- Home
- Entertainment
- కొత్తలుక్‌లో హల్క్ లా మహేష్ బాబు.. జుంపాల జుట్టు, గెడ్డం, మీసాలతో సూపర్ స్టార్‌ని ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
కొత్తలుక్‌లో హల్క్ లా మహేష్ బాబు.. జుంపాల జుట్టు, గెడ్డం, మీసాలతో సూపర్ స్టార్‌ని ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త లుక్‌లో కనిపించారు. గెడ్డం, మీసాలతో కనిపించారు. అంతేకాదు బరువెక్కి అదరగొడుతున్నారు. లేటెస్ట్ లుక్ పెద్దచర్చనీయాంశంగా మారింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మూవీ కోసమే ఆయన వర్కౌట్ చేస్తున్నారు. బాడీని మార్చుకుంటున్నారు. బాడీ ట్రాన్ఫర్మేషన్ చేస్తున్నారు. తాజాగా ఆయన కొత్తలుక్‌లో కనిపించారు.
మహేష్ బాబు సోమవారం హైదరాబాద్‌లో ఓటు వేయడానికి వచ్చారు. తన భార్య నమ్రతాతో కలిసి ఆయన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే ఇందులో మహేష్ బాబు లుక్ వైరల్‌గా మారింది. ఆయన బ్లూ టీషర్ట్, జీన్స్ ధరించారు. తలపై క్యాప్ పెట్టుకున్నారు.
ఇందులో మహేబాబు లుక్ అందరిని ఆకట్టుకునేలా ఉంది. అదే సమయంలో గతంలో ఎప్పుడూ చూడనటువంటి లుక్‌లో సూపర్ స్టార్ కనిపించడం ఆశ్చర్యంగా మారింది. ఈ సందర్బంగా కొత్త చర్చ ప్రారంభమైంది. ఇది రాజమౌళి సినిమా లుక్ అని అంతా మాట్లాడుకుంటున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఇప్పుడు సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది. దీనికోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మహేష్ కూడా వర్కౌట్స్ చేస్తున్నారు. బాడీని ట్రాన్స్ ఫర్మింగ్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఫిట్‌గా ఉండేందుకు ఎక్సర్‌సైజ్‌లు చేసి సన్నగా అవుతుంటారు. కానీ ఇందులో మహేష్ సరికొత్తలుక్‌లో ఉన్నారు.
ఆయన ఫిట్‌గానే కనిపిస్తున్నారు. కానీ లావెక్కారు. చూడ్డానికి కాస్త లావుగా కనిపిస్తున్నారు మహేష్. అంతకు ముందు కాస్త సన్నగా కనిపించేవారు. ఇప్పుడు లావెక్కారు. చూడ్డానికి హ్యాండ్సమ్ హల్క్ గా ఉన్నారు మహేష్. అదే సమయంలో ఆయన గెడ్డం పెంచారు. మీసాలు కూడా కాస్త పెరిగాయి. అలాగే జుంపాల ఎయిర్ కూడా ఉంది. సరికొత్త లుక్‌లో అదరగొడుతున్నారు మహేష్. రాజమౌళి సినిమాకి ఇదే లుక్ అనేలా ఆయన హింట్ ఇస్తుండటం విశేషం.
Rajamouli
ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్‌గా రాజమౌళి సినిమా తెరకెక్కుతుంది. ఇందులో ప్రపంచాన్ని చుట్టే సాహసికుడి పాత్రలో మహేష్ కనిపిస్తారట. దానికోసమే ఈ లుక్ అని తెలుస్తుంది. వైరల్‌గా మారింది.