- Home
- Entertainment
- సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్: మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్
సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్: మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్
ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. పక్కా ప్రణాళికతో తెరకెక్కిస్తే ఎవరి బయోపిక్ అయినా ఘనవిజయం సాధిస్తుంది. 'మహానటి' చిత్రమే అందుకు ఉదాహరణ.

ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. పక్కా ప్రణాళికతో తెరకెక్కిస్తే ఎవరి బయోపిక్ అయినా ఘనవిజయం సాధిస్తుంది. 'మహానటి' చిత్రమే అందుకు ఉదాహరణ. సరైన విధంగా ప్లాన్ చేసుకోకపోవడం, రెండు భాగాలుగా సాగదీయడం వల్ల ఎన్టీఆర్ బయోపిక్ నిరాశపరిచింది.
ఇదిలా ఉండగా లెజెండ్రీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ జీవితం కూడా అద్భుతమైన బయోపిక్ చిత్రానికి సరిపోయే విధంగా ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ పై ఆయనకు సాహసాల వీరుడు అనే పేరు ఉంది. టాలీవుడ్ ని కొత్త మలుపు తిప్పడంలో కృష్ణ పాత్ర ఎంతైనా ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు సాధ్యం కానీ ఎన్నో రికార్డులని కృష్ణ అందుకున్నారు.
అలాంటి సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కృష్ణ తనయుడిగా మహేష్ బాబే ఆయన బయోపిక్ లో నటిస్తే బావుంటుందనే అభిమానులు కూడా ఉన్నారు. కానీ ఈ విషయంలో మహేష్ అభిప్రాయం భిన్నంగా ఉంది.
అడివి శేష్ నటించిన మేజర్ చిత్రాన్ని మహేష్ బాబు నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ అయింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్రని బయోపిక్ గా తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మహేష్ బాబుకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. సూపర్ స్టార్ కృష్ణ గారి బయోపిక్ ఎప్పుడు రాబోతోంది అని ప్రశ్నించగా మహేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఆయన బయోపిక్ లో ఎవరైనా నటిస్తే చూసే వ్యక్తుల్లో నేనే మొదటి వాడిని. నేనుఆయన బయోపిక్ లో నటించలేను.. ఎందుకంటే ఆయన నా దేవుడు అని మహేష్ బాబు అన్నారు. ఎవరైనా డైరెక్టర్ కృష్ణ గారి బయోపిక్ కథతో వస్తే నిర్మించడానికి నేను రెడీ అని అన్నారు. ఏది ఏమైనా మహేష్ తన తండ్రి బయోపిక్ ని నిర్మించడానికి రెడీగా ఉన్నారు అంటే ఫ్యాన్స్ కొంత వరకు హ్యాపీ.
గతంలో కూడా మహేష్ కు ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆ చిత్రాలకు మహేష్ సీక్వెల్స్ చేస్తే బావుంటుందనే అభిప్రాయం కూడా ఉంది. కానీ దీనిపై కూడా మహేష్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. నాన్నగారి సినిమాలపై నాకు చాలా గౌరవం ఉంది. వాటిని అలాగే ఉండనివ్వాలి. నాన్నగారు నటించిన సినిమాలని గాని, సాంగ్స్ ని కానీ నేను రీమేక్ చేయను అని మహేష్ గతంలో తెలిపారు.