- Home
- Entertainment
- Guppedantha Manasu: దేవయానిని ఆడుకుంటున్న మహేంద్రవర్మ.. రిషి ని రెచ్చగొడుతున్న గౌతమ్!
Guppedantha Manasu: దేవయానిని ఆడుకుంటున్న మహేంద్రవర్మ.. రిషి ని రెచ్చగొడుతున్న గౌతమ్!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రిషి విషయంలో గౌతమ్ (Goutham) ఒక ప్రయత్నం అని చెప్పగా జగతి.. ఈ విషయం గురించి ఇంకెప్పుడు ప్రస్తావించవద్దు అని చెబుతోంది.

Guppedantha Manasu
ఈలోపు జగతి (Jagathi) ఇంటికి రిషి రావడంతో గౌతమ్ బయటికు వస్తాడు. ఇక రిషి నీకు ఇక్కడ ఏం పని రా అని గౌతమ్ ను అడగగా ఏదో ఒక సాకు చెప్పి కవర్ చేస్తాడు. ఆ తర్వాత మహేంద్ర మా ఆవిడ జగతి దగ్గరికి వెళ్తున్నాను అని దేవయాని (Devayani) కి స్టైల్గా చెప్పుకుంటూ బయలుదేరుతాడు.
Guppedantha Manasu
ఇక ఈ విషయాన్ని డైరెక్ట్ గా దేవయాని (Devayani) కి చెప్పినందుకు దేవయాని మనసులో ఎంతో కుళ్ళుకుంటుంది. మొత్తానికి దేవయానితో ఆడుకుంటున్నాడు మహేంద్ర. మరోవైపు వసు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఈ లోపు అక్కడికి రిషి వచ్చి లిఫ్ట్ ఇస్తాను అని అంటాడు. కానీ.. వసు (Vasu) మీ లిఫ్ట్ నాకు అవసరం లేదు అని అక్కడినుంచి నడుచుకుంటూ వెళుతుంది.
Guppedantha Manasu
కారు ఎక్కమని రిషి (Rishi) వసు ను ఎంత బతిమిలాడినా వసు వినిపించుకోకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మహేంద్ర.. జగతి దగ్గరకి వెళ్లి స్టైల్ గా దేవాయనితో అన్న విషయాన్ని జగతి (Jagathi) తో ఫన్నీగా చెప్పుకుంటాడు.
Guppedantha Manasu
మరోవైపు రిషి (Rishi).. వసు వెళుతున్న ఆటోకి కారు అడ్డంగా పెట్టి ఆపుతాడు. ముందు జాగ్రత్త కోసం ఆటోడ్రైవర్ నెంబర్ తీసుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెబుతాడు. ఇక వసు (Vasu) మనసులో ఇలాంటి వాటికి ఎం తక్కువ లేదు అని అనుకుంటుంది.
Guppedantha Manasu
మరోవైపు గౌతమ్ (Goutham) దేవుడు నాకు అందమైన రూపం ఇచ్చాడు. చాలా తెలివితేటలు ఇచ్చాడు. అంతే కాకుండా ఒక ఎంజల్ ను ఇచ్చాడు అంటూ రిషితో అంటాడు. రిషి (Rishi) ఆ మాటలను ఏమాత్రం జీర్ణించుకోలేకపోతాడు.
Guppedantha Manasu
ఆ తర్వాత మహేంద్ర (Mahendra) భోజనం చేస్తుండగా పోరాపోతుంది. దాంతో వసు ఎవరో తల్చుకుంటూ ఉన్నట్టున్నారు అని అనగా ఇంకెవరు మా పుత్రరత్నం అయి ఉంటాడు అని మహేంద్ర అంటాడు. ఈలోగా అక్కడకు రిషి (Rishi) వస్తాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.