- Home
- Entertainment
- Guppadantha Manasu: దేవయానికి షాకింగ్ విషయాన్ని చెప్పిన మహేంద్ర.. రిషిని మార్చేస్తా అంటూ?
Guppadantha Manasu: దేవయానికి షాకింగ్ విషయాన్ని చెప్పిన మహేంద్ర.. రిషిని మార్చేస్తా అంటూ?
Guppadantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు (guppadantha Manasu). రోజుకో ట్విస్ట్ తో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..

సీరియల్ ప్రారంభంలోనే వసుధారా, రిషిలను చూపిస్తారు. వసుధర క్లాస్ లో మీరే నా ప్రాబ్లమ్స్ సార్ అన్న విషయాన్ని గుర్తు చేసుకొని రిషి అడుగుతాడు. దానికి వసుధారా రాత్రి మొత్తం నిద్ర పట్టలేదు సార్ మీరే గుర్తు వచ్చారు మీకు కాల్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను అని చెప్తుంది.
రిషి కూడా నేను కూడా నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. కానీ నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చేయలేదు అంటాడు. గౌతమ్ రిషి కి కాల్ చేస్తాడు కానీ రిషి వెస్ట్ కాల్ అని కాల్ కట్ చేస్తాడు. దీంతో గౌతమ్ మళ్లీ వసుధారాకు కాల్ చేస్తాడు. రిషి కాల్ ఆన్సర్ చేయొద్దు అని చెప్పే లోపు వసుధార కాల్ ఆన్సర్ చేస్తుంది.
గౌతమ్ రిషి ఎందుకు నా కాల్ కట్ చేశాడు అని అడుగుతుండగా వసుధారా తొందర్లో వేస్ట్ కాల్ అని కట్ చేసిన విషయాన్ని చెప్పేస్తుంది. దీంతో గౌతమ్ రిషి మీద కోపడతాడు రిషి గౌతమ్ కు సర్దిచెప్పి కాల్ కట్ చేస్తాడు. వసుధార మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్ అని అడిగితే నీకు ఒక విషయం చెప్పాలి అందుకే తీసుకు వచ్చాను కానీ ఇప్పుడు ఆ విషయాన్ని పోయాను అంటాడు.
ఇక గౌతమ్ దేవయాని ని పొగుడుతూ బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. దేవయాని ముందే జగతిని షార్ట్ ఫిలిం గురించిన ఆలోచన చాలా బాగుంది అంటూ పొగుడుతూ ఉంటాడు. దేవయాని మాత్రం మండిపోతూ ఉంటుంది. దీనికి మహేంద్ర కూడా తోడై జగతిని ఇంకా పొగిడేలా గౌతమ్ ను రెచ్చగొడుతూ ఉంటాడు. ఇక మహేంద్ర మినిస్టర్ గారిని పిలవడానికి జగతి లేదా జగతి, రిషి ఇద్దరూ కలిసి వెళ్లొచ్చు అని దేవయాని ముందే చేప్పి దేవయాని కి షాక్ ఇస్తాడు.
ఇక రిషి వచ్చి కాలేజ్ విషయాలు పెద్దమ్మ ముందు మాట్లాడొద్దు అంటూ గౌతమ్ ను తీసుకెళ్తాడు. దేవయాని నువ్వు మారిపోతున్నావు రిషి నిన్ను పాత రిషి లాగా తొందర్లోనే మార్చేస్తానని అనుకుంటుంది.
ధరణి, రిషి దగ్గరకు వచ్చి షార్ట్ ఫిలిం సక్సెస్ కావాలి అని ఆల్ ద బెస్ట్ చెప్తుంది.
రిషి, ధరణి ని ఏదో అడగాలని అడగలేకపోతూ ఉంటాడు. దాంతో ధరణి మనసులోని భారాన్ని ఎవరో ఒకరితో పంచుకోవాలని అప్పుడే మనసు తేలిక పడుతుందని చెప్పి వెళ్లిపోతుంది. రిషి అసలు నేనేమి అడగాలి అనుకున్నాను, నాకు ఏమైంది, నేను పొగరు గురించే అడగాలి అనుకుంటున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు.
గౌతమ్ ఒక రోజా పువ్వు ను వసుధరకు ఇస్తాడు. అదే పువ్వు ను వసుధార రిషికి ఆల్ ద బెస్ట్ చెబుతూ ఇస్తుంది. రిషి మినిస్టర్ గారు వస్తున్నారని మహేంద్ర భూషణ్ కు దూరంగా ఉండటం మంచిదని జగతి కి చెప్తాడు రిషి మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాల్సిందే.