మహేశ్ బాబు - త్రివిక్రమ్ మూవీ యాక్షన్ సీక్వెల్ మొదలు.. ఇంతకీ విలన్ ఎవరో తెలుసా?
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’ (SSMB28). తాజాగా ఈ చిత్రంలో మహేశ్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు షూటింగ్ అప్డేట్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం SSMB28. పదేండ్ల తర్వాత మళ్లీ ఈ కాంబోలో సినిమా వస్తుండటంతో మహేశ్ ఫ్యాన్స్, ఆడియెన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇటీవలనే ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. దీంతో ఎప్పుడెప్పుడు ఎలాంటి అప్డేట్స్ వస్తాయోనని ఎదురుచూస్తున్నారు. ఇటీవలనే సర్ ప్రైజింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. మరోవైపు సినిమా ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో అప్పుడే ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ‘ఎస్ఎస్ఎంబీ28’ చిత్ర షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం.. మూవీకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ నే ప్రారంభించినట్టు తెలుస్తోంది. పాపులర్ ఫైట్ మాస్టర్ అన్బరివ్ (Anbariv) చిత్రానికి కొరియోగ్రాఫర్ గా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన దర్శకత్వంలో ఫైట్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.
మరోవైపు చిత్రంలో మెయిన్ విలన్ ఎవరంటూ ఎప్పటి నుంచో ఇటు ఫ్యాన్స్, అటు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మేరకు మహేశ్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరోను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆయనేవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) అంటూ నెట్టింట గట్టిగా ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ స్టార్స్ క్రమక్రమంగా సౌత్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగన్, ‘కేజీఎఫ్’లో సంజయ్ దత్, ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహేశ్ బాబుకు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండటం పట్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇద్దరీ మధ్య సాగే సన్నివేశాలు ఎలా ఉంటాయోనని ఎగ్జైట్ గా ఉన్నారు.
చివరిగా మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’తో అలరించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలోని ‘ఎస్ఎస్ఎంబీ28’ రెగ్యూలర్ షూటింగ్ హాజరవుతున్నారు. ఈ చిత్రం కోసం మహేశ్ బాబు కొత్త లుక్ ను మార్చుకున్న విషయం తెలిసిందే. కొద్దిపాటి మీసాలు, గడ్డంతో మాస్ లుక్ ను సొంతం చేసుకున్నాడు.ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా పూజా హెగ్దే (Pooja Hegde) నటిస్తోంది.