MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న సితార... మహేష్ బాబు కూతురు స్టైలిష్ లుక్ వైరల్!

లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న సితార... మహేష్ బాబు కూతురు స్టైలిష్ లుక్ వైరల్!

హీరో మహేష్ బాబు ఫ్యామిలీ వరల్డ్ టూర్ లో ఉన్నారు. ప్రస్తుతం లండన్ నగరంలో ఎంజాయ్ చేస్తున్నారు. సితార ఘట్టమనేని తన వెకేషన్ ఫోటోలు పంచుకోగా వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 02 2023, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sitara Ghattamaneni

Sitara Ghattamaneni


ఏ మాత్రం విరామం దొరికినా విదేశాలకు చెక్కేస్తోంది హీరో మహేష్ బాబు ఫ్యామిలీ. దాదాపు ప్రపంచం మొత్తాన్ని వీరు చుట్టేశారు. ప్రస్తుతం లండన్ లో మహేష్, నమ్రత, గౌతమ్, సితార ఉన్నారు. సితార లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతుంది. ట్రెండీ వేర్లో సూపర్ స్టైలిష్ గా ఉన్న సితార లుక్ వైరల్ అవుతుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sitara Ghattamaneni

Sitara Ghattamaneni

11 ఏళ్లకే సితార సెలబ్రిటీ హోదా దక్కించుకుంది. అలాగే సంపాదనలో దూసుకుపోతుంది. ఇటీవల సితార ఓ ఇంటర్నేషనల్ జ్యూవెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా చేసింది. సితార పీఎంజే జ్యూవెలరీ బ్రాండ్ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార హోర్డింగ్స్ ప్రదర్శించారు. 

37
Sitara Ghattamaneni

Sitara Ghattamaneni

ప్రఖ్యాత స్ట్రీట్ లో సితార ఫోటోలు దర్శనమివ్వడంతో మహేష్ బాబు మురిసిపోయారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో స్పందించారు. 'టైం స్క్వేర్ స్ట్రీట్ లో వెలిగిపోతున్నావు. చాలా గర్వంగా ఉంది సీమటపాకాయ్. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను...' అంటూ కామెంట్ చేశారు. 


 

47
Sitara Ghattamaneni

Sitara Ghattamaneni

ఈ యాడ్ కి సితార కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట. తన మొదటి సంపాదన ఛారిటీకి డొనేట్ చేసినట్లు సితార వెల్లడించింది. పుట్టినరోజు నాడు పేద బాలికలకు సైకిల్స్ తన సంపాదనతో కొనిపెట్టింది. ఆ బాలికల సమక్షంలో బర్త్ డే జరుపుకుంది. వారితో కాసేపు ముచ్చటించింది. 

57
Sitara Ghattamaneni

Sitara Ghattamaneni

ఇక సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.  ఈ స్టార్ కిడ్ లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. దానికి కారణం ఆమె టాలెంట్ కూడా. సితార తరచుగా డాన్స్ వీడియోలు చేస్తుంటారు. అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు. సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తుంటారు. కేవలం మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.


 

67
Sitara Ghattamaneni

Sitara Ghattamaneni

యానీ మాస్టర్ వద్ద సితార డాన్సులు శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏమైనా సితార చిన్నప్పటి నుండి కళలపై మక్కువ పెంచుకుంటూ, వాటిని అభ్యసిస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటున్నారు. 

77

త్వరలో సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. సర్కారు వారి పాట మూవీలో 'పెన్నీ' సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన విషయం తెలిసిందే. పిల్లలను ప్రాణంగా ప్రేమించే మహేష్ వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తారు అనడంలో సందేహం లేదు. ఒక వేళ సితార నటనను కెరీర్ గా ఎంచుకుంటే ఆయన మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఇక కొడుకు గౌతమ్ మహేష్ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కావడం అనివార్యం. చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌతమ్ వన్ నేనొక్కడినే చిత్రంలో నటించారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
Recommended image2
Singer Sunitha: 18 ఏళ్ళ వయసులోనే చూశా, అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు..సంచలన నిజాలు బయటపెట్టిన సింగర్ సునీత
Recommended image3
OTT Top 10 Movies: ఇండియా వైడ్‌గా ఓటీటీలో దుమ్ములేపుతున్న ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ప్రైమ్‌లో టాప్‌ 10 మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved