MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Mahesh Babu: అన్న కొడుకు కోసం రంగంలోకి మహేష్ బాబు, జయకృష్ణ కోసం ఏం చేయబోతున్నాడంటే?

Mahesh Babu: అన్న కొడుకు కోసం రంగంలోకి మహేష్ బాబు, జయకృష్ణ కోసం ఏం చేయబోతున్నాడంటే?

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న మొదటి సినిమా కోసం సూపర్ స్టార్ ఏం చేయబోతున్నాడంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 24 2026, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరో..
Image Credit : our own

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరో..

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ యంగ్ స్టార్ రాషా తడాని హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అశ్వినీ దత్ సమర్పణలో, చందమామ కథలు బ్యానర్‌పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు RX100 చిత్రంతో గుర్తింపు పొందిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అన్న కొడుకు కోసం రంగంలోకి మహేష్ బాబు.. ?
Image Credit : our own

అన్న కొడుకు కోసం రంగంలోకి మహేష్ బాబు.. ?

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. జయకృష్ణ ఫస్ట్ పిక్చర్ కావడంతో పాటు కృష్ణ మూడో తరం వారసుడిగా ఆయన ఎంట్రీ ఇవ్వడం కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది. ఈ సినిమా జులై 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో ఈమూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. తన అన్న కొడుకుని ఇండస్ట్రీలో సెట్ చేయడం కోసం ఆయన కొన్ని బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం.

34
ప్రీరిలీజ్ లో మహేష్ ఏం చేయబోతున్నాడు?
Image Credit : youtube/@ColliderInterviews

ప్రీరిలీజ్ లో మహేష్ ఏం చేయబోతున్నాడు?

శ్రీనివాస మంగాపురం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ వార్త ఘట్టమనేని అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. సమాచారం ప్రకారం, శ్రీనివాస మంగాపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 2న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని శిల్పకళాలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు హాజరై తన అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణను అభిమానులకు అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

44
కృష్ణ సినీ వారసత్వాన్ని జయకృష్ణ నిలబెట్టగలడా?
Image Credit : Asianet News

కృష్ణ సినీ వారసత్వాన్ని జయకృష్ణ నిలబెట్టగలడా?

మహేష్ బాబు ఈ ఈవెంట్ కు వస్తే.. సూపర్ స్టార్ అభిమానులంతా అక్కడికి వస్తారు. జయకృష్ణ సినిమాకు పబ్లిసిటీతో పాటు.. అతని తరువాత సినిమాలు కూడా కృష్ణ అభిమానులు భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కృష్ణ వారసత్వం, మహేష్ బాబు సపోర్ట్ తో పాటు జయకృష్ణ తన టాలెంట్ కూడా చూపించి.. కాస్త కష్టపడితే.. టాలీవుడ్ కి మూడో సూపర్ స్టార్ దొరికినట్టే అని చెప్పాలి. జయకృష్ణ తొలి సినిమాతోనే ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన అందుకుంటాడో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image2
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image3
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Related Stories
Recommended image1
Roja Selvamani Daughter: హీరోయిన్ గా రోజా కూతురు అన్షు మాలిక ఎంట్రీ ఇవ్వబోతోందా? స్టార్ హీరో వారసుడితో జతకట్టబోతుందా?
Recommended image2
Megastar: మా నాన్న ఆ రోజు ఇచ్చిన వార్నింగ్‌ విలువేంటో తెలిసొచ్చింది.. గూండా సినిమా టైమ్‌లో సంఘటన బయటపెట్టిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved