాము అమ్మాయిలు ముగ్గురు ఒక జట్టు. అబ్బాయిల ముగ్గురు ఒక జట్టు ఎవరు ముందు పువ్వుల మాల కడితే వాళ్ళే గెలిచినట్టు అని అంటాడు.అప్పుడు అందరూ పూలు అల్లడం మొదలుపెడతారు.
అప్పుడు రిషి,వసుదారలు ఒకరు చూసుకుంటూ మాలకడుతూ ఉంటారు. అప్పుడు మహీంద్రా వాళ్ళని గమనించి ఈ సమయంలో వారిని ఏకాంతంగా ఉంచడం మంచిది అని ఫోన్ వస్తుంది అని చెప్పి మెట్లు మీదకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి జగతిని కూడా రమ్మని పిలుస్తాడు. అలాగే ధరణి గౌతమ్ ను కూడా వాళ్ళు పైకి తీసుకువెళ్లి పోతారు. మెట్ల మీద నుంచి అందరూ రిషి,వసు లను చూస్తూ ఉంటారు. అప్పుడు రిషి కి మాల కట్టడం సరిగ్గా రాకపోతే వసు సహాయం చేస్తుంది.అలాగా అనుకోకుండా రిషి పూలమాలను వసు మెడ లో వేస్తాడు. పైనుంచి చూస్తున్న ఇంట్లో వాళ్ళందరూ మురిసిపోతూ ఉంటారు.
అదే సమయంలో దేవయాని అక్కడికి వస్తుంది. వెంటనే వసు ఆ పూలమాలను కిందకు తీస్తుంది. మీరిద్దరే ఉన్నారు ఎందుకు అని దేవయాని అడగగా, వాళ్ళందరూ ఇప్పటివరకు ఉన్నారు ఏదో పనిమీద వెళ్లారు అని అంటుంది వసు. అప్పుడు దేవయాని, నువ్వు వెళ్లి పడుకో రిషి,వసుధార వాళ్ళు చూసుకుంటారు అని అనగా రిషి,మేము చేస్తాము పెద్దమ్మ మీరు వెళ్లి పడుకోండి నేను చూసుకుంటాను అని బలవంతంగా పంపించేస్తాడు.
ఇంతలో పైన వాళ్ళందరూ కిందకి వచ్చేస్తారు.అప్పుడు మహేంద్ర ఇంకేమైనా పనులు ఉన్నాయా అని అనగా గౌతమ్, కేక్ బుక్ చేయడం ఒకటే ఉన్నది. అది రిషి చేస్తాడు అని అంటాడు. రిషి ఆలోచిస్తాడు.అప్పుడు జగతి మనసులో, గౌతం మహేంద్రలు రిషి ని బలవంతం పెట్టి పని చేయిస్తున్నారు. రిషికి కేక్ బుక్ చేయడం ఇష్టం లేదేమో అని అనుకుంటుంది.అప్పుడు రిషి కేక్ ఆన్లైన్లో బుక్ చేస్తాడు.వసు చాలా ఆనంద పడుతుంది. ఆ తర్వాత ధరణి కారమ్స్ ఆడదామని అంటుంది.
రిషి ఇప్పుడు వద్దు అని వెళ్ళిపోతాడు. అప్పుడు ధరణి,నేను ఏమైనా తప్పుగా అడిగానా చిన్న అత్తయ్య అని అంటుంది. అప్పుడు జగతి, ఏం లేదులే ధరణి రా మనము ఆడుకుందాము అని వాళ్ళు ఆట మొదలుపెడతారు. గౌతమ్, మహేంద్ర, జగతి, వసూ లు ఆట మొదలుపడతారు. అంతలో వసు రిషికి క్యారమ్స్ ఆడటం రండి సార్ అని మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ కి రిషి కిందకి వస్తాడు.గౌతంని లేపి గౌతమ్ స్థానంలో రిషి ఆడుతాడు. అప్పుడు వసు థాంక్యూ సార్ అని మెసేజ్ పెడుతుంది. జగతి మహేంద్రలు నవ్వుకుంటారు.
అప్పుడు జగతి, మహేంద్ర,వసు రిషులు క్యారమ్స్ ఆడడం మొదలుపెట్టారు. ఎవరెవరు ఒక టీమ్ అనడానికి టాస్ వేస్తారు. అప్పుడు మహీంద్రా, రిషి ని జగతిని ఒక టీంలో పెట్టడానికి చీటింగ్ చేసి రెండు చేతుల్లోనే నల్ల కాయిం నీ ఉంచుకొని రిషిని జగతిని ఒక టీంలో పెడతాడు. అప్పుడు రిషి, రండి మేడం మనం గెలవాలి అని అంటాడు.మహేంద్ర,వసు తో పాటు గౌతమ్,ధరణి లు ఎంతో ఆనందపడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!