- Home
- Entertainment
- Guntur Kaaram : ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ వచ్చేసింది.. ఆ డైలాగ్ శ్రీలీలాకేనా? క్రేజీగా లిరిక్స్!
Guntur Kaaram : ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ వచ్చేసింది.. ఆ డైలాగ్ శ్రీలీలాకేనా? క్రేజీగా లిరిక్స్!
‘గుంటూరు కారం’ నుంచి సెన్సేషనల్ మాస్ సాంగ్ ‘కుర్చీ మడత పెట్టి’ Kurchi Madatha Petti ఫుల్ వెర్షన్ వచ్చేసింది. లిరిక్స్ క్రేజీగా ఉన్నాయి. మహేశ్ బాబు Mahesh babu, శ్రీలీలా మాస్ స్టెప్పులు ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించేలా ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సూపర్ స్టార్ మహేశ్ బాబు - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ Trivikram కాంబోలో 13 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ Guntur Kaaram. హారిక అండ్ హాసిని బ్యానర్ పై గ్రాండ్ గా రూపుదిద్దుకుంటోంది. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా Sreeleela హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ నుంచి సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం సాంగ్స్ తోనే హైప్ పెంచేస్తున్నారు. తాజాగా ‘కుర్చీ మడతపెట్టి’ Kurchi Madatha Petti Song తో అందరి చూపు ‘గుంటూరు కారం’పైనే పడేలా చేశారు. అయితే, కొద్దిసేపటి కింద రిలీజ్ అయిన ఈ మాస్ సాంగ్ లిరిక్స్ క్రేజీగా ఉన్నాయి.
తాజాగా యూనిట్ ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ లిరికిల్ వీడియోను విడుదల చేసింది. ‘రాజమండ్రి రాగ మంజరి మా యమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రీ’ అనే పల్లవితో సాంగ్ ప్రారంభం అవుతుంది. శ్రీలీలా వెర్షన్ లో సాంగ్ ఉంటుంది. దీనికి మహేశ్ బాబు కౌంటర్ ఇచ్చేలా చరణం సాగుతుంది.
లిరిక్స్ పరిశీలిస్తే.. ‘రాజమండ్రి రాగ మంజరి మా యమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రీ.. కళాకార్ల ఫ్యామిలీ మరీ, నేను గజ్జె కడితే నిదురపోదు నిండు రాతిరి..’ అంటూ సాగిన లిరిక్స్ కు మెయిల్ వాయిస్ కౌంటర్ ఉంటుంది. ఇలా సాగిన పాటలో ఇంతకీ ‘కుర్చీ మడత పెట్టి’న అనే డైలాగ్ ఎవరికి వాడారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో సాంగ్ లోని మరికొంత లిరిక్ వింటే.. ‘దానికేమో మేకలిస్తివి.. మరి నాకే సన్నబియ్యం నూకలిస్తివి.. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపోయే.. నాకిచ్చిన నూకలేమో ఒక్కపూటకు కరిగిపోయే.... అడ పచ్చరాళ్ల జూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ల కోకలిస్తివి.. దాని చెవిలో జూకాలేమో దగదగ మెరిసిపోయే..నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయే.. ఏం రసికరాజువో మరి నా దాసు బావ.. నీతో ఎప్పుడింత కిరికిరి’ అంటూ శ్రీలీలా వెర్షన్ లో లిరిక్స్ సాగుతాయి.
దీని వెంటనే కౌంటర్ గా ‘ఆ కుర్చీని మడతపెట్టి’ అనే డైలాగ్ ఉంటుంది. దాంతో ఆ డైలాగ్ శ్రీలీలాకేనా అని అంటున్నారు సాంగ్ విన్నోళ్లు. మొత్తానికి సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. కొందరు విమర్శిస్తుంటే.. మిగిలినవాళ్లు ఈ మాస్ సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
2023 ఈయర్ ఎండింగ్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నుంచి ఇలాంటి సాంగ్ రావడం ఆసక్తికరంగా మారింది. ఈపాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సాహితీ చాగంటి, శ్రీ కృష్ణ పాడారు. థమన్ క్యాచీ ట్యూన్ అందించారు. శేఖర్ వీజే కొరియోగ్రఫీతో దుమ్ములేపారు.
ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కూడా నటించింది. ఇప్పటివరకు మూడు సాంగ్స్ విడుదల చేశారు. రిలీజ్ వరకు ఇంకో సాంగ్ కూడా రానుంది. ఇక టీజర్, ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుగా 2024 జనవరి 12న విడుదల కాబోతోంది.