- Home
- Entertainment
- ట్రెండీ వేర్ లో మహేశ్ బాబు హీరోయిన్ స్టన్నింగ్ స్టిల్స్.. సిట్టింగ్ పోజిషన్ లో కవ్విస్తున్న కీర్తి సురేష్..
ట్రెండీ వేర్ లో మహేశ్ బాబు హీరోయిన్ స్టన్నింగ్ స్టిల్స్.. సిట్టింగ్ పోజిషన్ లో కవ్విస్తున్న కీర్తి సురేష్..
హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ట్రెండీ అవుట్ ఫిట్ లో స్టైలిష్ గా కుర్రాళ్ల గుండెల్ని దోచుకుంటోంది. లేటెస్ట్ గా ఫొటోషూట్లు చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా కీర్తి పోస్ట్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.

కీర్తి సురేష్ గత కొద్ది రోజులుగా ట్రెండీగా ఫొటోషూట్లు నిర్వహిస్తూ తన రూట్ మార్చింది. గతంలో ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చే ఈ బ్యూటీ.. ఇటీవల వెస్టర్న్ వేర్ లో స్టైలిష్ గా రెడీ అవుతూ అట్రాక్ట్ చేస్తోంది.
తెలుగు, తమిళ చిత్రాల్లో వరుసగా నటిస్తూ హీరోయిన్ కీర్తి సురేశ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘మహా నటి’తో జాతీయ స్థాయిలో బెస్ట్ హీరోయిన్ గా అవార్డు అందుకుని తన పాపులారిటీని పెంచుకుంది.
కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. వరుసగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజియేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ తన అభిమానులను అలరిస్తోంది.
తెలుగు ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సరసన ‘సర్కారు వారి పాట’లో నటించింది. ఈ చిత్రం మే 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది.
మరోవైపు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోషూట్లతో హల్ చల్ చేస్తోంది. గ్లామర్ పిక్స్ తో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ పిక్స్ లో కీర్తి సురేష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. డెనిమ్ జీన్స్, ట్రెండీ షర్ట్ ధరించి స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. సిట్టింగ్ పోజిషనల్ లో మతిపోయేలా ఫోజులివ్వడంతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ పిక్స్ కు ‘ద్వంద్వం అనేది కథ కాదు, ద్వంద్వత్వం కేవలం సంక్లిష్టత’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.