నిక్ నేమ్‌తో ప్రయోగం చేసి బోల్తా పడ్డా మహేష్ బాబు.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా ఏంటో తెలుసా?
మహేష్ బాబు కెరీర్‌లో చాలా పరాజయాలు చవిచూశాడు. హిట్లు అందుకున్నారు. కానీ తన నిక్ నేమ్‌తో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. దారుణమైన డిజాస్టర్ అయ్యింది. ఆ మూవీ ఏంటో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు.. చివరగా `గుంటూరు కారం` సినిమాతో వచ్చాడు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన దక్కించుకుంది. డిజాస్టర్ అంటూ ప్రచారం జరిగింది. కానీ బయ్యర్లు చాలా వరకు సేఫ్ అయ్యారని నిర్మాత చెబుతుంటారు. అయితే మహేష్ కెరీర్‌లో చాలా పరాజయాలున్నాయి. తొలి సినిమా `రాజకుమారుడు` యావరేజ్‌గా ఆడింది. ఆ తర్వాత `యువరాజు` పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. `వంశీ` సినిమా పరాజయం చెందింది. `మురారీ` మూవీతో బ్రేక్ అందుకున్నాడు. హీరోగా నిలబడ్డాడు.
ఆ తర్వాత `టక్కరి దొంగ`, `బాబీ` చిత్రాలు బోల్తా కొట్టాయి. ఈ క్రమంలో `ఒక్కడు` తో హిట్ కొట్టి స్టార్ అయిపోయాడు మహేష్ బాబు. `నిజం`, `నాని` చిత్రాలు ఆడలేదు. `అర్జున్` హిట్, `అతడు` యావరేజ్‌గానే ఆడింది. `పోకిరి`తో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ గా ఎదిగాడు. సూపర్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత `సైనికుడు`, `అతిథి`, `ఖలేజా` చిత్రాలు ఆడలేదు. `దూకుడు`తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. `బిజినెస్ మేన్`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `వన్ నేనొక్కడినే`, `ఆగడు`, `శ్రీమంతుడు`, `బ్రహ్మోత్సవం`, `స్పైడర్`, `భరత్ అనే నేను`, `మహర్షి`, `సరి లేరు నీకెవ్వరు`, `సర్కారు వారి పాట`, `గుంటూరు కారం` సినిమాలతో ఆకట్టుకున్నారు మహేష్.
మహేష్ కెరీర్‌లో కొన్ని ప్రయోగాలు చేశారు. తన ముద్దు పేరు(నిక్ నేమ్)తో సినిమా చేశారు. అంతేకాదు దానికి సైన్స్ అంశాలు జోడించి చేయడం విశేషం. ఆ సినిమా ఏంటో కాదు `నాని`. మహేష్ బాబు ముద్దు పేరు నాని అనే విషయం తెలిసిందే. ఇంట్లో అంతా ఆయన్ని అలానే పిలుస్తారట. ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్లో ఈ విషయాన్ని తెలిపారు మహేష్. అయితే తన ముద్దు పేరు `నాని`తో మహేష్ చేసిన ఈ ప్రయోగం బెడిసికొట్టింది. 2004లో విడుదలైన ఈ మూవీ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకి ఎస్ జే సూర్య దర్శకత్వం వహించగా, ఇందులో అమిషా పటేల్ హీరోయిన్‌గా నటించింది. దేవయాని చిన్నప్పటి మహేష్ పాత్రకి తల్లిగా నటించడం విశేషం.
ఇందులో మహేష్ చిన్న పిల్లాడిగా ఉండి, సైన్స్ ప్రయోగాల కారణంగా పెద్దగా మారిపోతుంటాడు. మదర్ సెంటిమెంట్‌తో ఫన్నీగా, రొమాంటిక్‌గా ఈ మూవీ సాగుతుంది. కానీ ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదు. దీంతో దారుణమైన డిజాస్టర్ అయ్యింది. తన నిక్ నేమ్‌తో మహేష్ చేసిన ఈ ప్రయోగం కలిసి రాలేదని చెప్పొచ్చు. పైగా సైన్స్ ఫిక్షన్ కావడం గమనార్హం. మాస్ ఇమేజ్ ఉన్న మహేష్ ఇలా చిన్న పిల్లాడిలా జనం చూడలేకపోయారు. కథ కూడా అంతగా కన్విన్సింగ్‌గా అనిపించలేదు. అందుకే సినిమా ఆడలేదు. ఎలాంటి ఇమేజ్ లేని యాక్టర్స్ కి అది సెట్ అయ్యే సబ్జెక్ట్. మహేష్‌కి అది రాంగ్ ఛాయిస్. మొత్తంగా తన నిక్ నేమ్ మహేష్‌కి కలిసి రాలేదనే చెప్పాలి.
ఇక మహేష్.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆయన పాన్ ఇండియా చేయబోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్‌గా ఇది రూపొందుతుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టాండర్స్ లో దీన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారు. ప్రపంచ ఆడియెన్స్ కి దగ్గరయ్యేలా దీన్ని ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ ఇండియన్ భారీ మూవీగా రూపొందించే ప్లాన్ జరుగుతుంది.
read more: సావిత్రి చివరి రోజుల్లో ఎందులో నివసించిందో తెలుసా? అంతకంటే దారుణ స్థితి మరోటి లేదు!