- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుధారకు బాధ్యతలు అప్పగించిన జగతి.. రిషీకి దూరంగా వెళ్ళిపోతున్న మహేంద్ర, జగతి!
Guppedantha Manasu: వసుధారకు బాధ్యతలు అప్పగించిన జగతి.. రిషీకి దూరంగా వెళ్ళిపోతున్న మహేంద్ర, జగతి!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 7వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే వసుధార రిషి మధ్య రొమాంటిక్ సీన్.. ఒకరిని ఒకరు కన్ను ఆర్పకుండా చేసుకుంటుంటారు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సమయం అంటూ వస్తున్న సమయంలో వాళ్ళ వదిన వచ్చి నీ ఫోన్ అని చెప్పి వెళ్తుంది. తడి జుట్టుతో ఎక్కువసేపు ఉంటే ఆరోగ్యానికి మంచి కాదని చెప్పి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చిన రిషీ సిగ్గుపడుతుంటాడు.
అప్పుడు గౌతమ్ వ్యాయామం చెద్దాంరా అని పిలుస్తాడు. ఆతర్వాత సీన్ లో మినిస్టర్ ని కలవడానికి వెళ్ళాలి.. రెడీ అవ్వాలి అని వెళ్ళిపోతాడు. మరోవైపు పొగరు వసుధార రెడీ అవుతూ రొమాంటిక్ సీన్ గురించి తలుచుకుంటూ మురిసిపోతుంది. అద్దంలో చూసుకుంటూ రిషి సార్ పక్కనే ఉంటె ప్రపంచాన్ని జయించినట్టు ఉంటుందని మాట్లాడుకుంటుంది.
నీ పట్టుదల వల్లే జగతి మహేంద్ర సర్ దూరం వెళ్లిపోయారని అనుకుంటుంది. అమ్మ అని పిలుపు ఏమోకానీ రిషీ సార్ కు నాన్న అనే పిలుపు కూడా దూరం అయ్యాడని అనుకుంటారు. ఇక తర్వాత సీన్ లో ఇద్దరు కలిసి మినిస్టర్ ఆఫీస్ కు వెళ్తారు. అయితే అక్కడే జగతి, మహేంద్ర మినిస్టర్ దగ్గర ఉంటారు. చాలా ప్రదేశాల్లో మిషన్ ఎడ్యుకేషన్ కావాలని ఉత్తరాలు వచ్చాయ్..
అందుకే మేము ఇద్దరం పర్సనల్ వెళ్లి చూసుకోవాలి అనుకుంటున్నాం.. నా పనులన్నీ వసుధారకు ఇస్తున్నట్టు లెటర్ అని మినిస్టర్ కి ఇస్తారు. ఆతర్వాత వారిద్దరూ ఎయిర్ పోర్ట్ కు వెళ్లాలని, ఫ్లైట్ కు టైం అవుతుందని చెప్పి బయల్దేరుతారు. మరోవైపు రిషి వసు కూడా అప్పుడే వస్తారు. వారిద్దరిని చుసిన జగతి మహేంద్రలు వారికీ కనిపించకుండా దాక్కుంటున్నారు. అక్కడ నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు..
రిషికి మాత్రం మహేంద్ర అక్కడ ఉన్నట్టు అనిపించి వెనక్కివెళ్తాడు.. కానీ మధ్యలోనే ఆగిపోయి డాడ్ ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుందని బయటకు వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ ఎవరు కనిపించరు దీంతో మా డాడ్ వాళ్ళు వచ్చే ఉంటారు.. మినిస్టర్ గారి క్యాబిన్ లో ఉన్నారేమో అని అక్కడికి వెళ్లి అడుగుతే ఇప్పుడే వెళ్లిపోయారు అని అంటాడు. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఉండరు.. రిషిని చూసి మహేంద్ర, జగతి బాధపడతారు.
ఇక క్యాబిన్ లో మినిస్టర్ ఎందుకు ఆలా వెళ్లవు రిషి అని అంటే చిన్న పని ఉండి వెళ్ళాను అని అంటాడు. ఇక కొత్త ప్రాజెక్టు డాక్యుమెంట్ పై సైన్స్ తీసుకో అని చెప్పిన తర్వాత మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు బాధ్యతలు వసుధారకు అప్పగించినట్టు చెప్తారు. ఆతర్వాత వాళ్ళు ఎయిర్ పోర్ట్ కు వెళ్లినట్టు తెలుసుకొని అక్కడకు ఇద్దరు వెళ్తారు. అంతే ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.