Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Sitara Ghattamaneni: నీలిరంగు గౌనులో చందమామలా... క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తున్న మహేష్ కూతురు సితార

Sitara Ghattamaneni: నీలిరంగు గౌనులో చందమామలా... క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తున్న మహేష్ కూతురు సితార

పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni). మహేష్ కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న సితార... ఈ తరం కిడ్స్ కి రోల్ మోడల్ అని చెప్పాలి.     

Sambi Reddy | Updated : Jan 04 2022, 04:27 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image


అతి తక్కువ ప్రాయంలోనే అనేక సామాజిక విషయాలపై ఆమెకు అవగాహన ఉంది. ఇక సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ టూర్స్, వెకేషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. తరచుగా ఆమె ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తుంది.
 

27
Asianet Image


సితార ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఏకంగా హాఫ్ మిలియన్ నెటిజెన్స్ ఆమెను ఫాలో అవుతున్నారు. ఒక చిన్నారికి ఐదు లక్షల మంది అనుచరులు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఇది ఒక రికార్డు కూడా. ఇండియాలో మహేష్ (Mahesh Babu)కూతురు సితారకు ఉన్నంత మంది ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ మరో స్టార్ కిడ్ కి లేరు. 
 

37
Asianet Image

సితార పేరున ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. సదరు ఛానల్ లో పలు ట్రావెల్, సోషల్ అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తుంది. సీతారకు దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య క్లోజ్ ఫ్రెండ్. వీరిద్దరూ కలిసి ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. మట్టి వినాయకుడిని పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటూ సోషల్ మెసేజ్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. 

47
Asianet Image

ఇక ఇంస్టాగ్రామ్ లో సితార పంచుకునే ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. మహేష్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ వీడియోలు చేయడం సీతారకు భలే సరదా. అప్పుడప్పుడు తన సింగింగ్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. 
 

57
Asianet Image

మహేష్ కొడుకు గౌతమ్ (Gautham) సితారకు పూర్తి విరుద్ధం. గౌతమ్ అసలు సోషల్ మీడియాను ఫాలో కాడు. అతడికి అకౌంట్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఆ ఫ్యామిలీ లో నమ్రత, మహేష్, సితార సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా ఉంటారు. వాళ్ళ ఫోటోలలో గౌతమ్ కనిపిస్తూ ఉంటారు.

67
Asianet Image


సితార పేరెంట్స్ తో పాటు దుబాయ్ వెళ్లారు. మహేష్ సితారతో కలిసి దుబాయ్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. షాపింగ్స్ చేస్తూ, సినిమాలు చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. వారి దుబాయ్ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ కావడం జరిగింది.

77
Asianet Image


పిల్లలను ప్రాణప్రదంగా ప్రేమించే మహేష్ వాళ్లే ప్రపంచంగా బ్రతికేస్తారు. షూటింగ్స్ కి ఏమాత్రం బ్రేక్ దొరికినా వరల్డ్ టూర్ కి వెళ్ళిపోతారు. ప్రపంచంలో అందమైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నా... చుట్టివస్తారు. ఫ్రెండ్స్, పార్టీలంటే ఇష్టపడని మహేష్ ఇంట్లో కూడా తన టైం సితార, గౌతమ్ తో గడిపేస్తారు.

Also read Sudigali Sudheer:ఆల్రెడీ ఢీ మానేశాను... అది మాత్రం మానడం కుదరదు... బాంబు పేల్చిన సుడిగాలి సుధీర్

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories