- Home
- Entertainment
- మహేష్ బాబు, నమ్రత లైఫ్‌లో వెలుగు నింపింది ఎవరో తెలుసా? కానీ ప్లాన్ చేయలేదు.. ప్రిన్స్ ఎమోషనల్ పోస్ట్
మహేష్ బాబు, నమ్రత లైఫ్‌లో వెలుగు నింపింది ఎవరో తెలుసా? కానీ ప్లాన్ చేయలేదు.. ప్రిన్స్ ఎమోషనల్ పోస్ట్
మహేష్ బాబు, నమ్రతల ముద్దులు కూతురు సితార నేడు ఆదివారం పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె గురించి వీరిద్దరు చెప్పిన విషయాలు షాకిస్తున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

ప్రేమ పెళ్లి చేసుకున్న మహేష్ బాబు, నమ్రత
మహేష్ బాబు, నమ్రతల ప్రేమ పెళ్లి అనే విషయం తెలిసిందే. `వంశీ` సినిమా సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైమ్ తీసుకున్నారు. బాగా అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకున్నారు.
వీరి పెళ్లిని సూపర్ స్టార్ కృష్ణ వ్యతిరేకించారని అంటుంటారు. మహేష్ కూడా ఓ సందర్భంలో ఈ విషయాన్ని చెప్పారు. ఎట్టకేలకు వీరిద్దరు 2005లో మ్యారేజ్ చేసుకున్నారు.
గౌతమ్ అనారోగ్యం కారణంతో మహేష్ గొప్ప నిర్ణయం
మహేష్ బాబు, నమ్రతల ప్రేమకి ప్రతిరూపంగా మొదట గౌతమ్ ఘట్టమనేని జన్మించారు. అయితే ఆయన చిన్నప్పుడు కొంత అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు.
దీంతో మహేష్, నమ్రత చాలా ఇబ్బంది పడ్డారు. చాలా స్ట్రగుల్ అయ్యారు. మొత్తానికి గౌతమ్‌ని అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డారు. ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నారు. అథ్లెట్స్ లోనూ పాల్గొంటూ ఛాంపియన్‌గా రాణిస్తున్నారు.
అయితే మహేష్ తన కొడుక్కో చాలా ఖర్చు చేయాల్సి వచ్చింది. తనకు మనీ ఉన్నాయి పెట్టగలిగాను, కానీ లేని వాళ్ల పరిస్థితి ఏంటి? అని ఆలోచించి తన ఎన్జీవో ద్వారా చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నారు. వారికి అండగా నిలుస్తున్నారు.
చిన్న వయసులోనే సెలబ్రిటీ అయిపోయిన సితార
ఇక మహేష్ బాబు, నమ్రతలకు రెండో సంతానంగా సితార జన్మించింది. ఇప్పుడు ఆమె చిచ్చరపిడుగులా మారిపోయింది. నేషనల్ సెలబ్రిటీ కూడా అయిపోయింది. కమర్షియల్ యాడ్స్ చేస్తూ పాపులర్ అయ్యింది.
అలాగే ఆ మధ్య `సర్కారు వారి పాట`సినిమా సమయంలో ప్రమోషనల్ సాంగ్‌లోనూ ఆమె డాన్సు చేసి ఆకట్టుకుంది. మరోవైపు ఓ ప్రముఖ దుస్తుల బ్రాండ్స్ కి అంబాసిడర్‌గా వ్యవహరించి టైమ్స్ స్వ్కైర్ పైకి ఎక్కింది.
ఓ హాలీవుడ్ చిత్రంలోని పాత్రకి వాయిస్ కూడా అందించింది. మొత్తంగా చైల్డ్ స్టార్‌గా రాణిస్తోంది సితార. నేడు ఆమె బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటోంది.
సితార అన్ ప్లాన్డ్ బేబీః నమ్రత
అయితే సితారకి సంబంధించి తల్లి నమ్రత ఆ మధ్య షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తాము సితార పాపని ప్లాన్ చేయలేదని తెలిపింది. జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయం బయటపెట్టింది నమ్రత.
గౌతమ్ జన్మించిన తర్వాత తాము పిల్లలకు సంబంధించిన ప్లాన్ చేయలేదని, సితారని ప్లాన్ చేయలేదని తెలిపింది నమ్రత.
ప్లాన్ చేయకుండా వచ్చిన బేబీ సితార అని, అయితే ఇప్పుడు మాకు సితారనే ప్రపంచమని తెలిపింది. తమ ఫ్యామిలీకి సితార ఒక వెలుగు లాంటిదని వెల్లడించారు నమ్రత.
తన లైఫ్‌లో వెలుగు నువ్వేః మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
నమ్రత మాత్రమే కాదు మహేష్ బాబు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. సితార నేడు ఆదివారం(జులై 20)న పుట్టిన రోజు జరుపుకుంటోన్న సందర్భంగా ఆమెకి విషెస్ చెబుతూ, నా జీవితాన్ని ఎల్లప్పుడూ వెలిగిస్తూ ఉన్నావని,
ఎంతో ప్రేమిస్తున్నానని, ఆమె ఒక టీనేజర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు` అని తెలిపారు మహేష్. ఇలా తాను కూడా తన జీవితంలో వెలుగు సితారనే అని తేల్చిచెప్పారు. సితార పాప తమ లైఫ్‌నే మార్చేసిందని అటు మహేష్, ఇటు నమ్రత చెప్పడం విశేషం.