MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Viral Song: యూట్యూబ్ రీల్స్ అన్నీ ఈ పాటపైనే.. ‘ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా’ పాట ఫుల్ లిరిక్స్ ఇవిగో

Viral Song: యూట్యూబ్ రీల్స్ అన్నీ ఈ పాటపైనే.. ‘ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా’ పాట ఫుల్ లిరిక్స్ ఇవిగో

Viral Song: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక పాత మెలోడీ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. ‘ఆయుధం’ సినిమాలోని ‘ఇదేమిటమ్మా మాయ మాయ’ పాట ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ పాట పూర్తి లిరిక్స్, ఇతర వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 14 2026, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇదేమిటమ్మా మాయా.. ఏంటా మాయా? ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న మెలోడీ సాంగ్
Image Credit : Youtube/TipsTelugu

ఇదేమిటమ్మా మాయా.. ఏంటా మాయా? ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న మెలోడీ సాంగ్

ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ఏ పాత పాట ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా ‘ఆయుధం’ సినిమాలోని ‘ఇదేమిటమ్మా మాయ మాయ’ అనే సాంగ్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఎక్కడ చూసినా ఈ పాట హమ్మింగ్ వినిపిస్తోంది.

వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘ఆయుధం’ సినిమాలోని ఈ మెలోడీ సాంగ్ ఇప్పుడు కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటకు యూట్యూబ్‌లో ఇప్పటివరకు 11 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. దాదాపు 48 వేల మందికి పైగా ఈ పాటను లైక్ చేశారు. కేవలం యూట్యూబ్ మాత్రమే కాదు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా వేల సంఖ్యలో వీడియోలు ఈ పాటపైనే వస్తున్నాయి. చిన్ని చరణ్ రాసిన అద్భుతమైన సాహిత్యం, లెజెండరీ సింగర్ కుమార్ సాను, రష్మీల గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. పాత పాట అయినా, కొత్త అనుభూతిని ఇస్తుండటంతో నెటిజన్లు దీనికి ఫిదా అవుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మాయ చేసే పల్లవి.. ఇదేమిటమ్మా మాయా మాయా
Image Credit : Youtube/TipsTelugu

మాయ చేసే పల్లవి.. ఇదేమిటమ్మా మాయా మాయా

ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా

ఓ.. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా

ఆ ఇంద్రలోకం నిన్నూ నన్నూ ఏకం కమ్మందా

ముత్యమా ముత్యమా వస్తవా

ముద్దులే మత్తుగా ఇస్తవా

ఓ వింత కవ్వింత నీకంత చొరవ

ప్రియతమా ప్రియతమా

ఈ హాయి తొలిప్రేమ ఫలితమా

పరువమా ప్రణయమా

నీ చెలిమిలో తీపి మధురిమా

ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా

ఆ ఇంద్రలోకం నిన్నూ నన్నూ ఏకం కమ్మందా

Related Articles

Related image1
Love song: ఈ పాటకు ఏ అమ్మాయైనా కరిగిపోవాల్సిందే.. ‘సొమ్మసిల్లి పోతున్నవే’ పాట పూర్తి లిరిక్స్ ఇవిగో
Related image2
Mattress : మ్యాట్రెస్ కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని తెలుసా? ఎప్పుడు మార్చాలి?
34
విరహ వేదనలో తీపి గిలిగింతలు
Image Credit : Youtube/TipsTelugu

విరహ వేదనలో తీపి గిలిగింతలు

శ్రీ రంగా.. నిను కోరంగా

ఈ గిలిగింతలూ.. చలిలో చెమటలూ

గారంగా.. నువ్వు చేరంగా..

మదిలో మెరుపులూ.. ఎదలో పరుగులూ

దాయి దాయి దాయి దామా

దరె దాయి దాయి దాయి దామా

పాపలయ్యి పాడుకుందమా

చేపలల్లే ఈదుకుందమా

గుండె బావి తోడుకుందమా

ఈడు దాహం తీర్చుకుందమా

నీళ్లలోనే మనముంటున్నా తీరని దాహాలేంటమ్మా

ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా

ఆ ఇంద్రలోకం నిన్నూ నన్నూ ఏకం కమ్మందా

44
వేసవిలో చలిమంటల ప్రేమ
Image Credit : Youtube/TipsTelugu

వేసవిలో చలిమంటల ప్రేమ

వేసవిలో.. నిను చూస్తుంటే

చలి వేస్తున్నదీ.. చెలి ఏంటే ఇదీ

వేకువలో.. నువ్వు లేకుంటే

వెలుగే ఎలుగుతూ.. రానంటున్నదీ

దాయి దాయి దాయి దామ్మా

దరె దాయి దాయి దాయి దామ్మా

తాజ్ మెహల్ చేరుకుందమా

లవ్ గజల్ పాడుకుందమా

తారలన్నీ తెంచుకుందమా

తోరణాలే కట్టుకుందమా

ఓ చంద్రమండల వీధుల్లోనా చెలియా మీటే అవుదామా

ప్రియతమా ప్రియతమా

ఈ హాయి తొలిప్రేమ ఫలితమా

పరువమా ప్రణయమా

నీ చెలిమిలో తీపి మధురిమా

లల్ల లల్లా లాలా లాలా లాలా లా లా

లల్ల లల్లా లాలా లాలా లల్ల లాలా లా

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: అది బ్యాడ్ మూవీ కాదు, రాంచరణ్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్.. స్టైలిష్ గా ఉంటుంది, అయినా ఫ్లాప్
Recommended image2
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Recommended image3
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Love song: ఈ పాటకు ఏ అమ్మాయైనా కరిగిపోవాల్సిందే.. ‘సొమ్మసిల్లి పోతున్నవే’ పాట పూర్తి లిరిక్స్ ఇవిగో
Recommended image2
Mattress : మ్యాట్రెస్ కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని తెలుసా? ఎప్పుడు మార్చాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved