- Home
- Entertainment
- Mahesh foreign vacation pics: ఓ పనైపోయింది బాబూ... అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న మహేష్!
Mahesh foreign vacation pics: ఓ పనైపోయింది బాబూ... అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న మహేష్!
సూపర్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులున్న మహేష్ బాబు రియల్ లైఫ్ లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మాన్. అభిమానులు, కుటుంబ సభ్యులు మినహా ఆయనకు మరో ప్రపంచం లేదు. ఫ్రెండ్స్, పార్టీలను పెద్దగా ఇష్టపడరు.

Mahesh babu vacation pics
సినిమా ప్రపంచంలో పుట్టిపెరిగినా కూడా అతికొద్ది మంది స్నేహితులు మాత్రమే ఉన్నారు. ఎన్టీఆర్, చరణ్(Ram Charan) లు మహేష్ కి క్లోజ్ ఫ్రెండ్స్ కాగా... వారితో కూడా చాలా అరుదుగా కలుస్తారు. ఈ ముగ్గురు సతీసమేతంగా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో పాల్గొంటారు. మహేష్ ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడతారు.
Mahesh babu vacation pics
ఏమాత్రం విరామం దొరికినా భార్య నమ్రత(Namrata shirodhkar), పిల్లలు సితార, గౌతమ్ లతో విదేశాలకు చెక్కేస్తారు. ఏడాదికి కనీసం మూడు సార్లు ఫారిన్ ట్రిప్స్ కి వెళుతూ ఉంటారు.తన కొత్త సినిమా ప్రారంభానికి ముందు, విడుదల తర్వాత మహేష్ కచ్చితంగా కుటుంబ సభ్యులతో టూర్ కి వెళతారు. ప్రపంచంలోని అన్ని ప్రముఖ ప్రదేశాలు, దేశాలు వీరు వివహరించారు.
Mahesh babu vacation pics
ఇక మహేష్ (Mahesh babu)ఫెవరేట్ వెకేషన్ స్పాట్స్ గా ఉన్న దుబాయ్, పారిస్, న్యూయార్క్ నగరాలకు ఎక్కువగా వెళుతూ ఉంటారు. ప్రస్తుతం మహేష్ పారిస్ ట్రిప్ లో ఉన్నారు. భార్య పిల్లలతో ఆయన అక్కడకు వెళ్లారు. ఈ ట్రిప్ లో మహేష్ సన్నిహితులు కూడా జాయిన్ అయ్యారు.
Mahesh babu vacation pics
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసిన మహేష్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. వీరి ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో అవి వైరల్ గా మారాయి.
Mahesh babu vacation pics
మే 12న సర్కారు వారి పాట విడుదల వుంది. కావున చిత్ర ప్రమోషన్స్ లో మహేష్ పాల్గొనాల్సి ఉంది. కాబట్టి ఈ ట్రిప్ ఓ వారంలో ముగిసే అవకాశం కలదు. ఇక మే 2న సర్కారు వారి పాట ట్రైలర్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
Mahesh babu vacation pics
దర్శకుడు పరుశురాం కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.
Mahesh babu vacation pics
ఈ మూవీలోని సాంగ్స్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇప్పటికి మూడు సాంగ్స్ విడుదల కాగా యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ రాబట్టాయి. నాలుగో సాంగ్ అనుకోకుండా సోషల్ మీడియాలో లీకైంది.
Mahesh babu vacation pics
మొత్తంగా భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సర్కారు వారి పాట ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. కాగా త్వరలో మహేష్ దర్శకుడు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. అలాగే దర్శకుడు రాజమౌళితో మరో చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.