- Home
- Entertainment
- SVP Movie Pre Review: సర్కారు వారి పాట పక్కా బ్లాక్ బస్టర్ రికార్డులు గల్లంతు... దానికి ఆరు కారణాలు ఇవే!
SVP Movie Pre Review: సర్కారు వారి పాట పక్కా బ్లాక్ బస్టర్ రికార్డులు గల్లంతు... దానికి ఆరు కారణాలు ఇవే!
సర్కారు వారి పాట చిత్రంపై మొదటి నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ విడుదల నాటి నుండే సినిమా బాగుంటుందనే నమ్మకం కలిగింది. ఇక ట్రైలర్ విడుదలతో అంచనాలు ఎల్లలు దాటిపోయాయి.

సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)మూవీతో మహేష్ పక్కా బ్లాక్ బస్టర్ కొట్టనున్నాడు. రికార్డులు గల్లంతు కానున్నాయి. విడుదలకు ముందే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడం వెనుక ఐదు బలమైన కారణాలు ఉన్నాయి. మహేష్ (Mahesh Babu)వరుస హిట్స్ లో ఉన్నారు. అయినప్పటికీ ఆయన మేనరిజం అన్ని సినిమాల్లో ఒకేలా ఉంటుందనే కంప్లైంట్ ఉంది. తెలియకుండానే ఈ విషయంలో మహేష్ మూస ధోరణికి అలవాటుపడ్డారనే విమర్శ ఉంది. మహేష్ యాక్టింగ్, మేనరిజంలో మోనాటమి పెరిగిపోయిందనే భావనను మహేష్ సర్కారు వారి పాట చిత్రంలో బ్రేక్ చేసినట్లు కనిపిస్తుంది. ఆయనను దర్శకుడు గతంలో ఎన్నడూ చూడని ఊరమాస్ అవతార్ లో ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తుంది. ట్రైలర్ లో మహేష్ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడం పూరి బిజినెస్ మాన్ ఆటిట్యూడ్ గుర్తుకొచ్చింది. సో మహేష్ తనలోని కొత్త కోణం చూపించనున్నాడు.
సర్కారు వారి పాట పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్ , ఎమోషన్స్ కలగలిపిన ఫుల్ మీల్ లాంటి చిత్రం. అన్ని అంశాలను సరైన మోతాదులో బ్లెండ్ చేసిన సర్కారు వారి పాట తెరకెక్కించారనిపిస్తుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ తో మహేష్ కామెడీ ఓ రేంజ్ లో పేలే అవకాశం కలదు. దూకుడు సినిమాలో మహేష్-వెన్నెల కిషోర్ కాంబినేషన్ అదుర్స్ అనిపించింది. ఆ సెంటిమెంట్ సర్కారు వారి పాట చిత్రంలో రిపీట్ కావడం ఖాయం.
sarkaru vaari paata trailer
సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేదే ట్రైలర్. మొత్తం సినిమాకు ట్రైలర్ శాంపిల్ లాంటింది. ఈ విషయంలో సర్కారు వారి పాట మేకర్స్ సూపర్ సక్సెస్. ట్రైలర్(Sarkaru Vaari Paata Trailer) కట్ అదిరింది. మహేష్ తో పాటు హీరోయిన్, విలన్ ని పరిచయం చేసిన విధానం బాగుంది. రెండున్నర నిమిషాల ట్రైలర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. సర్కారు వారి పాట పక్కా బ్లాక్ బస్టర్ అన్న నమ్మకాన్ని పెంచింది.
నిజానికి కీర్తి సురేష్ (Keerthy Suresh)ఫార్మ్ లో లేదు. ఆమె రీసెంట్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద సరైన విజయం అందుకోలేదు. గత చిత్రాల్లో ఆమె లుక్ కూడా ఓ మైనస్. బరువు తగ్గాక కీర్తి సురేష్ లోని బబ్లీనెస్ పోయింది. అయితే సర్కారు వారి పాట మూవీలో కీర్తి లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆమె ఈ చిత్రంలో చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. మహేష్ తో ఆమె రొమాన్స్, లవ్ ట్రాక్ సినిమాకు హైలెట్ నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక సర్కారు వారి పాటకు కలిసొచ్చే మరో అంశం ఏమిటంటే ఈ చిత్రం మొత్తంగా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ తో పాటు వాళ్ళ యాటిట్యూడ్స్ భిన్నంగా అనిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్ర కథ చాలా బలమైందిగా తోస్తుంది. ఇది రివేంజ్ డ్రామా అని తెలుస్తుండగా... మహేష్ మనీ మైండెడ్ ఫెలోగా వ్యవహరించడానికి, ఆయన ఆ ప్రవర్తన వెనుక ఓ బలమైన కారణం ఉందనిపిస్తుంది.
ఇక సాంగ్స్ హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్లే. సూపర్ ఫార్మ్ లో ఉన్న థమన్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. విడుదలైన మూడు సాంగ్స్ దుమ్మురేపాయి. అల వైకుంఠపురంలో తర్వాత థమన్ నుండి వచ్చిన ఆ రేంజ్ ఆల్బమ్ గా సర్కారు వారి పాట చిత్రాన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి సాంగ్స్ సర్కారు వారి చిత్రానికి కలిసొచ్చే మరొక అంశం.
పైన చెప్పిన ఈ ఐదు కారణాలు పరిశీలిస్తే... సర్కారు వారి పాట బొమ్మ బ్లాక్ బస్టర్ అని ముందుగానే చెప్పొచ్చు. కాగా మే 12న సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.