MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • నమ్రతకు మహేష్ రొమాంటిక్ బర్త్ డే విషెస్... ఇంతకీ అద్భుతమైన వీరి ప్రేమ కథ మీకు తెలుసా!

నమ్రతకు మహేష్ రొమాంటిక్ బర్త్ డే విషెస్... ఇంతకీ అద్భుతమైన వీరి ప్రేమ కథ మీకు తెలుసా!

మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ పుట్టినరోజు నేడు. భార్యకు మహేష్ రొమాంటిక్ గా బర్త్ డే విషెష్ తెలియజేశారు. ఈ సందర్భంగా వీరి ప్రేమ కహాని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 22 2023, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

1972 జనవరి 22న జన్మించిన నమ్రత 51వ జన్మదినం నేడు. ఆమెను అమితంగా ప్రేమించే మహేష్ స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. నీవు నీవుగా ఉంటూ, విషయాలను చక్కబెడుతూ నా విజయంలో భాగమైనందుకు ధన్యవాదాలు, అని మహేష్ ట్వీట్ చేశారు. తన సక్సెస్ వెనుక నమ్రత ఉందని మహేష్ చెప్పకనే చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

టాలీవుడ్ క్రేజీ కపుల్ గా ఉన్న మహేష్-నమ్రత ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి లవ్ స్టోరీలో సినిమాకు మించిన నాటకీయత చోటు చేసుకుంది. నమ్రత బర్త్ డే సందర్భంగా ఓ సారి గుర్తు చేసుకుందాము. 
 

39


కాగా మహేష్ ప్రేమ వివాహం అప్పట్లో ఓ సంచలనం. అమ్మాయిల కలల రాకుమారుడైన మహేష్ ని పడేసిన ఆ అమ్మాయి ఎవరని? పెద్ద చర్చ నడిసింది. ఇక మహేష్ ప్రేమ కథ అనేక మలుపు తీసుకొని సుఖాంతమైంది. చాలా రిజర్వుడుగా ఉండే మహేష్.. హీరోయిన్ నమ్రతను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అనూహ్య పరిణామం. 

49

పలు సందర్భాల్లో మహేష్, నమ్రత తమ ప్రేమ, పెళ్లి గురించి స్పందించారు. ఆనాడు జరిగిన ఆసక్తికర సంఘటనలు వివరించారు. హీరోగా మహేష్ మూడవ చిత్రం వంశీ. దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన ఈ మూవీ హీరోయిన్ గా నమ్రత శిరోద్కర్ ని ఎంచుకున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వంశీ షూటింగ్ సమయంలో మహేష్-నమ్రత మధ్య ప్రేమ చిగురించింది.

59

వంశీ మూవీ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25 రోజులు అక్కడ షూటింగ్ జరిగింది. ఆ సమయంలోనే నమ్రత, మహేష్ ప్రేమలో పడ్డారు. సినిమాకు అదే చివరి షెడ్యూల్ కాగా... షూటింగ్ పూరైతే ఇకపై కలుస్తామా? లేదా? అనే వేదన ఇద్దరిలో ఉంది. ఆలస్యం చేయడం మంచిది కాదని గ్రహించిన నమ్రత ముందుగా మహేష్ తో తన ప్రేమ వ్యక్తీకరించారట. అప్పటికే నమ్రత అంటే ఇష్టం పెంచుకున్న మహేష్ వెంటనే ఓకే చెప్పారట. 
 

69

వంశీ మూవీ 2000లో విడుదల కాగా... ఐదేళ్లు మహేష్-నమ్రత రహస్యంగా ప్రేమించుకున్నారు. వీరి గురించి ఎలాంటి ఎఫైర్ రూమర్స్ బయటికి రాకపోవడం విశేషం. 2005 ఫిబ్రవరి 10న అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగింది. మహేష్ రహస్యంగా నమ్రతను వివాహం చేసుకున్నారన్న వార్తలు సంచలనం రేపాయి. 
 

79

ఇక ఈ వివాహం వెనుక మహేష్ సిస్టర్ మంజుల కృషి ఎంతగానో ఉందట. నమ్రతతో వివాహానికి కృష్ణగారు ఒప్పుకోలేదట. ఆయనను ఒప్పించే బాధ్యత తీసుకున్న మంజుల ఆ పని విజయవంతంగా నిర్వహించి కీలక పాత్ర వహించారు. మహేష్ కోసం తన కెరీర్ కి గుడ్ బై చెప్పేసింది నమ్రత. ఓ సాధారణ గృహిణిగా మారి గొప్ప ఇల్లాలుగా పేరు తెచ్చుకున్నారు. మహేష్, నమ్రత అంత ఆదర్శ దంపతులు వేరొకరు ఉండరేమో... కాగా మహేష్ కంటే నమ్రత వయసులో పెద్దది కావడం విశేషం. 
 

89


ఇక మహేష్ స్టైల్, హ్యాండ్ సమ్ నెస్, యాక్టింగ్ తిరుగులేని స్టార్ గా నిలబెట్టాయి. ఇక సామాజిక సేవతో రియల్ హీరో అనిపించుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ బాబు, వేయి మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. 
 

99


వీటన్నింటికీ మించి మహేష్ ఓ మంచి హస్బెండ్, ఫాదర్. సూపర్ స్టార్ గా క్షణం తీరిక లేకుండా గడిపే మహేష్ కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. తన బిజీ షెడ్యూల్స్ లో కుటుంబానికి సమయం కేటాయిస్తారు. విరామం దొరికితే భార్యాపిల్లలతో విహారాలకు వెళ్లడం మహేష్ కి చాలా ఇష్టం. అలాగే ఇంట్లో సితార, గౌతమ్ తో సరదా ఆడుకోవడం మహేష్ కి ఇష్టమైన వ్యాపకం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image2
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image3
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved