- Home
- Entertainment
- లాంగ్ బ్రేక్ తీసుకున్న మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ఇక వర్క్ మోడ్ లోకి స్టార్ హీరోలు
లాంగ్ బ్రేక్ తీసుకున్న మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ఇక వర్క్ మోడ్ లోకి స్టార్ హీరోలు
నవంబర్ నుంచి నాన్ స్టాప్ గా వర్క్ చేయడానికి రెడీ అవుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు. ఇన్నాళ్లూ బ్రేక్ తీసుకుని రిలాక్స్ అయ్యిన హీరోలు ఇక తగ్గేదే లే అంటున్నారు. సెట్స్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు.

బాబులు బిజీ కాబోతున్నారు... స్టార్ హీరోల టైమ్ పాస్ కి , ఇన్నాళ్ల ఎంజాయ్ మెంట్ కి ఇప్పుడు బ్రేక్ పడబోతోంది. నవంబర్ నుంచి తారక్, మహేష్ , ఎన్టీఆర్ .. ఫుల్ బిజీ కాబోతున్నారు.ఆమధ్య త్రివిక్రమ్ సినిమాకి బ్రేక్ ఇచ్చిన మహేష్ బాబు, పుష్ప 2 మొదలుపెట్టడానికి సరైన ముహూర్తం చూసుకుంటున్న అల్లు అర్జున్, ఫారెన్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఇక రెడీ అంటున్న ఎన్టీఆర్ ఈ ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలు సెట్స్ మీదకు వెళ్లడానికి ఉవ్విళ్లూరుతున్నారు. వర్క్ మోడ్ లోకి రాబోతున్నారు. మరి వీళ్ల సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఏంటీ అనే విషయం తెలుసుకుందాం.
ఆల్రెడీ త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేసిన మహేష్ బాబు ... ఇప్పటికే రెండు బ్రేకులు తీసుకున్నారు. లేటెస్ట్ గా ఫారెన్ లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్న మహేష్ .. హైదరాబాద్ తిరిగొచ్చేశారు. సో.. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచే షూట్ ని కంటిన్యూ చెయ్యాలని ఆల్రెడీ త్రివిక్రమ్ అండ్ కో తో చెప్పిన మహేష్ .. షూట్ కి రెడీ అయ్యే పనిలో ఉన్నారు.
Jr NTR
కొరటాల తో సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి గుడ్ న్యూస్. డైరెక్టర్ కొరటాలతో పాటు ప్రొడక్షన్ డిజైన్ సాబుశిరిల్, డీఓపీ రత్నవేలు కలసి యూనిట్ తో ప్రీ ప్రొడక్షన్ ని స్పీడప్ చేశారు. త్వరలోనే ..మ్యాగ్జిమమ్ నవంబర్ లోనే ఎన్టీఆర్ –కొరటాల సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ .. అక్కడ షార్ట్ ట్రిప్ వేసి ఇండియా వచ్చేశారు. అంతేకాదు .. సినిమా కోసం ఇప్పటికే వెయిట్ లాస్ అయ్యి కంప్లీట్ టోన్డ్ బాడీతో రెడీగా ఉన్నాడు తారక్. నవంబర్ నుంచి నాన్ స్టాప్ షూట్ తో బిజీ అవ్వబోతున్నారు.
ఎప్పుడో 10 నెలల క్రితంరిలీజ్ అయిన పుష్ప కి సీక్వెల్ ఇంకా స్టార్టవ్వలేదు . ఇప్పటికే అదిగో ఇదిగో అంటున్న షూటింగ్ మాత్రం ఇంకా సెట్స్ మీదకెళ్ళలేదు. అయితే షూటింగ్ స్టార్ట్ అవుతోందన్న హింట్ మాత్రం ఇస్తూనే ఉంది టీమ్. నవంబర్ 7 నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ చేసేలా ప్లాన్రెడీ చేశారు సుకుమార్. హైదరాబాద్ లో రీసెంట్ గా స్టార్ట్ అయిన అల్లుస్టూడియోస్ లో పుష్ప2 షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప...ఆల్రెడీ కలెక్షన్ల రికార్డులతో పాటు .. అవార్డులు కూడా సొంతం చేసుకోవడంతో పుష్ప 2 మీద విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.