ఒళ్ళు హూనం చేసుకుని, మహేష్ రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసిన మూవీ.. చివరికి బాలయ్య, ప్రభాస్ ఆదుకున్నారు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లడం లేదు. కేవలం ఫ్యాన్స్ కి నచ్చే సినిమాలు మాత్రమే చేస్తున్నారు. కానీ కెరీర్ బిగినింగ్ లో మహేష్ కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లడం లేదు. కేవలం ఫ్యాన్స్ కి నచ్చే సినిమాలు మాత్రమే చేస్తున్నారు. కానీ కెరీర్ బిగినింగ్ లో మహేష్ కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. మహేష్ ఎక్స్పరిమెంట్ చేసిన ప్రతిసారి నెగిటివ్ రిజల్ట్ వచ్చింది.
కానీ మహేష్ పెర్ఫామెన్స్ కి మాత్రం ఎప్పటికప్పుడు అద్భుతంగా ప్రశంసలు దక్కుతూ వచ్చాయి. ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ కమర్షియల్ గా దారుణమైన రిజల్ట్ ఇచ్చిన చిత్రాలలో టక్కరి దొంగ మూవీ ఒకటి. అప్పట్లో ఈ చిత్రం టాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన చిత్రాల్లో ఒకటి. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ కృష్ణ గారి దగ్గరికి వెళ్లారు.
మహేష్ బాబుతో కౌబాయ్ సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆ చిత్రాన్ని కెఎస్ రామారావు నిర్మించాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. దీనితో డైరెక్టరే నిర్మాతగా రంగంలోకి దిగారు. కృష్ణ గారికి ఈ చిత్రం ఇష్టం లేదట. కౌబాయ్ సినిమా అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. డబ్బు వెనక్కి రాదు. పైగా నువ్వే నిర్మాత అంటున్నావ్.. మంచి లవ్ స్టోరీ తీస్తే నీకు బోలెడన్ని డబ్బులు మిగులుతాయి కదా అని కృష్ణ చెప్పారట.
లేదు సర్.. ఈ మూవీపై నాకు నమ్మకం ఉంది అని చెప్పా. నీ ఇష్టం అని అన్నారు. మహేష్ బాబు అయితే ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టేశారు. ప్రతి షాట్ ని డూప్ లేకుండా రియలిస్టిక్ గా చేశారు. ట్రైన్ కింద వేలాడే సీన్ కూడా ఆయనే డూప్ లేకుండా చేశారు అని జయంత్ అన్నారు.
సినిమా రిలీజ్ అయింది. ఫ్లాప్ టాక్ వచ్చింది. ఊహించని విధంగా నష్టపోయాను. అప్పటికి మహేష్ కి ఇంకా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. ఎంతోకొంత ఇవ్వాలి కాబట్టి మహేష్ కి గుర్తు చేశాను. నీకేమైనా పిచ్చి పట్టిందా.. రెమ్యునరేషన్ వద్దు అని అన్నారు. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. బహుశా అది కృష్ణగారి దగ్గరి నుంచి చేర్చుకున్నారేమో అని జయంత్ అన్నారు.
టక్కరి దొంగ చిత్రంతో భరించలేని విధంగా నష్టాల్లో కూరుకుపోయా. నష్టాల నుంచి ఎలా బయటపడ్డారు అని యాంకర్ ప్రశ్నించగా.. టక్కరి దొంగ తర్వాత ప్రభాస్ ని హీరోగా లాంచ్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అది ఈశ్వర్ చిత్రం. ఆ వెంటనే బాలయ్యతో లక్ష్మీ నరసింహ చిత్రం చేశాను. ఈ రెండు చిత్రాలకి వచ్చిన రెమ్యునరేషన్స్ తో నా అప్పులన్నీ తీరిపోయాయి అని జయంత్ అన్నారు. మొత్తంగా డైరెక్టర్ జయంత్ పరాన్జీ ని రెమ్యునరేషన్ తీసుకోకుండా మహేష్.. సినిమా ఛాన్స్ ఇచ్చి ప్రభాస్, బాలయ్య ఆదుకున్నారు.