MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mahesh Babu: అబ్బా ఏమున్నాడ్రా బాబు.. 50 ఏళ్లంటే ఎవరైనా నమ్ముతారా? మహేష్ బాబు ఫ్యాన్స్ కి రాజమౌళి ట్రీట్..

Mahesh Babu: అబ్బా ఏమున్నాడ్రా బాబు.. 50 ఏళ్లంటే ఎవరైనా నమ్ముతారా? మహేష్ బాబు ఫ్యాన్స్ కి రాజమౌళి ట్రీట్..

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా.. ? ప్రతీ ఏడాది అంతకు మించిన గ్లామర్ తో అదరగొడుతున్నాడు ప్రిన్స్. తాజాగా వారణాసి నుంచి రిలీజ్ అయిన స్పెషల్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 09 2026, 09:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా?
Image Credit : @VaranasiMovie /X

ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా?

ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత మెయింటేన్ చేసినా... ఏజ్ పెరుగుతున్నాకొద్ది ముసలితనం కామన్. దాచుకన్నా అది దాగదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో మాత్రం అద్భుతమే జరుగుతుంది. ఆయన వయసు పెరిగే కొద్ది గ్లామర్ రెట్టింపు అవుతోంది. 50 ఏళ్లు దాటినా సూపర్ స్టార్ ఇంకా కుర్ర హీరోలాగానే కనిపిస్తున్నాడు. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరున్న సూపర్ స్టార్.. ఇప్పటికీ అదే లుక్ ను మెయింటేన్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ లో అభిమానులను ఫిదా చేస్తున్నాడు. తాజాగా మరోసారి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు మహేష్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వారణాసి నుంచి మహేష్ బాబు న్యూ లుక్..
Image Credit : @VaranasiMovie /X

వారణాసి నుంచి మహేష్ బాబు న్యూ లుక్..

తాజాగా వారణాసి నుంచి మహేష్ బాబు న్యూ లుక్ ను రిలీజ్ చేశాడు రాజమౌళి. సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ ఫోటోస్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మహేష్ బాబు మరింత యంగ్ గా, స్మార్ట్ గా కనిపిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 5 పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. మహేష్ బాబు ఇలా ఎలా మెయింటేన్ చేస్తున్నాడా అని అంతా షాక్ అవుతున్నారు. రాజమౌళి ఇలా ఫోటోస్ రిలీజ్ చేయగానే.. అలా వైరల్ చేసేస్తున్నారు అభిమానులు.

34
మహేష్ బాబు డైట్ సీక్రెట్..
Image Credit : Asianet News

మహేష్ బాబు డైట్ సీక్రెట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు 5 పదుల వయసులో కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు, డైట్, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకపోవడం లాంటివి ముఖ్యమైనవి. మహేష్ డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. నచ్చినవి తింటాడు కానీ.. మితంగా తీసుకుంటాడు. బాడీకి సరిపడా ప్రోటీన్, ఫైబర్ అందేలా బ్యాలెన్డ్ మీల్స్ ను మెయింటేన్ చేస్తుంటాడు. ఇక ఆయన లైఫ్ లో షుగర్ కానీ, డైరీ ప్రాడెక్ట్ అయిన పాలు, పెరుగు, వెన్న నెయ్యి లాంటివి అస్సలు ముట్టుకోడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

44
సూపర్ ఫాస్ట్ గా వారణాసి షూటింగ్..
Image Credit : Asianet News

సూపర్ ఫాస్ట్ గా వారణాసి షూటింగ్..

ఇప్పటి వరకూ టాలీవుడ్ కే పరిమితం అయిన మహేష్ బాబు వారణాసి సినిమాతో పాన్ వరల్ట్ ను టచ్ చేయబోతున్నాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో.. హాలీవుడ్ కాన్సెప్ట్ తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ నుంచి రీసెంట్ గా కొన్ని ఫోటోస్ కూడా లీక్ అయ్యాయి. అడ్వెంచర్ కాన్సెప్ట్ కు మైథాలజీ టచ్ ఇస్తూ.. డిఫరెంట్ లైన్ తో జక్కన్న ఈసినిమాను రూపొందిస్తున్నాడు. ఈసినిమాలో మహేష్ బాబు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుంది. 2027 సమ్మర్ కానుకగా ఈసినిమాను రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో ఉంది జక్కన్న టీమ్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
Venkatesh: వెంకటేష్ కోసం తండ్రితో గొడవపడిన హీరోయిన్ ఎవరో తెలుసా? వెంకీని చూడగానే ఆమెకు ఏమనిపించిందంటే?
Recommended image2
DC Box Office Collections: లోకేష్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. తొలిరోజే ఇన్ని కోట్ల కలెక్షన్లా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved