MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుధార నా కోడలు.. రిషీ నిన్ను అమ్మ అని పిలవాలి జగతి.. మహేంద్ర కోరికలు!

Guppedantha Manasu: వసుధార నా కోడలు.. రిషీ నిన్ను అమ్మ అని పిలవాలి జగతి.. మహేంద్ర కోరికలు!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం... 

3 Min read
Author : Navya G
Published : Sep 15 2022, 08:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... వసు రిషికి ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది. అప్పుడు రిషి ఇది బాలేదు ఇంకొకటి ఎంచు అని అంటాడు. అప్పుడు వసు ఇంకొకటి సెలెక్ట్ చేసి రిషికి ఇస్తాది,అది బాగోదు. కానీ రిషి, వసుధార నాకోసం ఎంత ప్రేమగా ఇచ్చింది వద్దంటే ఫీల్ అవుతుంది అని,బాగుంది నేను వేసుకుంటాను అని అంటాడు. ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి ఆ డ్రెస్ అసహ్యంగా ఉంది, ఏమాత్రం బాలేదు, ఇంటికి చాలామంది వస్తారు కదా మంచి బట్టలు వేసుకుని అనగా రిషి గౌతమ్ ని పెదనాన్న పిలుస్తున్నారు అని బయటికి పంపిస్తాడు.
 

26

అప్పుడు వసు నిజంగానే డ్రెస్ బాలేదా అని అనగా, లేదు చాలా బాగుంది నేను వేసుకుంటాను, నాకు నచ్చింది అని అంటాడు రిషి.ఆ తర్వాత సీన్లో గౌతమ్,ఫణీంద్ర కూర్చుని ఉండగా రిషి కిందకి వస్తాడు. అప్పుడు ఫణీంద్ర ఈ డ్రెస్ బాలేదు రిషి ఇది నీ సెలక్షన్ కాదు,ఎందుకు ఈ రోజు ఇలాంటి బట్టలు వేసుకున్నావు అని అడగగా వసు చూసి నిజంగానే ఆ డ్రెస్ సార్ మీదకి బాలేదా నాకోసమే వేసుకున్నారా అని అనుకుంటుంది. ఇంతలో ఫణీంద్ర టీ పెట్టమని అడగగా వసుధర వెళ్లి టీ పెడుతుంది. ఆ తర్వాత సీన్లో జగతి మహీంద్రాలు తయారయ్యి ఒకరినొకరు చూసుకుంటూ పెళ్లిరోజులు శుభాకాంక్షలు చెప్తారు.
 

36

అప్పుడు మహీంద్రా, నాకు ఇది ఇంకా నమ్మశక్యంగా లేదు జగతి. నువ్వు, నేను, రిషి కలిసి ఒక దగ్గర ఉండడం అంటే అది నా జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయ. నిన్ను ఇంట్లోకి రానివ్వడం, నిన్ను సార్ అని పిలవద్దు అనడం ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఇంక రిషి నిన్ను అమ్మా అని అప్పుడు పిలుస్తాడో వేచి చూస్తూ ఉన్నాను. ఒకప్పుడు వసుదార దగ్గర నేను మాట తీసుకున్నాను, నిన్ను రిషిని కలపమని వసుధార ఆఖరికి అది చేసింది.ఇంక వసు మన ఇంటికి కోడలుగా రావడం మాత్రమే మిగిలి ఉన్నది. సరే కిందకి పద అని ఇద్దరు వెళ్తారు. వసు కాఫీ తెచ్చి ఫణింద్రకి ఇస్తున్నప్పుడు రిషి సార్ ఏంటి నాకు ప్రిన్స్ లా కనిపించడం లేదు అని అనుకుంటూ వస్తుంద ఇంతలో దేవయాని అక్కడికి వస్తుంది.
 

46

అప్పుడు వసు పొరపాటున కాఫీ రిషి మీద వొంపుతుంది. దేవయాని దాన్ని చూసి అసలు నీకు బాధ్యత ఉందా? ప్రతి పనిలోని తలదూర్చుకుంటావెందుకు? ఇప్పుడు రిషి మీద కాఫీ వొంపవ పాపం రిషి డ్రెస్ పాడైపోయింది అని తిడుతుంది. అప్పుడు రిషి, పర్వాలేదు పెద్దమ్మ వెళ్లి మార్చుకుంటాను అని అంటాడు.దేవయాని వెళ్ళిపోయిన తర్వాత గౌతం పట్టించుకోవద్దులే వస్తారా అని అంటాడు. ఆ తర్వాత సీన్ లో  జగతి,మహీంద్ర లు  కిందకి దిగుతున్నప్పుడు రిషి వాళ్ళని చూసి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తాడు. డ్రెస్ ఏమైందిరా తుడుస్తాను అని మహేంద్ర అనగా, వద్దు డాడీ మార్చుకుంటాను అని వెళ్తాడు రిషి నేను వస్తాను అని మహీంద్రా రిషి తో వెళ్తాడు.
 

56

జగతి కిందకి వస్తున్నప్పుడు వసు చేతిలో కాఫీ కప్ చూసి, రిషి షట్ మీద పడింది నీ కాఫీ ఎనా అని అడగగా, అవును మేడం కావాలని వొంపాను,అని అంటుంది.అప్పుడు జగతి,ఈ మధ్య నీకు ధైర్యం బాగా పెరిగిపోయింది వసు అని అనగా,నేను సార్ కి షర్టు సెలెక్ట్ చేశాను మేడం అది బాలేదు, కానీ సర్ నాకోసం వేసుకుంటున్నారు. అందుకే నా తప్పు నేనే తీర్చిదిద్దాలి అని కాఫీ వొంపాను అని అనగా, నా కొడుకు మీద కాఫీ వొంపుతావా అని వసుధారని జగతి ఆటపటిస్తుంది. అప్పుడు వసుధార జగతిని చూసి, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు మేడం అని పొగుడుతుంది.ఆ తర్వాత సీన్లో రిషి తయారవుతాడు. మహేంద్ర రిషి ని గట్టిగా హద్దుకొని నిన్ను ఇలాగే నా కళ్ళ ముందు ఉంచుకోవాలని ఉన్నది రిషి.
 

66

నాకు ఇంత ప్రేమని ఇచ్చినందుకు ధన్యవాదాలు, నాకోసం ఇంత చేసినందుకు ధన్యవాదాలు అని అంటాడు. అలా ఏం లేదు డాడీ మీరు నాకు ఇచ్చిన ప్రేమనే నేను మీకు ఇస్తున్నాను అని అంటాడు రిషి. ఆ తర్వాత సీన్లో వసు చీర కట్టుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ చీరలో నాకు ఇబ్బందిగా ఉంటుంది. రిషి సర్ చీరలు కట్టుకోవద్దని కూడా చెప్పారు. ఇప్పుడు ఆయనే నాకు చీర ఇచ్చారు అని చీర కట్టుకుంటూ ఉండగా రిషి అక్కడికి వచ్చి వసుని చూస్తూ ఉండిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Recommended image2
Balakrishna: చిరంజీవి నటించిన ఆ సినిమా అంటే బాలకృష్ణకు ప్రాణం.. ఇంతకీ ఆ మూవీ ఏదంటే.?
Recommended image3
Prabhas: ప్రభాస్ ఆ డిజాస్టర్ సినిమా వదులుకుని కెరీర్‌ కాపాడుకున్నాడు.. ఎన్టీఆర్ అడ్డంగా దొరికిపోయాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved